Share News

A Poetic Reflection on Natures Pain: ప్రతీక్ష

ABN , Publish Date - Dec 08 , 2025 | 06:31 AM

గూడెం గుమ్మంలో మొలిచింది అమ్మోరు దేవతలాంటి చెట్టు దాని పచ్చని కాంతులు దిక్కులకు రంగులు దిద్దాయి...

A Poetic Reflection on Natures Pain: ప్రతీక్ష

గూడెం గుమ్మంలో మొలిచింది

అమ్మోరు దేవతలాంటి చెట్టు

దాని పచ్చని కాంతులు

దిక్కులకు రంగులు దిద్దాయి

ఆ నిప్పుల వేడిలోనే

రాత్రికి చకచకా పదును పెట్టారు

మెరుపు కళ్లకు గోరింటలు దిద్దారు

చివరాఖరకు, చీడ చెరబట్టింది

అడవిని కాలం ఎరుగని చీకటి కమ్మింది

చెట్టు శిశిరానికి తలవంచింది

పశ్చాతాపంతో పిట్టలన్నీ

రెక్కల్ని అవనతం చేశాయి

వేలాది చుంబానాల మధ్య

దగ్ధ జ్ఞాపకమైన మొద్దు

వసంతాన్ని ప్రాధేయపడుతోంది

దేశరాజు

ఈ వార్తలు కూడా చదవండి..

సిరీస్ మొత్తంలో గర్వపడింది అప్పుడే: కేఎల్ రాహుల్

రికార్డులకే ‘కింగ్’.. సచిన్ మరో రికార్డు బద్దలు!

Updated Date - Dec 08 , 2025 | 06:32 AM