Weekly Horoscope: ఆ రాశి వారికి డేంజర్.. కాస్త జాగ్రత్త..
ABN , Publish Date - Mar 16 , 2025 | 07:58 AM
ఈ వారం మొత్తం ఆ రాశి వారికి అంతా అనుకూలదాయకంగానే ఉంటుందని జ్యోతిష్య ప్రముఖులు తెలుపుతున్నారు. ఈ వారం రాశిఫలాలు ఏ విధంగా ఉన్నాయో ఓసారి పరిశీలిస్తే..

అనుగ్రహం
16 - 23 మార్చి 2025
పి.ప్రసూనా రామన్
మేషం
అశ్విని, భరణి,
కృత్తిక 1వ పాదం
గ్రహస్థితి నిరాశాజనకం. ఆచితూచి అడుగేయండి. చిన్న విషయానికే ఆందోళన చెందుతారు. ఆప్తులకు మీ సమ స్యలు తెలియజేయండి. కష్టించినా ఫలితం ఉండదు. దుబారా ఖర్చులు విపరీతం. ఆశా వహదృక్పథంతో మెలగండి. ఈ చికాకులు తాత్కాలికమే. త్వరలో శుభవార్త వింటారు. ఆత్మీయుల వ్యాఖ్యలు కార్యోన్ముఖులను చేస్తాయి. కొత్త యత్నాలు మొదలెడతారు. పత్రాల రెన్యువల్‌లో అలక్ష్యం తగదు.
వృషభం
కృత్తిక 2,3,4; రోహిణి,
మృగశిర 1,2 పాదాలు
తలపెట్టిన కార్యం సిద్థిస్తుంది. సంప్రదింపులు కొలిక్కివస్తాయి. సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. పరిచయాలు బలపడతాయి. రావలసిన ధనం అందు తుంది. చేపట్టిన పనులు మధ్యలో నిలిపి వేయవద్దు. ఆంతరంగిక విషయాలు గోప్యంగా ఉంచండి. కీలక పత్రాలు అందుకుంటారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. మీ ప్రమేయంతో ఒకరికి మంచి జరుగుతుంది. శుభకార్యంలో అందరినీ ఆకట్టుకుంటారు.
మిథునం
మృగశిర 3,4; ఆర్ద్ర,
పునర్వసు 1,2,3 పాదాలు
సంతోషకరమైన వార్త వింటారు. వ్యవహారాలు మీ సమక్షంలో సాగు తాయి. వస్త్రప్రాప్తి, వాహనయోగం పొందు తారు. సన్నిహితులకు ధనసహాయం చేస్తారు. పనులు సానుకూలమవుతాయి. పిల్లల మొండితనం అసహనం కలిగిస్తుంది. మీ ఆగ్రహావేశాలు అదుపులో ఉంచుకోండి. ఏ విషయాన్నీ తీవ్రంగా భావించవద్దు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. తీర్థయాత్రకు సన్నాహాలు సాగిస్తారు.
కర్కాటకం
పునర్వసు 4వ
పాదం, పుష్యమి, ఆశ్లేష
ఈ వారం అనుకూలదాయకం. తలపెట్టిన కార్యం నెరవేరుతుంది. బాధ్య తలను సమర్ధంగా నిర్వహిస్తారు. కష్టమను కున్న పనులు తేలికగా పూర్తవుతాయి. పొదుపు ధనం అందుతుంది. విలాసాలకు వ్యయం చేస్తారు. పొగిడే వ్యక్తుల ఆంతర్యం గ్రహించండి. తొందరపడి మాట ఇవ్వవద్దు. మీ శ్రీమతికి అన్ని విషయాలు తెలియ జేయండి. వివాహయత్నం ఫలిస్తుంది. దూరపు బంధుత్వాలు బలపడతాయి.
సింహం
మఖ, పుబ్బ,
ఉత్తర 1వ పాదం
అనుకూలతలు అంతంత మాత్రమే. ఆలోచనలు నిలకడగా ఉండవు. చిన్న విషయానికే చికాకుపడతారు. స్థిమి తంగా ఉండటానికి యత్నించండి. మనస్సుకు నచ్చిన వ్యక్తులతో కాలక్షేపం చేయండి. ఆదా యం బాగుంటుంది. పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు. నోటీసులు అందుకుంటారు. ఇంటి విషయాల పట్ల శ్రద్ధ వహించండి. ఆత్మీయులతో సంభాషణ ఊరటనిస్తుంది. ప్రముఖులకు వీడ్కోలు పలుకుతారు.
కన్య
ఉత్తర 2,3,4; హస్త,
చిత్త 1,2 పాదాలు
ఆర్థికంగా విశేష ఫలితాలున్నాయి. లక్ష్యాన్ని సాధిస్తారు. మొండి బాకీలు వసూలవుతాయి. ఖర్చులు నియంత్రించుకుంటారు. పనులు వేగవంత మవుతాయి. పెద్దల ఆరోగ్యం కుదుట పడుతుంది. తరచూ ఆత్మీయులతో సంభాషిస్తారు. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. శనివారం నాడు కొత్తవ్యక్తులతో మితంగా సంభాషించండి. అనవసర విషయాల్లో జోక్యం తగదు.
తుల
చిత్త 3,4; స్వాతి,
విశాఖ 1,2,3 పాదాలు
కార్యసాధనకు ఓర్పు ప్రధానం. ఆశావహదృక్పథంతో ముందుకు సాగండి. విమర్శలు, వ్యాఖ్యలు పట్టించు కోవద్దు. మీ మాటతీరు అదుపులో ఉంచు కోండి. ఎవరినీ తప్పుపట్టవద్దు. చాకచక్యంగా పనులు చక్కబెట్టుకోవాలి. ఖర్చులు తగ్గించు కోవటం శ్రేయస్కరం. ఆలోచనల్లో మార్పు వస్తుంది. పిల్లల ఉన్నత చదువులపై దృష్టి పెడతారు. ఆరోగ్యం బాగుంటుంది. వేడుకకు హాజరవుతారు.
వృశ్చికం
విశాఖ 4వ పాదం; అనూరాధ, జ్యేష్ఠ
బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తారు. మీ కలుపుగోలుతనం ఆకట్టు కుంటుంది. ప్రముఖులకు చేరువవుతారు. దూరపు బంధుత్వాలు బలపడతాయి. శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. ఆది వారం నాడు పనులు పురమాయించవద్దు. ఆదాయం బాగుంటుంది. ఆర్భాటాలకు ఖర్చు చేస్తారు. ఆలోచనలు కార్యరూపం దాల్చు తాయి. సంతోషకరమైన వార్త వింటారు. కొన్ని అవకాశాలు అప్రయత్నంగా కలిసివస్తాయి.
ధనుస్సు
మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం
ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. రుణ సమస్యలు తొలగుతాయి. మానసికంగా కుదుటపడతారు. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. పెట్టుబడులపై దృష్టిపెడతారు. లావాదేవీల్లో ఆచితూచి అడుగేయండి. ప్రలోభాలకు లొంగవద్దు. ప్రణాళికాబద్థంగా పనులు పూర్తిచేస్తారు. వివాహయత్నం ఫలిస్తుంది. కల్యాణవేదికలు అన్వేషిస్తారు. బంధువుల రాకపోకలు అధికమవుతాయి. గురువారం నాడు అప్రమత్తంగా ఉండాలి.
మకరం
ఉత్తరాషాఢ 2,3,4;
శ్రవణం, ధనిష్ట 1,2 పాదాలు
గ్రహసంచారం అనుకూలంగా ఉంది. కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగు తాయి. మీ సామర్థ్యంపై నమ్మకం కలుగుతుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. గృహం సందడిగా ఉంటుంది. ధన సహాయం తగదు. మీ ఇష్టాయిష్టాలను సున్నితంగా తెలియ జేయండి. ఆరోగ్యం జాగ్రత్త. మీ జోక్యంతో ఒక సమస్య పరిష్కారమవుతుంది.
కుంభం
ధనిష్ట 3,4; శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు
ఆర్థికలావాదేవీలు సంతృప్తి నిస్తాయి. ఆశలొదిలేసుకున్న ధనం అందు తుంది. సమర్థతను చాటుకుంటారు. అవకా శాలు కలిసివస్తాయి. అభీష్టం నెరవేరుతుంది. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. ఖర్చులు అధికం. ముఖ్యమైన పత్రాలు జాగ్రత్త. ఉత్సాహంగా పనులు పూర్తిచేస్తారు. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. అందరితోనూ మితంగా సంభాషించండి. వేడుకకు హాజరవుతారు.
మీనం
పూర్వాభాద్ర 4వ
పాదం, ఉత్తరాభాద్ర, రేవతి
పరిస్థితులు చక్కబడతాయి. అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు. మీ పట్టుదల స్ఫూర్తిదాయకమవుతుంది. ఉత్సాహంగా పనులు పూర్తిచేస్తారు. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. పెద్దఖర్చు తగిలే ఆస్కా రం ఉంది. మీ ఆగ్రహావేశాలు అదుపులో ఉంచుకోండి. సన్నిహితులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. కొత్తయత్నాలకు శ్రీకారం చుడతారు. కలిసివచ్చిన అవకాశాన్ని తక్షణం అందిపుచ్చుకోండి.