Share News

DJ Sound Pollution: ప్రాణాంతకంగా మారుతున్న డీజే లు

ABN , Publish Date - Sep 26 , 2025 | 12:39 AM

సుమధుర సంగీతానికి రాళ్లయినా కరుగుతాయి, రోగాలు కూడా నయమవుతాయి అని నానుడి. కానీ ఇప్పుడొస్తున్న డీజే సంగీతం ప్రాణాంతకంగా ఉంటోంది. వేలంవెర్రిగా నేడు అన్ని ఫంక్షన్లలో ఇదే రొద. ఇండోర్, అవుట్‌డోర్ ఈవెంట్లలోనూ ఆ రణగొణ...

DJ Sound Pollution: ప్రాణాంతకంగా మారుతున్న డీజే లు

సుమధుర సంగీతానికి రాళ్లయినా కరుగుతాయి, రోగాలు కూడా నయమవుతాయి అని నానుడి. కానీ ఇప్పుడొస్తున్న డీజే సంగీతం ప్రాణాంతకంగా ఉంటోంది. వేలంవెర్రిగా నేడు అన్ని ఫంక్షన్లలో ఇదే రొద. ఇండోర్, అవుట్‌డోర్ ఈవెంట్లలోనూ ఆ రణగొణ ధ్వనులకే ప్రాధాన్యం. పెళ్లిళ్లు, ఉత్సవాలు, ఫంక్షన్లలో మోగుతున్న డీజే సౌండ్లకు గుండెలు ఆగిపోతున్నాయి. ఓ పక్క పోలీసులు హెచ్చరికలు చేస్తున్నా, మరోవైపు నిండు ప్రాణాలు నేల రాలుతున్నా, సరదా మూకలు ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఒకప్పుడు ఫంక్షన్లలో ఎక్కువగా సంప్రదాయ సంగీతం లేదా, బ్యాండ్‌మేళం లేదా, ఆర్కెస్ర్టా వంటివి ఉండేవి. వీటిలో గాయకులు సినిమా పాటలు పాడుతూ అందరినీ ఆహ్లాదపరిచేవారు. ఇప్పుడవేవీ లేవు. రోడ్లపై పెద్ద పెద్ద శబ్దాలతో ఊరేగింపులు నిర్వహిస్తున్నారు. రద్దీగా ఉండే జనావాసాల మధ్య అదే పనిగా ఏర్పాటు చేస్తున్న డీజే శబ్దాలను ఇష్టమున్నా లేకున్నా అక్కడివారంతా భరించాల్సి వస్తోంది. ప్రాణాంతకమైన ఈ భీకరశబ్దాలపై నిషేధపు ఉత్తర్వులను ఇటు నిర్వాహకులు గానీ అటు నియంత్రించాల్సినవారు గానీ ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. దసరా ఉత్సవాల్లోనైనా డీజేలు పెట్టకుండా కట్టుదిట్టమైన చర్యలకు పోలీసులు ఉపక్రమించాలి. ఈ డీజేలకు మరికొంతమంది బలి కాకుండా చూడాలి.

డొంకాడ గోపాల్

Also Read:

ఎవరైనా ఆడబిడ్డల జోలికి వచ్చారో.. సీఎం డెడ్లీ వార్నింగ్

వైసీపీ హయాంలో చిరంజీవిని అవమానించారంటూ బాలయ్య ఫైర్..

Updated Date - Sep 26 , 2025 | 12:39 AM