Share News

ఈ వారం ఆ రాశి వారు కొత్త యత్నాలు చేపడతారు..

ABN , Publish Date - Oct 19 , 2025 | 07:42 AM

ఈ వారం ఆ రాశి వారు కొత్త యత్నాలు చేపడతారని ప్రముఖ జ్యోతిష్య పండితులు తెలుపుతున్నారు. అయితే.. కొన్ని విషయాలలో జాగ్రత్తగా ఉంటే మంచిదని, రావాల్సిన డబ్బు అందే అవకాశం ఉందని తెలుపుతున్నారు. అలాగే.. గ్రహసంచారం బాగుందని, కొత్తయత్నాలు చేపడతారని తెలుపుతున్నారు. ఇక.. ఈ వారం ఎవరెవరి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే...

ఈ వారం ఆ రాశి వారు కొత్త యత్నాలు చేపడతారు..

అనుగ్రహం

19 - 25 అక్టోబర్‌ 2025

పి.ప్రసూనా రామన్‌

మేషం

అశ్విని, భరణి,

కృత్తిక 1వ పాదం

అన్నివిధాలా యోగదాయ కమే. కార్యసిద్థి, వ్యవహారజయం ఉన్నాయి. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. ఏకపక్ష నిర్ణయాలు తగవు. పెద్దలను సంప్రదించండి. విలాసాలకు విపరీతంగా ఖర్చు చేస్తారు. చేస్తున్న పనులపై శ్రద్థ వహించండి. బంధువుల రాక సంతోషం కలిగిస్తుంది. మీ సాయంతో ఒకరు లబ్ధి పొందుతారు. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోవద్దు. మితంగా సంభాషించండి. ధార్మికత పెంపొందుతుంది.


వృషభం

కృత్తిక 2,3,4; రోహిణి,

మృగశిర 1,2 పాదాలు

గ్రహసంచారం బాగుంది. బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తారు. మీ కృషికి అదృష్టం తోడవుతుంది. అవకాశాలు కలిసివస్తాయి. సంబంధం లేని విషయాల జోలికి పోవద్దు. లావాదేవీల్లో ఏకాగ్రత వహిం చండి. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుం టాయి. చెల్లింపుల్లో అలక్ష్యం తగదు. పనులు త్వరితగతిన చురుకుగా సాగుతాయి. పరిచ యస్తులను విందుకు ఆహ్వానిస్తారు. కనిపించ కుండా పోయిన పత్రాలు లభ్యమవుతాయి.


మిథునం

మృగశిర 3,4; ఆర్ద్ర,

పునర్వసు 1,2,3 పాదాలు

కొత్తయత్నాలు చేపడతారు. పెద్దల ప్రోత్సాహం ఉంటుంది. విలాసాలకు ఖర్చుచేస్తారు. అప్రమత్తంగా ఉండాల్సిన సమ యం. అత్యుత్సాహం ప్రదర్శించవద్దు. ఆత్మీ యులతో తరచూ సంభాషిస్తారు. చెల్లింపులు, పత్రాల రెన్యువల్‌లో అలక్ష్యం తగదు. పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోండి. ఆహ్వానం అందుకుంటారు. ఒక సమాచారం ఉత్సాహా న్నిస్తుంది. సంస్థల స్థాపనలకు అనుకూలం. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది.


కర్కాటకం

పునర్వసు 4వ

పాదం, పుష్యమి, ఆశ్లేష

పరిస్థితులు క్రమంగా చక్కబడతాయి. అవిశ్రాంతంగా శ్రమిస్తారు. మీ కృషి ఫలిస్తుంది. ఆందోళన తగ్గి కుదుట పడతారు. ముఖ్యమైన వ్యవహారాలు పురోగ తిన సాగుతాయి. మీ అభిప్రాయాలకు స్పం దన లభిస్తుంది. మొదలెట్టిన పనులుమధ్యలో ఆపివేయొద్దు. ఖర్చులు భారమనిపించవు. ఇతరుల కోసం విపరీతంగా ఖర్చు చేస్తారు. అపరిచితులను ఓ కంట కనిపెట్టండి. వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి.


సింహం

మఖ, పుబ్బ,

ఉత్తర 1వ పాదం

ఆర్థికంగా ఫర్వాలేదనిపిస్తుంది. భవిష్యత్తులో ధనసమస్య తలెత్తకుండా జాగ్రత్తపడండి. ఆటంకాలెదురైనా పనులు పూర్తి చేయగలుగుతారు. కొత్తవారితో మితంగా సంభాషించండి. అయినవారితో కాలక్షేపం చేస్తారు. చిన్ననాటి పరిచయస్తుల కలయిక ఉత్సాహం కలిగిస్తుంది. పత్రాల్లో సవరణలు సాధ్యపడతాయి. వివాహయత్నం ఫలించే సూచనలున్నాయి. తాహతుకు మించి హామీలివ్వవద్దు. పెద్దల సలహా పాటించండి.


కన్య

ఉత్తర 2,3,4; హస్త,

చిత్త 1,2 పాదాలు

కార్యసిద్ధికి సంకల్పబలం ముఖ్యం. పట్టుదలతో శ్రమించండి. సంప్ర దింపులు కొలిక్కివస్తాయి. ఒప్పందాల్లో జాగ్రత్త. మీ నిర్ణయం వాయిదా వేయటం శ్రేయస్కరం. పెద్దల సలహా పాటించండి. పెద్దఖర్చు ఎదురవుతుంది. ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు. ఇతరులను మీ విషయాలకు దూరంగా ఉంచండి. పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. పత్రాల్లో సవరణలు సాధ్యం కాదు.


తుల

చిత్త 3,4; స్వాతి,

విశాఖ 1,2,3 పాదాలు

మీ నేర్పునకు పరీక్షా సమ యం. పరిచయస్తుల వ్యాఖ్యలు నిరుత్సాహ పరుస్తాయి. ధైర్యంగా ముందుకు సాగండి. సాయం ఆశించవద్దు. స్వయంకృషితోనే లక్ష్యం సాధిస్తారు. ఊహించని ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. అవసరాలు, చెల్లింపులు వాయిదా వేసుకుంటారు. పనులు అనుకున్న విధంగా పూర్తవుతాయి. సన్నిహితులతో తరచూ కాలక్షేపం చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొంటారు.


వృశ్చికం

విశాఖ 4వ పాదం; అనూరాధ, జ్యేష్ఠ

మీ కష్టం వృథాకాదు. లక్ష్యానికి చేరువవుతారు. రుణ సమస్యలు తొలగు తాయి. పొదుపు పథకాలపై దృష్టి పెడతారు. చిట్స్‌, ఫైనాన్సుల జోలికి పోవద్దు. నమ్మకస్తులే తప్పుదారి పట్టించే ఆస్కారం ఉంది. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేస్తారు. మీ సాయంతో ఒకరికి సదవకాశం లభిస్తుంది. పిల్లల కదలికలను గమనించండి. ఏ విషయాన్నీ తొందరగా నమ్మవద్దు. దూరపు బంధువుల ఆహ్వానం అందుకుంటారు.


ధనుస్సు

మూల, పూర్వాషాఢ,

ఉత్తరాషాఢ 1వ పాదం

లావాదేవీలు ముగుస్తాయి. రుణసమస్య పరిష్కారమవుతుంది. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. పనులు త్వరితగతిన సాగుతాయి. అనుకోని సంఘటన ఎదురవు తుంది. కార్యక్రమాలు వాయిదా వేసుకుం టారు. మీ శ్రీమతికి అన్ని విషయాలు తెలిజే యండి. కొత్త యత్నం చేపడతారు. సలహాలు, సాయం ఆశించవద్దు. కొందరి వ్యాఖ్యలు నిరుత్సాహపరుస్తాయి. మీ కృషి తక్షణం ఫలిస్తుంది. ఫోన్‌ సందేశాలకు స్పందించవద్దు.


మకరం

ఉత్తరాషాఢ 2,3,4;

శ్రవణం, ధనిష్ట 1,2 పాదాలు

అనుకూలతలు నెలకొంటాయి. లక్ష్యానికి చేరువవుతారు. ఆలోచనలు కార్య రూపం దాల్చుతాయి. విలాసాలకు విపరీ తంగా ఖర్చుచేస్తారు. మీ చొరవతో వివాదం సద్దుమణుగుతుంది. ఆహ్వానం అందుకుం టారు. అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. పనులు, బాధ్యతలు పురమాయించవద్దు. నమ్మకస్తులే తప్పుదారి పట్టించే ఆస్కారం ఉంది. పత్రాలు, నగదు జాగ్రత్త. తరచూ ఆత్మీయులతో సంభాషిస్తుంటారు.


కుంభం

ధనిష్ట 3,4; శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు

దృఢసంకల్పంతో కార్యసిద్థికి శ్రమించండి. మీ కష్టం వృథాకాదు. సంతోషక రమైన వార్త వింటారు. ఇంటి విషయాలు పట్టించుకోండి. ఆశలొదిలేసుకున్న ధనం అందుతుంది. ఆర్భాటాలకు విపరీతంగా ఖర్చు చేస్తారు. కొన్ని పనులు అనుకోకుండా పూర్తవు తాయి. నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. చుట్టుపక్కల వారిని గమనించండి. ఉల్లాసంగా గడుపుతారు. ముఖ్యమైన పత్రాలు అందుతాయి. గృహమార్పు అనివార్యం.


మీనం

పూర్వాభాద్ర 4వ

పాదం, ఉత్తరాభాద్ర, రేవతి

సత్ఫలితాలు గోచరిస్తున్నాయి. దృఢసంకల్పంతో ముందుకు సాగండి. సాయం ఆశించవద్దు. స్వయంకృషితోనే కార్యం సాధిస్తారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. ఆరోగ్యం బాగుం టుంది. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపు తారు. కొంతమొత్తం ధనం అందుతుంది. పొదుపు పథకాల పట్ల ఆకర్షితులవుతారు. ప్రైవేట్‌ సంస్థల్లో మదుపు తగదు. వినోదాలు, ముఖ్యమైన వివరాలు గోప్యంగా ఉంచండి.

Updated Date - Oct 19 , 2025 | 07:42 AM