Weekly Horoscope: ఈ వారంలో ఆ రాశి వారికి అంతా శుభమే...
ABN , Publish Date - Mar 09 , 2025 | 07:46 AM
ఈ వారంలో ఆ రాశి వారికి అన్ని విధాలా అంతా శుభమే జరుగుతుందని ప్రముఖ పండితులు తెలుపుతున్నారు. అయితే.. కొన్ని విషయాలలో కొంత జాగ్రత్తగా ఉంటే మంచిదని వారు తెలుపుతునారు. ఈ వారం రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఒకసారి పరిశీలిస్తే..
అనుగ్రహం
9 - 15 మార్చి 2025
పి.ప్రసూనా రామన్
మేషం
అశ్విని, భరణి,
కృత్తిక 1వ పాదం
స్థిమితంగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. భేషజాలకు పోవద్దు. పెద్దల సలహా తీసుకోండి. ఊహించని ఖర్చు ఎదురవుతుంది. అవసరాలు వాయిదా వేసుకుంటారు. పనులు మొండిగా పూర్తి చేస్తారు. ఆత్మీయులతో సంభాషణ ఉపశ మనం కలిగిస్తుంది. కొత్త యత్నాలు మొదలె డతారు. అవకాశాలు అందినట్టే అంది చేజారి పోతాయి. పట్టుదలతో అడుగు ముందు కేయండి. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది.
వృషభం
కృత్తిక 2,3,4; రోహిణి,
మృగశిర 1,2 పాదాలు
ఈ వారం ఆశాజనకం. కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. శుభకార్యాన్ని ఆర్భాటంగా చేస్తారు. మీ ఉన్నతి కొందరికి అపోహ కలిగిస్తుంది. వ్యాఖ్యలు, విమర్శలు పట్టించుకోవద్దు. మనోధైర్యమే మీకు బలాన్నిస్తుంది. కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడతారు. పనులు, బాధ్యతలు అప్ప గించవద్దు. కొత్తయత్నాలు మొదలెడతారు. మీ కృషిలో లోపం లేకుండా శ్రమించండి. చిన్ననాటి పరిచయస్తులు తారసపడతారు.
మిథునం
మృగశిర 3,4; ఆర్ద్ర,
పునర్వసు 1,2,3 పాదాలు
ఆర్థికలావాదేవీలు కొలిక్కి వస్తాయి. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. ఆహ్వానం అందుకుంటారు. తెగిపోయిన బంధుత్వాలు బలపడతాయి. అందరితోనూ మితంగా సంభాషించండి. చేపట్టిన పనులు వాయిదా వేసుకుంటారు. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. మనోధైర్యంతో ముందుకు సాగండి. పత్రాల్లో సవరణలు సాధ్యపడవు. శుభకార్యానికి హాజరవుతారు.
కర్కాటకం
పునర్వసు 4వ
పాదం, పుష్యమి, ఆశ్లేష
సంతోషకరమైన వార్త వింటారు. మీ నిర్ణయం పిల్లల భవిష్యత్తుకు నాంది పలుకుతుంది. ప్రణాళికాబద్థంగా ముందుకు సాగుతారు. మీ కృషి ఫలిస్తుంది. సన్నిహితులతో కాలక్షేపం చేస్తారు. ఒక సంబంధం కలిసివచ్చే సూచనలున్నాయి. పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. పత్రాల రెన్యువల్, పన్ను చెల్లింపుల్లో అలక్ష్యం తగదు. పుణ్యక్షేత్రాలు, కొత్త ప్రదేశాలు సందర్శిస్తారు.
సింహం
మఖ, పుబ్బ,
ఉత్తర 1వ పాదం
మీదైన రంగంలో ఒత్తిడికి గురికావద్దు. సంయమనంతో సమస్యలు పరిష్కరించుకోవాలి. మీ మాటతీరు అదుపులో ఉంచుకోండి. ఓర్పు, పట్టుదలతో శ్రమిేస్త విజయం తథ్యం. పనుల్లో ఆటంకాలెదురైనా ఎట్టకేలకు పూర్తవుతాయి. ఆదాయం అంతంత మాత్రమే. దుబారా ఖర్చులు విపరీతం. సోమ, మంగళవారాల్లో ఆచితూచి అడుగేయండి. సన్నిహితుల సాయంతో సమస్య పరిష్కారమవుతుంది.
కన్య
ఉత్తర 2,3,4; హస్త,
చిత్త 1,2 పాదాలు
అన్ని విధాలా అనుకూలమే. కార్యసిద్ధి, వ్యవహార జయం ఉన్నాయి. వివాహయత్నం ఫలిస్తుంది. బంధుత్వాలు బలపడతాయి. ఆర్భాటాలకు విపరీతంగా ఖర్చు చేస్తారు. వస్త్రప్రాప్తి, వాహనసౌఖ్యం ఉన్నాయి. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపు తారు. పనులు పురమాయించవద్దు. కుటుంబీకులతో సంప్రదింపులు జరుపుతారు. స్థిరచరాస్తుల వ్యవహారంలో జాగ్రత్త. పోగొట్టుకున్న పత్రాలు తిరిగి సంపాదిస్తారు.
తుల
చిత్త 3,4; స్వాతి,
విశాఖ 1,2,3 పాదాలు
లక్ష్యసాధనకు ఓర్పు, కృషి ప్రధానం. ముఖ్యమైన పనుల్లో ఏకాగ్రత వహించండి. సాయం ఆశించవద్దు. ఓర్పు, స్వయంకృషితోనే కార్యం సాధ్యమవుతుంది. ఆదాయం సంతృప్తికరం. దుబారా ఖర్చులు తగ్గించుకుంటారు. మీ ఊహలు, అంచనాలు ఫలిస్తాయి. సొంతంగా ఏదైనా చేయాలనే ఆలోచన కార్యరూపం దాల్చుతుంది. పెట్టు బడులకు అనుకూలం. వ్యవహారాల్లో సముచిత నిర్ణయం తీసుకుంటారు.
వృశ్చికం
విశాఖ 4వ పాదం; అనూరాధ, జ్యేష్ఠ
కార్యక్రమాలు నిరాటంకంగా సాగుతాయి. దృఢసంకల్పంతో శ్రమించి లక్ష్యం సాధిస్తారు. పనులు వేగవంతమవుతాయి. దూరపు బంధువులతో సంభాషిస్తారు. ఒక వార్త సంతోషం కలిగిస్తుంది. కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. ఆది, సోమవారాల్లో ఏకాగ్రతతో మెలగండి. వ్యవహార ఒప్పందాల్లో తొందరపాటుతనం తగదు. అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. రావలసిన ధనం అందుతుంది. విలాసాలకు వ్యయం చేస్తారు.
ధనుస్సు
మూల, పూర్వాషాఢ,
ఉత్తరాషాఢ 1వ పాదం
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. మీ కష్టం వృఽథాకాదు. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది. స్నేహసంబంధాలు బలపడతాయి. అయినవారితో ఉల్లాసంగా గడుపుతారు. శుభకార్యం నిశ్చయమవుతుంది. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. మంగళవారం నాడు ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. మీ వ్యాఖ్యలు వివాదాస్పదం కాకుండా చూసుకోండి. ఖర్చులు విపరీతం. కొత్త బాధ్యతలు చేపడతారు.
మకరం
ఉత్తరాషాఢ 2,3,4;
శ్రవణం, ధనిష్ట 1,2 పాదాలు
ఆర్థికంగా బాగున్నా మితంగా ఖర్చుచేయండి. ఆర్భాటాలకు పోవద్దు. పొగిడే వ్యక్తులతో జాగ్రత్త. పరిచయస్తులు ధన సహాయం అర్థిస్తారు. పెద్దమొత్తం సాయం తగదు. చేపట్టిన పనులపై శ్రద్ధ వహించండి. మీ ఏమరుపాటు ఇబ్బందులకు దారితీస్తుంది. పట్టింపులకు పోవద్దు. ఆత్మీయులతో సంభా షణ ఉపశమనం కలిగిస్తుంది. నోటీసులు అందుకుంటారు. ఆరోగ్యం మందగిస్తుంది. పాత పరిచయస్తులను కలుసుకుంటారు.
కుంభం
ధనిష్ట 3,4; శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు
శ్రమతో కూడిన ఫలితాలు న్నాయి. మీదైన రంగంలో రాణిస్తారు. అవ కాశాలు కలిసివస్తాయి. మాటతీరు ఆకట్టు కుంటుంది. పరిచయాలు ఉన్నతికి తోడ్పడ తాయి. కొంతమొత్తం పొదుపు చేయగల్గు తారు. పనులు వేగవంతమవుతాయి. ఆది వారం నాడు కొందరి రాక ఇబ్బంది కలిగి స్తుంది. ఇంటి విషయాలు పట్టించుకోండి. కీలక పత్రాలు అందుకుంటారు. కనిపించ కుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి.
మీనం
పూర్వాభాద్ర 4వ
పాదం, ఉత్తరాభాద్ర, రేవతి
లక్ష్యసాధనకు పట్టుదల ప్రధానం. కొందరి వ్యాఖ్యలు నిరుత్సాహ పరుస్తాయి. ఓర్పుతో యత్నాలు కొనసాగిం చండి. సాయం ఆశించవద్దు. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. పొదుపునకు ఆస్కారం లేదు. ఆత్మీయులతో సంభాషణ ఉత్తేజ పరుస్తుంది. పనులు చురుకుగా సాగుతాయి. మంగళవారం నాడు కొత్త వ్యక్తులతో జాగ్రత్త. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు.