Share News

ఆ రాశివారు ఈ వారం నగదు డ్రా చేసేటప్పుడు జాగ్రత్త

ABN , Publish Date - Aug 17 , 2025 | 06:51 AM

ఆ రాశివారు ఈ వారం నగదు డ్రా చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని ప్రముఖ జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు. అలాగే.. మీ కృషి ఫలిస్తుందని, అయితే.. ఆగ్రహావేశాలు అదుపులో ఉంచుకోవడం మంచిదని తెలుపుతున్నారు. అంతేగాక ఇతరులను మీ విషయాలకు దూరంగా ఉంచడం మంచిదని సూచిస్తున్నారు.

ఆ రాశివారు ఈ వారం నగదు డ్రా చేసేటప్పుడు జాగ్రత్త

ఆ రాశివారు ఈ వారం నగదు డ్రా చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని ప్రముఖ జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు. అలాగే.. మీ కృషి ఫలిస్తుందని, అయితే.. ఆగ్రహావేశాలు అదుపులో ఉంచుకోవడం మంచిదని తెలుపుతున్నారు. అంతేగాక ఇతరులను మీ విషయాలకు దూరంగా ఉంచడం మంచిదని సూచిస్తున్నారు.

అనుగ్రహం

17 - 23 ఆగస్టు 2025

పి.ప్రసూనా రామన్‌

మేషం

అశ్విని, భరణి,

కృత్తిక 1వ పాదం

గ్రహస్థితి సామాన్యం.ఖర్చులు విపరీతం. అవసరాలు అతికష్టంమ్మీద నెరవేరుతాయి. పనులు, బాధ్యతలు అప్ప గించవద్దు. కొందరి నిర్లక్ష్యం ఇబ్బంది కలిగి స్తుంది. ఆలోచనలు కార్యరూపం దాల్చు తాయి. ప్రతికూలతలను ధైర్యంగా ఎదుర్కొం టారు. పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి. ముఖ్యమైన పత్రాలు అందుకుంటారు. ఒక సమాచారం సంతోషపరుస్తుంది. దైవకార్యంలో పాల్గొంటారు. ప్రయాణం కలిసివస్తుంది.


వృషభం

కృత్తిక 2,3,4; రోహిణి,

మృగశిర 1,2 పాదాలు

కార్యక్రమాలు విజయవంతమ వుతాయి. లక్ష్యం సాధిస్తారు. రావలసిన ధనం అందుతుంది. కొన్ని ఇబ్బందులు తొలగు తాయి. చెల్లింపుల్లో జాప్యం తగదు. ఆహ్వానం అందుకుంటారు. ప్రముఖులతో పరిచయా లేర్పడతాయి. స్థిమితంగా పనులు పూర్తి చేస్తారు. పరిచయం లేని వారితో జాగ్రత్త. వాగ్వాదాలకు దిగవద్దు. వేదికలు అన్వేషి స్తారు. మీ సాయంతో ఒకరికి మంచి జరుగు తుంది. పూర్వ విద్యార్థులను కలుసుకుంటారు.


మిథునం

మృగశిర 3,4; ఆర్ద్ర,

పునర్వసు 1,2,3 పాదాలు

మీ కష్టం ఫలిస్తుంది. విజ్ఞతతో సమస్యలు పరిష్కరించుకుంటారు. పెద్దఖర్చు తగిలే సూచనలున్నాయి. నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. వాయిదాపడుతూ వస్తున్న పనులు పూర్తి చేస్తారు. పిల్లల దూకుడు అదుపు చేయండి. స్థిరాస్తి వ్యవహారంలో అప్ర మత్తంగా ఉండాలి. ఆత్మీయుల సలహా పాటించండి. ఆరోగ్యం బాగుంటుంది. శుభకార్యానికి హాజరవుతారు. ఇంటిని నిర్లక్ష్యంగా వదిలి వెళ్లకండి. నగదు, వెండి బంగారాలు జాగ్రత్త.


కర్కాటకం

పునర్వసు 4వ

పాదం, పుష్యమి, ఆశ్లేష

రుణసమస్య తొలగుతుంది. మానసికంగా కుదుటపడతారు. స్నేహసంబం ధాలు బలపడతాయి. ప్రణాళికలు వేసుకుం టారు. దుబారా ఖర్చులు విపరీతం. చెల్లిం పుల్లో జాప్యం తగదు. పిల్లల ఉన్నత విద్యా యత్నం ఫలిస్తుంది. ముఖ్యమైన పత్రాలు అందుకుంటారు. ఉల్లాసంగా గడుపుతారు. ఆరోగ్యం జాగ్రత్త. మీ చొరవతో శుభకార్యం నిశ్చయమవుతుంది. ప్రముఖులతో పరిచ యాలేర్పడతాయి. సభ్యత్వాలు స్వీకరిస్తారు.


సింహం

మఖ, పుబ్బ,

ఉత్తర 1వ పాదం

కార్యసాధనకు ఓర్పు ప్రధా నం. కొందరి వ్యాఖ్యలు నిరుత్సాహపరుస్తాయి. ఏ విషయాన్నీ పెద్దగా పట్టించుకోవద్దు. ఆశా వహదృక్పఽథంతో శ్రమించండి. కొంత మొత్తం ధనం అందుతుంది. వాయిదా పడుతూ వస్తున్న పనులు ఎట్టకేలకు పూర్తి కాగలవు. అనవసర బాధ్యతలు చేపట్టవద్దు, మీ వ్యక్తిత్వానికి భంగం కలుగకుండా మెలగండి. పత్రాల్లో సవరణలు అనివార్యం. ఒక సమాచారం ఆందోళన కలిగిస్తుంది.


కన్య

ఉత్తర 2,3,4; హస్త,

చిత్త 1,2 పాదాలు

వ్యవహారాల్లో ఒత్తిడికి గురికా వద్దు. స్థిమితంగా ఆలోచించి నిర్ణయం తీసు కోండి. పెద్దల హితవు మీపై ప్రభావం చూపుతుంది. అనుభవజ్ఞులను సంప్రదిస్తారు. ఒక అవసరానికి ఉంచిన ధనం మరోదానికి ఖర్చుచేస్తారు. అయినవారు మీ అశక్తతను అర్థం చేసుకుంటారు. పనులు వేగవంతమవు తాయి. శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. అవతలివారి స్తోమతను క్షుణ్ణంగా తెలుసు కోండి. దూరపు బంధుత్వాలు బలపడతాయి.


తుల

చిత్త 3,4; స్వాతి,

విశాఖ 1,2,3 పాదాలు

గ్రహాల సంచారం బాగుంది. కార్యక్రమాలు విజయవంతమవుతాయి. ప్రాధాన్యతా క్రమంలో పనులు పూర్తిచేస్తారు. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. అవకాశాలను చేజిక్కించుకుంటారు. ఖర్చులు అదుపులో ఉండవు. పిల్లల భవిష్యత్తుగురించి ఆలోచిస్తారు. ఆప్తుల వ్యాఖ్యలు కార్యోన్ముఖు లను చేస్తాయి. అపరిచితులతో జాగ్రత్త. వాదనలకు దిగవద్దు. కొన్ని విషయాలు చూసీచూడనట్టు వదిలేయండి.


వృశ్చికం

విశాఖ 4వ పాదం; అనూరాధ, జ్యేష్ఠ

శుభసమయం ఆసన్నమ యింది. లక్ష్యానికి చేరువవుతారు. శుభకార్యం విజయవంతమవుతుంది. స్తోమతకు మించి ఖర్చుచేస్తారు. స్నేహసంబంధాలు బలపడ తాయి. బాధ్యతలు అప్పగించవద్దు. చేసిన పనులే చేయవలసి వస్తుంది. మనోధైర్యంతో మెలగండి. ఏ విషయాన్నీ సమస్య అనుకో వద్దు. ఆత్మీయులతో సంప్రదింపులు జరుపు తారు. గృహమరమ్మతులు చేపడతారు. పొరు గువారినుంచి అభ్యంతరాలు ఎదురవుతాయి.


ధనుస్సు

మూల, పూర్వాషాఢ,

ఉత్తరాషాఢ 1వ పాదం

కార్యసాధనకు ఓర్పు ముఖ్యం. సంకల్పబలంతో యత్నాలు కొనసాగించండి. పట్టుదలతో శ్రమిస్త్తే విజయం తధ్యం. సాయం ఆశించవద్దు. వీలైనంత వరకు ఖర్చులు తగ్గించుకోండి. ముఖ్యుల కలయిక వీలుపడదు. కార్యక్రమాలు హడావుడిగా సాగుతాయి. అవాంతరాలెదురైనా పనులు పూర్తి చేస్తారు. ఆహ్వానం అందుకుంటారు. దూరపు బంధుత్వాలు బలపడతాయి. సేవ, దైవకార్యంలో పాల్గొంటారు.


మకరం

ఉత్తరాషాఢ 2,3,4;

శ్రవణం, ధనిష్ట 1,2 పాదాలు

లక్ష్యం సాధిస్తారు. పరిచ యాలు ఉన్నతికి తోడ్పడతాయి. ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. రుణ ఒత్తిడి తగ్గుతుంది. చేపట్టిన పనులు చురుకుగా సాగుతాయి. అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. మంచి చేయబోతే చెడు ఎదురవుతుంది. బంధువుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. చిన్న విషయాన్ని పెద్దది చేసుకోవద్దు. పత్రాల్లో సవరణలు సాధ్యమవుతాయి. మీ సిఫార్సుతో ఒకరికి సదవకాశం లభిస్తుంది.


కుంభం

ధనిష్ట 3,4; శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు

విశేష ఫలితాలున్నాయి. మీ కృషి ఫలిస్తుంది. లక్ష్యం సాధిస్తారు. ఊహిం చిన ఖర్చులే ఉంటాయి. కొంతమొత్తంపొదుపు చేస్తారు. పెద్దమొత్తం ధనసహాయం తగదు. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. ఇతరు లను మీ విషయాలకు దూరంగా ఉంచండి. చెప్పుడు మాటలు పట్టించుకోవద్దు. స్థిరాస్తి వ్యవహారంలో ఏకాగ్రత వహించండి. ఒత్తిళ్లకు లొంగవద్దు. న్యాయ నిపుణుల సలహా పాటించండి. ఉల్లాసంగా గడుపుతారు.


మీనం

పూర్వాభాద్ర 4వ

పాదం, ఉత్తరాభాద్ర, రేవతి

యత్నాల్లో స్వల్ప ఆటంకాలు ఎదురవుతాయి. ఆశావహదృక్పథంతో ముందుకు సాగండి. పరిస్థితులు నిదానంగా చక్కబడతాయి. ఖర్చులు అదుపులో ఉండవు. ఆర్భాటాలకు విపరీతంగా ఖర్చుచేస్తారు. కావ లసిన వస్తువులు సమయానికి కనిపించవు. చిన్న విషయానికే చికాకుపడతారు. మీ ఆగ్రహావేశాలు అదుపులో ఉంచుకోండి. సన్నిహితులతో సంభాషిస్తారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది.

Updated Date - Aug 17 , 2025 | 06:51 AM