Cancellation of Navy Day: నావికాదళాలకు అవమానం
ABN , Publish Date - Dec 05 , 2025 | 04:10 AM
దాదాపు అయిదున్నర దశాబ్దాలుగా భారత నౌకాదళం ఏటా డిసెంబర్ 4న నౌకాదళ దినోత్సవాన్ని జరుపుతోంది. దీని నేపథ్యం ఈ తరం వారికి తెలియకపోవచ్చు. 1971లో బంగ్లాదేశ్ ఆవిర్భావానికి
దాదాపు అయిదున్నర దశాబ్దాలుగా భారత నౌకాదళం ఏటా డిసెంబర్ 4న నౌకాదళ దినోత్సవాన్ని జరుపుతోంది. దీని నేపథ్యం ఈ తరం వారికి తెలియకపోవచ్చు. 1971లో బంగ్లాదేశ్ ఆవిర్భావానికి మద్దతుగా, పాకిస్థాన్‌తో భారత్ యుద్ధం చేసిన సందర్భంలో ఒక మహోజ్వల దినం డిసెంబరు 4. పాక్ సబ్‌మెరైన్ ‘ఘాజీ’ చాకచక్యంగా భారత సముద్రతీరంలోకి ప్రవేశించి, విశాఖ తీరానికి చేరువైంది. దీన్ని పసిగట్టిన ‘ఐఎన్‌ఎస్ రాజ్‌పుత్’ అనే భారత నావికాదళ నౌక, ఘాజీని ధ్వంసం చేసింది. దాంతో పాకిస్థాన్ యుద్ధ ప్రతాపం నిర్వీర్యమైపోయింది. ఆ విజయానికి ప్రతీకగా రక్షణశాఖ 1972 నుంచి ఏటా ఆ తేదీన విశాఖలో నేవీ డే జరుపుతోంది.
వచ్చే ఏడాది జరగనున్న ఐఎఫ్‌ఆర్ (ఇన్‌స్ర్టుమెంట్ ఫ్లైట్ రూల్స్)ను సాకుగా చూపి, ఈ ఏడాది నేవీ డేను రద్దు చేయడం– ఆనాటి సమరంలో పాల్గొని విజయం సాధించిన నౌకాదళాన్ని అవమానించడమే. 2016లోనూ విశాఖసాగరంపై ఐఎఫ్‌ఆర్ జరిగింది. అప్పుడు లేని ఇబ్బందులు శాస్ర్త సాంకేతిక పరిజ్ఞానం పెరిగిన ఈ దశలో ఏమొచ్చాయో రక్షణశాఖకే తెలియాలి. ప్రతి ఏడాది డిసెంబర్ 4న విశాఖతీరంలో లక్షలాదిమంది ప్రజలు దేశభక్తితో పాల్గొని, నాటి నావికులకు నివాళిని, నేటి నావికులకు స్ఫూర్తిని అందించడం ఆనవాయితీ. విశాఖలోని ఆర్కే బీచ్‌లో నాటి ఐఎన్‌ఎస్ రాజ్‌పుత్ శౌర్యానికి ప్రతీకగా నిలిచిన ‘విక్టరీ @ సీ’ విజయస్థూపం నేడు విచారవదనంతో చూస్తోంది.
బి.వి అప్పారావు
ఈ వార్తలు కూడా చదవండి
'తెలుగు చదువుకుంటేనే ఉద్యోగం'.. వెంకయ్యనాయిడు కీలక వ్యాఖ్యలు!
పదవి పోయిన తర్వాత ఏపీలో ఎన్ని రోజులు ఉన్నావ్ జగన్: అనిత
Read Latest AP News And Telugu News