Share News

ఈ వారం ఆ రాశివారికి గ్రహాల సంచారం అనుకూలంగా ఉంటుంది..

ABN , Publish Date - May 18 , 2025 | 12:03 PM

ఈ వారం ఆ రాశివారికి గ్రహాల సంచారం అనుకూలంగా ఉంటుందని ప్రముఖ జ్యోతిష్య పండితులు తెలుపుతున్నారు. అలాగే... వ్యవహారానుకూలత ఉందని, ఎంతటివారినైనా ఇట్టే ఆకట్టుకుంటారని తెలుపుతున్నారు. తలపెట్టిన కార్యం విజయవంతమవుతుందని, పెట్టుబడులకు తరుణం కాదని తెలుపుతున్నారు.

ఈ వారం ఆ రాశివారికి గ్రహాల సంచారం అనుకూలంగా ఉంటుంది..

అనుగ్రహం

18 - 24 మే 2025

పి.ప్రసూనా రామన్‌

మేషం

అశ్విని, భరణి,

కృత్తిక 1వ పాదం

ప్రతికూలతలతో సతమత మవుతారు. శ్రమించినా ఫలితం శూన్యం. నిేస్తజానికి లోనవుతారు. ఆకస్మిక ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. చేబదుళ్లు తప్పవు. పరిచయస్తుల వ్యాఖ్యలు నిరుత్సాహపరు స్తాయి. పిల్లల విద్యాయత్నం ఫలిస్తుంది. ఆప్తులతో కాలక్షేపం చేస్తారు. పత్రాల రెన్యు వల్‌లో అలక్ష్యం తగదు. కొత్త యత్నాలు మొదలెడతారు. ఒక ఆహ్వానం ఆలోచింప చేస్తుంది. పాతమిత్రులను కలుసుకుంటారు.


వృషభం

కృత్తిక 2,3,4; రోహిణి,

మృగశిర 1,2 పాదాలు

వాక్చాతుర్యంతో నెట్టుకొస్తారు. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. వ్యతిరేకులను సైతం ఆకట్టుకుంటారు. సంప్ర దింపులకు తగిన సమయం. మీ అభిప్రాయా లకు స్పందన లభిస్తుంది. ఖర్చులు అదుపులో ఉండవు. సోమవారం నాడు కొందరి రాక చికాకుపరుస్తుంది. కార్యక్రమాలు ముందుకు సాగవు. కొత్త పనులు చేపడతారు. అవకా శాలను తక్షణం అందిపుచ్చుకోండి. అనుమా నాలకు తావివ్వవద్దు. ఆరోగ్యం జాగ్రత్త.


మిథునం

మృగశిర 3,4; ఆర్ద్ర,

పునర్వసు 1,2,3 పాదాలు

కార్యసాధనలో సఫలీకృతుల వుతారు. సంకల్పం సిద్ధిస్తుంది. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. యత్నాలను అయినవారు ప్రోత్సహిస్తారు. పలుకుబడి ఉన్నవారితో పరిచయాలేర్పడతాయి. వివా దాస్పద విషయాల జోలికి పోవద్ద్దు. చిత్త శుద్ధితో చేసిన ఉపకారానికి ప్రశంసలందు కుంటారు. పనులు పురమాయించవద్దు. సన్నిహితులతో కాలక్షేపం చేస్తారు. వాయిదా పడిన మొక్కులు తీర్చుకుంటారు.


కర్కాటకం

పునర్వసు 4వ

పాదం, పుష్యమి, ఆశ్లేష

అనవసర ఒత్తిడికి గురి కావద్దు. స్థిమితంగా ఉండటానికి యత్నిం చండి. ఆందోళన కలిగించిన సమస్య నిదా నంగా సద్దుమణుగుతుంది. ఆర్భాటాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. శుక్రవారం నాడు ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. కొన్ని విషయాలు చూసీచూడనట్టు వదిలే యండి. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలను స్పష్టంగా తెలియజేయండి.


సింహం

మఖ, పుబ్బ,

ఉత్తర 1వ పాదం

గ్రహాల సంచారం అనుకూ లంగా ఉంది. అవకాశాలను చేజిక్కించు కుంటారు. గౌరవప్రతిష్టలు పెంపొందుతాయి. వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. పనులు వేగవంతమవుతాయి. పొదుపు ధనం అందు తుంది. శనివారం నాడు అప్రమత్తంగా ఉండాలి. యత్నాలు విరమించుకోవద్దు. పెద్దల ప్రోత్సాహం ఉంటుంది. కనిపించ కుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోవద్దు.


కన్య

ఉత్తర 2,3,4; హస్త,

చిత్త 1,2 పాదాలు

నిర్దేశిత ప్రణాళికలతో యత్నాలు సాగిస్తారు. కష్టమనుకున్న పనులు తేలికవుతాయి. గృహం ప్రశాంతంగా ఉంటుంది. ఖర్చులు విపరీతం. ఆప్తులు సాయం అందిస్తారు. లావాదేవీలతో తీరిక ఉండదు. ఏకపక్షంగా నిర్ణయం తగదు. అనుభవజ్ఞుల సలహా పాటించండి. ఆంత రంగిక విషయాలు గోప్యంగా ఉంచండి. ఆహ్వానం అందుకుంటారు. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు.


తుల

చిత్త 3,4; స్వాతి,

విశాఖ 1,2,3 పాదాలు

అవిశ్రాంతంగా శ్రమిస్తారు. గుట్టుగా మెలగండి. బ్యాంకు వివరాలు వెల్లడించవద్దు. పెద్దఖర్చు తగిలే సూచనలు న్నాయి. పనులు, కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. పిల్లల విద్యాయత్నం ఫలిస్తుంది. ఆందోళన తగ్గి స్థిమితపడతారు. సన్నిహితులతో సంప్రదింపులు జరుపుతారు. ఒక సమాచారం ఆలోచింపజేస్తుంది. గృహ మరమ్మతులు చేపడతారు. పెద్దల జోక్యంతో సమస్య సద్దుమణుగుతుంది.


వృశ్చికం

విశాఖ 4వ పాదం; అనూరాధ, జ్యేష్ఠ

వ్యవహారాల్లో ఏకాగ్రత తగ్గకుండా చూసుకోండి. కొందరి వ్యాఖ్యలు ఉద్రేకపరుస్తాయి. ధైర్యంగా ముందుకు సాగండి. శుభవార్త వింటారు. దుబారా ఖర్చులు విపరీతం. చీటికిమాటికి చికాకు పడతారు. స్థిమితంగా ఉండటానికి యత్నిం చండి. అతిగా ఆలోచింపవద్దు. పిల్లల భవిష్యత్తుపై దృష్టి పెట్టండి. సన్నిహితులతో తరచూ సంభాషిస్తారు. ముఖ్యమైన పత్రాలు అందుతాయి. వేడుకకు హాజరవుతారు.


ధనుస్సు

మూల, పూర్వాషాఢ,

ఉత్తరాషాఢ 1వ పాదం

ఆదాయం బాగున్నా సంతృప్తి ఉండదు. తెలియని వెలితి వెన్నాడుతుంది. రోజువారీ ఖర్చులే ఉంటాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. గురు వారం నాడు అనవసర జోక్యం తగదు. ఇతరుల బాధ్యతలు చేపట్టి ఇబ్బందులు ఎదుర్కొంటారు, ఆత్మీయులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. అవతలి వారి స్తోమతను క్షుణ్ణంగా తెలుసుకోండి. ఆధ్మాత్మికత పెంపొందుతుంది.


మకరం

ఉత్తరాషాఢ 2,3,4;

శ్రవణం, ధనిష్ట 1,2 పాదాలు

సర్వత్రా అనుకూలమే. మీ కృషి ఫలిస్తుంది. కార్యసిద్థి, వ్యవహార జయం ఉన్నాయి. ప్రముఖులను ఆకట్టుకుంటారు. బంధుమిత్రులతో సత్సంబంధాలు నెలకొం టాయి. ఖర్చులు విపరీతం. శనివారం నాడు నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. బాధ్యతలు అప్పగించవద్దు. లావాదేవీల్లో ఏకాగ్రత వహించండి. ప్రలోభాలకు లొంగవద్దు. పత్రాల్లో సవరణలు అనుకూలిస్తాయి. ముఖ్యమైన సమావేశంలో పాల్గొంటారు.


కుంభం

ధనిష్ట 3,4; శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు

ఈ వారం యోగదాయకం. ేస్నహసంబంధాలు బలపడతాయి. వ్యతి రేకులు సన్నిహితులవుతారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. శ్రమతో కూడిన ఫలితాలున్నాయి. అవకాశాలు కలిసి వస్తాయి. ఫోన్‌ సందేశాలు పట్టించుకోవద్దు. వ్యవహా రాలు మీ సమక్షంలో సాగుతాయి. ఖర్చులు అధికం. చెల్లింపుల్లో జాగ్రత్త. భేషజాలకు పోవద్దు. మీ సాయంతో ఒకరికి మంచి జరు గుతుంది. శుభకార్యంలో పాల్గొంటారు.


మీనం

పూర్వాభాద్ర 4వ

పాదం, ఉత్తరాభాద్ర, రేవతి

వ్యవహారానుకూలత ఉంది. ఎంతటివారినైనా ఇట్టే ఆకట్టుకుంటారు. తలపెట్టిన కార్యం విజయవంతమవుతుంది. పెట్టుబడులకు తరుణం కాదు. పెద్దలను సంప్రదించండి. పన్ను చెల్లింపుల్లో జాప్యం తగదు. అర్థాంతరంగా ముగించిన పనులు పూర్తి చేస్తారు. మీ చొరవతో ఒక సమస్య పరిష్కారమవుతుంది. మీ కృషిలో లోపం లేకుండా చూసుకోండి. అవకాశాలను వదులుకోవద్దు. వేడుకకు హాజరవుతారు.

Updated Date - May 18 , 2025 | 12:03 PM