Lord Shiva Temples : దేశంలో ప్రముఖ శివాలయాలు ఎక్కడున్నాయో తెలుసా..
ABN , Publish Date - Dec 29 , 2025 | 08:06 AM
మన దేశంలో ఎన్నో ప్రాచీన, ఆధ్యాత్మిక కలిగిన శివాలయాలు ఉన్నాయి. ఏ మారుమూల ప్రాంతానికి వెళ్లినా సరే శివాలయాలు కచ్చితంగా కనిపిస్తాయి. దేశంలో ప్రసిద్ధి పొందిన శివాలయాల ఎక్కడున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇంటర్నెట్ డెస్క్: భారత దేశంలో ఎన్నో అద్భుతమైన కట్టడాలు ఉన్నాయి. ముఖ్యంగా భగవంతుడు కొలువై ఉన్న దేవాలయాలు, శిల్పాలకు మనదేశం పుట్టినిల్లుగా ప్రసిద్ధి పొందింది. ఆలయాల విషయానికి వస్తే పరమ శివుడికి సంబంధించినవే ఎక్కువగా ఉంటాయి. కైలాసనాథుడు, కేథారేశ్వరుడు, బ్రదినాథ్, అమర్ నాథ్, కాశీవిశ్వనాథుడు, సోమనాథుడు, రామనాథ ఇంకా ఎన్నో పేర్లు నీలకంఠుడికి ఉన్నాయి. ఇక శివరాత్రి వస్తే దేశ వ్యాప్తంగా చిన్న చిన్న గ్రామాల నుంచి మహానగరాల్లో శైవ క్షేత్రాలన్నీ ఓం నమః శివాయ అంటూ మార్మోగుతుంటాయి.
ద్వాదశ జ్యోతిర్లింగాలు..
మన దేశంలో ఉన్న 12 క్షేత్రాలను దర్శించుకొని తరించిపోవాలని ప్రతి ఒక్కరూ భావిస్తుంటారు. గుజరాత్ లో సోమనాథ్ (మొదటి జ్యోతిర్లింగం), ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీశైలంలో మల్లికార్జునస్వామి, మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో మహాకాళేశ్వర్, ఓంకారేశ్వర్, ఉత్తరాఖండ్ కేథారినాథ్ ఆలయం.. ఇది హిమాలయాల్లో కొలువై ఉంది. మహారాష్ట్రలో భీమశంకర్, ఉత్తర్ ప్రదేశ్ వారణాసిలో కాశీ విశ్వనాథ్, మహారాష్ట్ర నాసిక్‌లో త్రయంబకేశ్వర్, జార్ఖండ్‌లో వైద్యనాథ్, గుజరాత్‌లో నాగేశ్వర్, తమిళనాడు రామేశ్వరంలో రామనాథస్వామి, మహారాష్ట్ర ఔరంగాబాద్ లోని ఘృష్ణేశ్వర్ ఆలయాలు ఎంతో ప్రసిద్ధి పొందాయి. ప్రపంచ వ్యాప్తంగా శివ భక్తులు ఈ ఆలయాలను దర్శించుకోవడానికి వస్తుంటారు.
దక్షిణ భారతదేశంలో పంచభూత లింగాలు.. ప్రకృతిలోని 5 మూలకాలకు ప్రతీకగా ఈ క్షేత్రాలు వెలిశాయి. తమిళనాడు కంచిలో ఉన్న ఏకాంబరేశ్వరాలయం ఆలయంలో వెలసిన పృథ్వీలింగం(నేల), తిరువానైకావల్ లోని బంబు కేశ్వరాలయంలో వెలసిన జల లింగం(నీరు), తిరువణ్ణామలైలోని అరుణాచలేశ్వరాలయంలో వెలసిన అగ్ని లింగం(అగ్ని), ఆంధ్రప్రదేశ్.. శ్రీకాళహస్తిలోని శ్రీకాళహస్తీశ్వరాలయంలో వెలసిన వాయు లింగం(గాలి), తమిళనాడు, చిదంబరంలోని నటరాజ స్వామి ఆలయంలో వెలసిన ఆకాశలింగం(ఆకాశం) ఎంతో ప్రసిద్ధి పొందిన ఆలయాలుగా చెబుతారు. ఆంధ్రప్రదేశ్ లోని పంచారామాలు (భీమవరం, పాలకొల్లు, అమరావతి, ద్రాక్షారామం, సామర్లకోట) తెలంగాణ వేములవాడలోని రాజరాజేశ్వర స్వామి, కాళేశ్వరం(ముక్తేశ్వర స్వామి), రామప్ప దేవాలయం, కీసరగుట్ట ప్రముఖ శైవ క్షేత్రాలుగా ప్రాముఖ్యత పొందాయి.
ఈ వార్తలు కూడా చదవండి:
Vaikuntha Ekadashi: వైకుంఠ ఏకాదశి.. ఆ రోజు ఇలా చేస్తే..