Share News

ఆ రాశి వారికి ఈ వారం ఆర్ధికంగా మంచి ఫలితాలున్నాయి..

ABN , Publish Date - Jun 29 , 2025 | 07:23 AM

ఆ రాశివారు దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారని ప్రముఖ జ్యోతిష్య పండితులు తెలుపుతున్నారు.

ఆ రాశి వారికి ఈ వారం ఆర్ధికంగా మంచి ఫలితాలున్నాయి..

ఆ రాశివారు దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారని ప్రముఖ జ్యోతిష్య పండితులు తెలుపుతున్నారు. అలాగే.. పరిస్థితులు చక్కబడతాయని, ఒక సమాచారం ఆలోచింప చేస్తుందని తెలుసుతుప్పారు. ఇంకా.. ఈ వారం రాశిఫలాలు ఏ విధంగా ఉన్నాయంటే..

అనుగ్రహం

29 జూన్‌- 5 జూలై 2025

పి.ప్రసూనా రామన్‌

మేషం

అశ్విని, భరణి,

కృత్తిక 1వ పాదం

తలపెట్టిన కార్యం నెరవేరు తుంది. కొత్త విషయాలు తెలుసుకుంటారు. దూరపు బంధుత్వాలు బలపడతాయి. వ్యూహా త్మకంగా అడుగులేస్తారు. మీ కృషి ఫలిస్తుంది. ఉల్లాసంగా గడుపుతారు. ఖర్చులు అదుపులో ఉండవు. ధనసహాయం తగదు. చెల్లింపుల్లో జాగ్రత్త. బాధ్యతలు స్వయంగా చూసుకోండి. ఒత్తిళ్లకు గురికావద్దు. మీ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుంది. మానసికంగా కుదుట పడతారు. పిల్లల విద్యాయత్నం ఫలిస్తుంది.


వృషభం

కృత్తిక 2,3,4; రోహిణి,

మృగశిర 1,2 పాదాలు

పరిస్థితులు చక్కబడతాయి. దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు. గృహంలో ప్రశాంతత నెలకొంటుంది. ఖర్చులు సామాన్యం. పొదుపు పఽథకాలపై దృష్టి పెడ తారు. ఫైనాన్స్‌, చిట్స్‌ రంగాల జోలికి పోవద్దు. వివాదాస్పద విషయాలకు దూరంగా ఉం డండి. ఆరోగ్యం జాగ్రత్త. ఆహార నియమాలు కచ్చితంగా పాటించండి. దూరపు బంధువు లతో సంభాషిస్తారు. కొన్ని తప్పిదాలకు మూల్యం చెల్లించుకోవలసి వస్తుంది.


మిథునం

మృగశిర 3,4; ఆర్ద్ర,

పునర్వసు 1,2,3 పాదాలు

తప్పటడుగు వేస్తారు. మీ కృషిలో లోపం లేకుండా చూసుకోండి. మీ తప్పిదాలకు ఇతరులను నిందించవద్దు. దృఢ సంకల్పంతో శ్రమించండి. మీ కృషి తక్షణం ఫలిస్తుంది. ఖర్చులు అదుపులో ఉండవు. రుణాలు, చేబదుళ్లు స్వీకరిస్తారు. ఆత్మీయులతో సంభాషణ ఉత్తేజపరుస్తుంది. అర్థాంతరంగా ముగించిన పనులు పూర్తిచేస్తారు. నోటీసులు అందుకుంటారు. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. పిల్లలకు శుభయోగం.


కర్కాటకం

పునర్వసు 4వ

పాదం, పుష్యమి, ఆశ్లేష

ఒక సమాచారం ఆలోచింప చేస్తుంది. పరిస్థితులకు అనుగుణంగా మెల గండి. ప్రలోభాలకు లొంగవద్దు. ప్రతి విష యం క్షుణ్ణంగా తెలుసుకోండి. సన్నిహితులకు మీ సమస్యను తెలియజేయండి. చేస్తున్న పనులు అర్థాంతరంగా ముగిస్తారు. ముఖ్యుల కలయిక వీలుపడదు. ధైర్యంగా యత్నాలు సాగిస్తారు. పిల్లలకు శుభం జరుగుతుంది. ముఖ్యమైన పత్రాలు అందుకుంటారు.మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది.


సింహం

మఖ, పుబ్బ,

ఉత్తర 1వ పాదం

శుభసమయం నడుస్తోంది. పరిస్థితులు చక్కబడతాయి. చిత్తశుద్ధిని చాటు కుంటారు. పనులు చురుకుగా సాగుతాయి. ఆదాయం సంతృప్తికరం. పొదుపు పథకాలపై దృష్టి పెడతారు. ప్రైవేట్‌ సంస్థల్లో మదుపు తగదు. అందరితోనూ మితంగా సంభాషిం చండి. మీ వ్యాఖ్యలను కొంతమంది వక్రీక రిస్తారు. స్థిరచరాస్తుల వ్యవహారంలో తొందర పాటు తగదు. అనుభవజ్ఞుల సలహా తీసు కోండి. ప్రయాణం ప్రశాంతంగా సాగుతుంది.


కన్య

ఉత్తర 2,3,4; హస్త,

చిత్త 1,2 పాదాలు

లావాదేవీలతో తీరిక ఉండదు. శ్రమాధిక్యత, అకాలభోజనం. సావకాశంగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఏ విష యాన్నీ తీవ్రంగా భావించవద్దు. కొన్నిపనులు అనుకోకుండా పూర్తవుతాయి. ఒక అవసరానికి ఉంచిన ధనం మరోదానికి ఖర్చుచేస్తారు. ఆత్మీయులతో సంభాషణ ఉత్సాహపరుస్తుంది. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమ వుతాయి. గత సంఘటనలు అనుభూతిని స్తాయి. దైవకార్య సమావేశంలో పాల్గొంటారు.


తుల

చిత్త 3,4; స్వాతి,

విశాఖ 1,2,3 పాదాలు

ఆర్థికంగా మంచి ఫలితాలు న్నాయి. ఆర్భాటాలకు ఖర్చుచేస్తారు. బంధు మిత్రుల రాకపోకలు అధికమవుతాయి. కొత్త పనులకు ప్రణాళికలు వేసుకుంటారు.పత్రాల్లో సవరణలు సాధ్యమవుతాయి. ఇతరుల విష యాల్లో జోక్యం తగదు. ఆరోగ్యం జాగ్రత్త. పత్రాలు అందుకుంటారు. ఆత్మీయులతో తరచుగా సంభాషిస్తారు. ఒక సంఘటన ఆందోళన కలిగిస్తుంది. విజ్ఞతతో సమస్యలు పరిష్కరించుకుంటారు.


వృశ్చికం

విశాఖ 4వ పాదం; అనూరాధ, జ్యేష్ఠ

కార్యసాధనకు ఓర్పు ముఖ్యం. ఆశావహదృక్పథంతో మెలగండి. అపజయా లకు కుంగిపోవద్దు. ఉత్సాహంగా యత్నాలు సాగించండి. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది. ఊహించని ఖర్చులు ఎదురవుతాయి, ధనం మితంగా ఖర్చుచేయండి. పనులు ఒకపట్టాన పూర్తికావు. చిన్న విషయానికే అసహనం చెం దుతారు. ఆత్మీయులతో సంభాషణ ఉపశమ నం కలిగిస్తుంది. అవగాహన లేనివిషయాల్లో జోక్యం తగదు. ఆరోగ్యం బాగుంటుంది.


ధనుస్సు

మూల, పూర్వాషాఢ,

ఉత్తరాషాఢ 1వ పాదం

లక్ష్యానికి చేరువలో ఉన్నారు. పట్టుదలతో శ్రమిస్తే విజయం తధ్యం. ఆశావహదృక్పథంతో శ్రమించండి. సాయం ఆశించవద్దు. కొందరి వ్యాఖ్యలు నిరుత్సాహ పరుస్తాయి. యత్నాలు విరమించుకోవద్దు. పనులు మొండిగా పూర్తిచేస్తారు. ఖర్చులు వీలైనంత వరకు తగ్గించుకోండి. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. లావాదేవీల్లో అప్రమత్తంగా ఉండాలి. ఒప్పందం విష యంలో తొందరపడవద్దు.


మకరం

ఉత్తరాషాఢ 2,3,4;

శ్రవణం, ధనిష్ట 1,2 పాదాలు

ఏకాగ్రత తగ్గకుండా చూసు కోండి. ఒక సంఘటన సంతోషం కలిగిస్తుంది. వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారు. విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు. కొన్ని పనులు ఆకస్మికంగా పూర్తవుతాయి. ఒక సంబంధం కుదిరే సూచనలున్నాయి. అవతలి వారి స్తోమతను తెలుసుకోండి. తొందరపడి మాట ఇవ్వవద్దు. ఫోన్‌ సందేశాలను పట్టించుకో వద్దు. దూరపు బంధువులతో సంభాషిస్తారు. ఏకాగ్రతతో వాహనం నడపండి.


కుంభం

ధనిష్ట 3,4; శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు

కార్యం సిద్ధిస్తుంది. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. అవకాశాలను అందిపుచ్చుకుంటారు. దూరపు బంధుత్వాలు బలపడతాయి. ఆర్భాటాలకు ఖర్చుచేస్తారు. బాధ్యతలు అప్పగించవద్దు. పెద్దల జోక్యంతో సమస్య పరిష్కారమవు తుంది. స్థిమితంగా పనులు పూర్తిచేస్తారు. ఇంటి విషయాలపై దృష్టి పెడతారు. పత్రాల్లో మార్పులు అనుకూలిస్తాయి. ప్రయాణంలో అపరిచితులతో జాగ్రత్త.


మీనం

పూర్వాభాద్ర 4వ

పాదం, ఉత్తరాభాద్ర, రేవతి

వస్త్రప్రాప్తి, వాహనసౌఖ్యం ఉన్నాయి. సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. వ్యవహారాలు మీ సమక్షంలో సాగుతాయి. ఆర్భాటాలకు విపరీతంగా ఖర్చుచేస్తారు. కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. చేస్తున్న పనులు అర్థాంతరంగా ముగిస్తారు. మీ సిఫార్సుతో ఒకరికి మేలు జరుగుతుంది. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. కీలక పత్రాలు అందుకుంటారు. విందులు, వినోదాల్లో అత్యుత్సాహం తగదు.

Updated Date - Jun 29 , 2025 | 08:02 AM