ఈ రాశివారు జాక్పాట్ కొడతారు..
ABN , Publish Date - Mar 02 , 2025 | 08:20 AM
చీకటి కొన్నాళ్లూ.. వెన్నెల కొన్నాళ్లు.. అన్న సామెత చందంగా రాశిఫలాలు కూడా మారుతూ ఉంటాయి. ఓ వారంలో ఓ రాశి వారికి కష్టాలు ఎదురైతే.. మరో రాశి వారికి అదృష్టం వెంటపడుతుంటుంది. అలాగే కొందరికి నష్టాలు ఎదురైతే.. మరికొందరికి కనకవర్షం కురుస్తుంటుంది. ఈ వారంలో ఓ రాశి వారికి పలుబడి పెరిగి పరిచయాలు పెరుగుతాయని వేద పండితులు చెబుతున్నారు. ఏ రాశి వారికి ఎలాంటి అనుకూల, ప్రతికూలతలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం..
అనుగ్రహం
2 - 8 మార్చి 2025
పి.ప్రసూనా రామన్
మేషం
అశ్విని, భరణి,
కృత్తిక 1వ పాదం
కార్యసిద్ధికి ఓర్పు, పట్టుదల ప్రధానం. నిరుత్సాహం వీడి యత్నాలు సాగించండి. ఆదాయం అంతంతమాత్రమే. నిస్తేజానికి లోనవుతారు. ఖర్చులు అదుపులో ఉండవు. రుణాలు, చేబదుళ్లు స్వీకరిస్తారు. సన్నిహితుల సాయంతో అవసరం తీరు తుంది. పనులు హడావుడిగా సాగుతాయి. పత్రాల రెన్యువల్‌లో ఏకాగ్రత వహించండి. బాధ్యతలు అప్పగించవద్దు. ఆహ్వానం అందు కుంటారు. ఏకాగ్రతతో వాహనం నడపండి.
వృషభం
కృత్తిక 2,3,4; రోహిణి,
మృగశిర 1,2 పాదాలు
మీ కష్టం ఫలిస్తుంది. వాహన సౌఖ్యం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. పొదుపు ధనం అందుకుంటారు. చేపట్టిన పనులు నిర్విఘ్నంగా సాగుతాయి. కొత్త యత్నాలు మొదలెడతారు. గురువారం నాడు ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. సభ్యత్వాలు స్వీకరిస్తారు. బాధ్యతలు, వ్యాప కాలు అధికమవుతాయి. ఎదురుచూస్తున్న పత్రాలు అందుకుంటారు.
మిథునం
మృగశిర 3,4; ఆర్ద్ర,
పునర్వసు 1,2,3 పాదాలు
గ్రహస్థితి అనుకూలంగా ఉంది. అనుకున్నది సాధిస్తారు. మీ కృషి ప్రశంసనీ యమవుతుంది. లౌక్యంగా పనులు చక్క బెట్టుకుంటారు. తరుచూ ఆత్మీయులతో సంభాషిస్తారు. ఆదివారం నాడు దుబారా ఖర్చులు విపరీతం. చేతిలో ధనం నిలవదు. పిల్లల చదువులపై దృష్టిపెట్టండి. ఆరోగ్యం జాగ్రత్త. ఆహార నియమాలు క్రమం తప్ప కుండా పాటించండి. వేడుకకు హాజరవు తారు. బంధువుల ఆతిథ్యం ఆకట్టుకుంటుంది.
కర్కాటకం
పునర్వసు 4వ
పాదం, పుష్యమి, ఆశ్లేష
సర్వత్రా అనుకూలతలు న్నాయి. పట్టుదలతో శ్రమిస్తే విజయం తథ్యం. ఆశావహదృక్పఽథంతో మెలగండి. సాయం ఆశించవద్దు. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. ఆదాయానికి తగ్గట్టుగా బడ్జెట్ రూపొందించుకుంటారు. పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోండి. సోమవారం నాడు కొత్త వ్యక్తులతో జాగ్రత్త. వాగ్వాదాలకు దిగ వద్దు. ఎదుటివారి తీరును గమనించి మెల గండి. ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు.
సింహం
మఖ, పుబ్బ,
ఉత్తర 1వ పాదం
ఆశయ సాధనకు మరింత శ్రమించాలి. ధైర్యంగా ముందుకు సాగండి. అపోహలకు తావివ్వవద్దు. సంకల్పబలమే మీ విజయానికి దోహదపడుతుంది. చిన్న విషయాన్ని పెద్దది చేసుకోవద్దు. పనులు ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి. ఈ చికాకులు తాత్కాలికమే. ఆశావహదృక్పథంతో అడుగు ముందుకేయండి. బుధవారం నాడు పెద్దఖర్చు తగిలే సూచనలున్నాయి. తెగిపోయిన బంధుత్వాలు బలపడతాయి.
కన్య
ఉత్తర 2,3,4; హస్త,
చిత్త 1,2 పాదాలు
ఆర్థికంగా బాగుంటుంది. రుణవిముక్తులై తాకట్టు విడిపించుకుంటారు. గృహంలో స్తబ్థత తొలగుతుంది. ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు. ఒక సంబంధం కుదిరే సూచనలున్నాయి. అవతలి వారి స్థోమతను క్షుణ్ణంగా తెలుసుకోండి. సన్ని హితులతో సంప్రదింపులు జరుపుతారు. శుక్రవారం నాడు అనవసర జోక్యం తగదు. కీలక పత్రాలు అందుకుంటారు. మీ సిఫార్సుతో ఒకరికి ఉద్యోగం లభిస్తుంది.
తుల
చిత్త 3,4; స్వాతి,
విశాఖ 1,2,3 పాదాలు
గ్రహసంచారం బాగుంది. ధైర్యంగా అడుగు ముందుకేయండి. మీ కష్టం వృథా కాదు. రావలసిన ధనం అందుతుంది. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. సభ్యత్వాల స్వీకరణకు అనుకూలం. అర్థాంతరంగా నిలిపి వేసిన పనులు పూర్తి చేస్తారు. బంధుత్వాలు బలపడతాయి. ఆప్తులతో సంప్రదింపులు జరుపుతారు. మీ ప్రతిపాదనలకు స్పందన లభిస్తుంది. నోటీసులు అందుకుంటారు.
వృశ్చికం
విశాఖ 4వ పాదం; అనూరాధ, జ్యేష్ఠ
ప్రతి విషయంలోనూ మీదే పైచేయి. ఎదుటివారిని ఇట్టే ఆకట్టుకుంటారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. అవ కాశాలను చేజిక్కించుకుంటారు. ఉల్లాసంగా గడుపుతారు. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూల మవుతాయి. ఆరోగ్యం జాగ్రత్త. ఫోన్ సందేశాలకు స్పందించవద్దు. అజ్ఞాత వ్యక్తులు మోసగించేందుకు యత్నిస్తారు. అనవసర బాధ్యతలు చేపట్టవద్దు.
ధనుస్సు
మూల, పూర్వాషాఢ,
ఉత్తరాషాఢ 1వ పాదం
ఈ వారం అనుకూలదాయకం. కార్యసిద్థి, ధనలాభం ఉన్నాయి. బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తారు. మీ సామర్థ్యంపై ఎదుటివారికి గురి కుదురుతుంది. వ్యవ హారాలు మీ సమక్షంలో సాగుతాయి. మీ సలహా ఉభయులకూ ఆమోదయోగ్యమవు తుంది. ఆహ్వానం అందుకుంటారు. తెగిపోయిన సంబంధాలు బలపడతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి.
మకరం
ఉత్తరాషాఢ 2,3,4;
శ్రవణం, ధనిష్ట 1,2 పాదాలు
బాధ్యతలను సమర్థంగా నిర్వ హిస్తారు. మీ కృషి స్ఫూర్తిదాయకమవుతుంది. అందరితో సత్సంబంధాలు నెలకొంటాయి. వ్యవహారాలతో తీరిక ఉండదు. వాహనం కొనుగోలు చేస్తారు. పనులు చురుకుగా సాగుతాయి. కొత్త వ్యక్తులతో మితంగా సంభాషించండి. పిల్లల చదువులపై దృష్టి పెడతారు. పత్రాల రెన్యువల్‌లో ఏకాగ్రత వహించండి. కీలక విషయాల్లో అశ్రద్థ తగదు. ఒత్తిడి పెరగకుండా చూసుకోండి.
కుంభం
ధనిష్ట 3,4; శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు
మీ రంగాల్లో శ్రమ పెరగ కుండా చూసుకోండి. తొందరపడి హామీ లివ్వవద్దు. రావలసిన ధనం అందుతుంది. కొంత మొత్తం పొదుపు చేస్తారు. ఆదివారం నాడు కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. పనులు, కార్యక్రమాలు సాగవు. పత్రాల్లో మార్పుచేర్పులు సాధ్యమవుతాయి. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. సన్నిహితులతో ఉల్లాసంగా గడుపుతారు. మీ సిఫార్సుతో మంచి జరుగుతుంది.
మీనం
పూర్వాభాద్ర 4వ
పాదం, ఉత్తరాభాద్ర, రేవతి
అనుకూలతలు అంతంత మాత్రమే. శ్రమించినా ఫలితం ఉండదు. ఆలోచనలతో సతమతమవుతారు. అవకాశాలు చేజారిపోతాయి. ఆశావహదృక్పథంతో మెల గండి. ఏ విషయాన్నీ సమస్యగా భావించ వద్దు. త్వరలో పరిస్థితులు చక్కబడతాయి. ఆప్తులతో కాలక్షేపం చేయండి. ఆదాయం ఫర్వాలేదనిపిస్తుంది. ఖర్చులు తగ్గించు కుంటారు. ఒక సమాచారం ఉత్సాహపరు స్తుంది. సకాలంలో పనులు పూర్తి చేస్తారు.