Telugu Emotional Poetry: అంతర్వాహిని
ABN , Publish Date - Dec 29 , 2025 | 05:45 AM
ముందుగా రచించి పెట్టినట్టు జీవితం నడుస్తుంటుంది నువ్వో నదిలా నాలో కదులుతుంటావు నను కదిలిస్తుంటావు చేతులు కాళ్ళు...
ముందుగా రచించి పెట్టినట్టు
జీవితం నడుస్తుంటుంది
నువ్వో నదిలా
నాలో కదులుతుంటావు
నను కదిలిస్తుంటావు
చేతులు కాళ్ళు
ఇంద్రియాలన్నీ
తమ పని తాము చేసుకుపోతుంటాయి
నువ్వో నదిలా
లోన ప్రవహిస్తుంటావు
నాలో చలనమవుతుంటావు
నవ్వు ఏడుపు కోపము
అసహాయత అసహనం
అనుభూతులన్నీ అలలై ఎగుస్తుంటాయి
నువ్వో నదిలా
లోలో చుట్టుకుంటావు
నను నిశ్చింత చేస్తావు
నాకై నదివవుతావే
నిజానికి నువ్వో సంద్రం
ఫణిమాధవి కన్నోజు
76598 34544
ఇవి కూడా చదవండి
వివాహ వేడుకలోకి అతిథుల్లా వచ్చారు.. అంతా చూస్తుండగానే..
బురదలో ఆహారం కోసం వెతుకుతున్న చిరుత.. చివరకు ముందున్న దృశ్యం చూసి..