ఆ రాశి వారికి ఈ వారం డబ్బే డబ్బు..
ABN , Publish Date - Aug 10 , 2025 | 07:00 AM
ఆ రాశి వారికి ఈ వారం ధనలాభం అధికంగా ఉంటుందని ప్రముఖ జ్యోతిస్య పండితులు తెలుపుతున్నారు. అలాగే మనోధైర్యంతో అడుగు ముందుకేస్తారని, కష్టం వృథాకాదని తెలుపుతున్నారు. అలాగే.. నోటీసులు అందుకుంటారని, ఒక సమాచారం ఆలోచింప చేస్తుందని తెలుపుతున్నారు.
ఆ రాశి వారికి ఈ వారం ధనలాభం అధికంగా ఉంటుందని ప్రముఖ జ్యోతిస్య పండితులు తెలుపుతున్నారు. అలాగే మనోధైర్యంతో అడుగు ముందుకేస్తారని, కష్టం వృథాకాదని తెలుపుతున్నారు. అలాగే.. నోటీసులు అందుకుంటారని, ఒక సమాచారం ఆలోచింప చేస్తుందని తెలుపుతున్నారు.
అనుగ్రహం
10 - 16 ఆగస్టు 2025
పి.ప్రసూనా రామన్
మేషం
అశ్విని, భరణి,
కృత్తిక 1వ పాదం
అనుకున్న లక్ష్యం సాధిస్తారు. అవకాశాలు కలిసివస్తాయి. ప్రముఖులను ఆకట్టుకుంటారు. ఆర్భాటాలకు ఖర్చు చేస్తారు. చెల్లింపుల్లో జాప్యం తగదు. పనులు అస్తవ్య స్తంగా సాగుతాయి. ఆత్మీయులతో సంభాషి స్తారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. కొత్తయత్నాలకు శ్రీకారం చుడతారు. మీ అభిప్రాయాలను స్పష్టంగా తెలియచేయండి. వివాదాలు పరిష్కారదిశగా సాగుతాయి. కొత్త వ్యక్తులతో మితంగా సంభాషించండి.
వృషభం
కృత్తిక 2,3,4; రోహిణి,
మృగశిర 1,2 పాదాలు
సర్వత్రా అనుకూలమే. ఎదుటి వారిని ఇట్టే ఆకట్టుకుంటారు. స్నేహసంబం ధాలు బలపడతాయి. పిల్లల విద్యాయత్నం ఫలిస్తుంది. సన్నిహితుల వ్యాఖ్యలు కార్యోన్ము ఖులను చేస్తాయి. మనోధైర్యంతో అడుగు ముందుకేస్తారు. ఖర్చులు విపరీతం. అపరిచి తులను ఓ కంట కనిపెట్టండి. ఆహ్వానం, పత్రాలు అందుకుంటారు. పనులు చురుకుగా సాగుతాయి. వేడుకకు హాజరవుతారు. మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి.
మిథునం
మృగశిర 3,4; ఆర్ద్ర,
పునర్వసు 1,2,3 పాదాలు
స్థిరాస్తి ధనం అందుతుంది. ఖర్చులు సామాన్యం. పొదుపు పథకాలపై దృష్టి సారిస్తారు. ప్రైవేట్ ఫైనాన్సుల జోలికి పోవద్దు. అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. పనులు త్వరితగతిన సాగుతాయి. ఆప్తులవ్యాఖ్యలు ప్రభావితం చేస్తాయి. పట్టుదలతో ముందుకు సాగుతారు. ఆహ్వానం అందుకుంటారు. తెగిపోయిన సంబంధాలు బలపడతాయి. మీ సాయంతో ఒకరికి మేలు జరుగుతుంది. బాధ్యతలు అప్పగించవద్దు.
కర్కాటకం
పునర్వసు 4వ
పాదం, పుష్యమి, ఆశ్లేష
కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. మీ కష్టం వృథాకాదు. ధన లాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. వాయిదా పడిన పనులు పూర్తిచేస్తారు. అవగాహన లేని విష యాల్లో జోక్యం తగదు. తెగిపోయిన బంధు త్వాలు బలపడతాయి. ఆత్మీయులతో తరచూ సంభాషిస్తారు. ఒక సమాచారం ఆలోచింప చేస్తుంది. స్థిరాస్తి వ్యవహారంలో ఏకాభిప్రా యానికి రాగల్గుతారు. పెద్దల జోక్యంతో సమస్య సద్దుమణుగుతుంది.
సింహం
మఖ, పుబ్బ,
ఉత్తర 1వ పాదం
అనుకూలతలు అంతంత మాత్రమే. సంప్రదింపులు వాయిదాపడతాయి. చిన్న విషయానికే చికాకుపడతారు. సంకల్ప బలంతో ముందుకు సాగండి. త్వరలో పరి స్థితులు చక్కబడతాయి. అయినవారి ప్రోత్సాహం ఉంటుంది. చెల్లింపుల్లో అలక్ష్యం తగదు. పిల్లల విద్యాయత్నం ఫలిస్తుంది. ఆందోళన తగ్గి కుదుటపడతారు. ఒక ఆహ్వానం ఆలోచింప చేస్తుంది. ముఖ్యుల కలయిక వీలుపడదు. పనులు ఒక పట్టాన సాగవు.
కన్య
ఉత్తర 2,3,4; హస్త,
చిత్త 1,2 పాదాలు
కొత్త సమస్యలు తలెత్తకుండా జాగ్రత్త వహించండి. ఒత్తిళ్లకు గురికావద్దు. ఆప్తులతో తరచూ సంభాషిస్తారు. ఖర్చులు సామాన్యం. ధనసహాయం తగదు. కొత్త యత్నాలు మొదలెడతారు. అవకాశాలను తక్షణం అందిపుచ్చుకోండి. ఆహ్వానం అందు కుంటారు. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు. అనుకున్న విధంగా పనులు పూర్తి చేస్తారు.
తుల
చిత్త 3,4; స్వాతి,
విశాఖ 1,2,3 పాదాలు
కీలక అంశాలపై పట్టు సాధి స్తారు. అన్నింటా మీదే పైచేయి. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. మీపై వచ్చిన అభియో గాలు తొలగిపోగలవు. కొత్త పనులు చేపడ తారు. పెద్దమొత్తం ధనసహాయం తగదు. దూరపు బంధువులతో సంభాషిస్తారు. ఊహించని సంఘటన ఎదురవుతుంది. అన వసర బాధ్యతలు చేపడితే ఇబ్బందులు ఎదుర్కొంటారు. కొందరి రాక చికాకు పరుస్తుంది. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు.
వృశ్చికం
విశాఖ 4వ పాదం; అనూరాధ, జ్యేష్ఠ
అన్నివిధాలా కలిసివచ్చే సమ యం. శుభకార్యాన్ని ఘనంగా చేస్తారు. మీ ఆతిథ్యం ఆకట్టుకుంటుంది. పరస్పరం కానుక లిచ్చిపుచ్చుకుంటారు. ఖర్చులు అదుపులో ఉండవు. అనవసర విషయాల జోలికి పోవద్దు. సన్నిహితుల ప్రోత్సాహం కార్యోన్ముఖులను చేస్తుంది. మనోధైర్యంతో ముందుకు సాగుతారు. కష్టమనుకున్న పనులు తేలికగా పూర్తవుతాయి. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది.
ధనుస్సు
మూల, పూర్వాషాఢ,
ఉత్తరాషాఢ 1వ పాదం
పరిస్థితులకు తగినట్టుగా మెలగండి. అవకాశాలు వదులుకోవద్దు. తప్పుచేశామన్న భావం రానీయకండి. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. ఊహించని ఖర్చు ఎదురవు తుంది. సాయం చేసేందుకు అయినవారే వెనుకాడుతారు. అవసరాలు అతికష్టంమ్మీద నెరవేరుతాయి. చిన్న విషయాన్ని పెద్దది చేసుకోవద్దు. ఆత్మీయుల ఆహ్వానం అందు కుంటారు. ఆలోచనల్లో మార్పు వస్తుంది.
మకరం
ఉత్తరాషాఢ 2,3,4;
శ్రవణం, ధనిష్ట 1,2 పాదాలు
సంప్రదింపులు ఫలిస్తాయి. ఆశలొదిలేసుకున్న ధనం అందుతుంది. ప్రణా ళికలు వేసుకుంటారు. చుట్టుపక్కల వారిని ఓ కంట కనిపెట్టండి. పనులు త్వరితగతిన సాగుతాయి. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. మధ్యవర్తులను ఆశ్రయించొద్దు. ఆత్మీయులతో తరచూ సంభాషిస్తారు. ఒక వార్త సంతోషం కలిగిస్తుంది. పత్రాలు అందు కుంటారు. స్నేహసంబంధాలు బలపడతాయి. సన్మాన, సాహిత్య సభల్లో పాల్గొంటారు.
కుంభం
ధనిష్ట 3,4; శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు
ఆర్థికంగా ఫర్వాలేదనిపిస్తుంది. కొంతమొత్తం పొదుపు చేస్తారు. ఫైనాన్సు వ్యాపారాల జోలికి పోవద్దు. పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోండి. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. మీ వ్యక్తిత్వానికి భంగం కలుగకుండా మెలగండి. దూరపు బంధుత్వాలు బలపడతాయి. నోటీసులు అందుకుంటారు. ఒక సమాచారం ఆలోచింప చేస్తుంది. న్యాయనిపుణులను సంప్రదిస్తారు. గృహనిర్మాణం పూర్తి కావస్తుంది.
మీనం
పూర్వాభాద్ర 4వ
పాదం, ఉత్తరాభాద్ర, రేవతి
శ్రమించినా ఫలితం శూన్యం. ఒత్తిడికి గురికావద్దు. లక్ష్యానికి చేరువలో ఉన్నారు. నిరుత్సాహం వీడి యత్నాలు సాగిం చండి. సన్నిహితుల వ్యాఖ్యలకు స్పందిస్తారు. ఒక అవసరానికి ఉంచిన ధనం మరోదానికి ఖర్చుచేస్తారు. పిల్లల కదలికలపై దృష్టి పెట్టండి. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోవద్దు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూల మవుతాయి. కీలక పత్రాలు అందుకుంటారు. గృహంలో మార్పుచేర్పులు అనివార్యం.