Indian Independence: నా జెండా
ABN , Publish Date - Aug 15 , 2025 | 01:42 AM
దారం సమైక్యగీతానికి బాణీ కట్టింది దండలో రంగురంగుల పూలు గొంతువిప్పాయి గాంధీ – స్వేచ్ఛగా ఎగురుతున్న శాంతి కపోతాన్ని చూశాడేమో దేశపటాన్ని బాగా గీశాడు...
దారం సమైక్యగీతానికి బాణీ కట్టింది
దండలో రంగురంగుల పూలు
గొంతువిప్పాయి
గాంధీ –
స్వేచ్ఛగా ఎగురుతున్న
శాంతి కపోతాన్ని చూశాడేమో
దేశపటాన్ని బాగా గీశాడు
సమూహాన్ని నడిపించే
ఇంధన రహస్యం
గాంధీకి మాత్రమే తెలుసు
తుపాకీపై పావురం వాలింది
ఆంగ్లేయులపై అహింసావాది
ముందుకు సాగిపో!
అదిగో! నువ్వెగరేసే జెండా
కశ్మీరు కుంకుమ దిద్దుకొన్నాను
మల్లెలు తురుముకొన్నాను
ఆకుపచ్చ ఖద్దరు చీర ధరించాను
ఆయుధం లేకుండా గెలిచిన వీరనారిని
నా జెండా – రెపరెపల భాషలో
దేశభక్తి గీతాల్ని
ఆలపిస్తోంది
రసరాజు
ఈ వార్తలు కూడా చదవండి..
పలు జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్స్..
సీఎంపై ప్రశంసలు.. ఎమ్మెల్యేను బహిష్కరించిన పార్టీ
For More AndhraPradesh News And Telugu News