Share News

Zodiac Signs: ఈ మూడు రాశులకు అదృష్టయోగం..

ABN , Publish Date - Nov 06 , 2025 | 08:03 PM

బుధుడు, శనికి మధ్య ప్రత్యేక యోగం కారణంగా కొన్ని రాశులకు ఊహించని ప్రయోజనం కలగనుంది. అలా వారి జీవితంలో కెరీర్ పరంగానే కాక.. ఆర్థికంగా, వ్యక్తిగతంగా మంచి అవకాశాలను తీసుకురానుంది.

Zodiac Signs: ఈ మూడు రాశులకు అదృష్టయోగం..

జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంయోగం వల్ల ఏర్పడే యోగాలు వ్యక్తి జీవితంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. బుధుడు, శనికి మధ్య ప్రత్యేక సంయోగం కారణంగా కొన్ని రాశులకు ఊహించని ప్రయోజనం కలగనుంది. అలా వారి జీవితంలో కెరీర్ పరంగానే కాక.. ఆర్థికంగా, వ్యక్తిగతంగా సువర్ణావకాశాలను తీసుకురానుంది.


వృషభం..

ఈ రాశి వారికి యుతి యోగం కారణంగా.. ఆర్థిక పరంగా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. వ్యాపారంలో కొత్త అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. గత ఆర్థిక లావాదేవీల నుంచి ప్రయోజనం పొందుతారు. ఉద్యోగంలో ప్రమోషన్ సైతం లభిస్తుంది. కుటుంబ సభ్యుల మద్దతుతో ఆర్థిక పరిస్థితి చాలా వరకు బలపడుతుంది.


మకరం..

ఈ రాశి వారికి కార్యాలయంలో విజయం, గౌరవంతోపాటు కీర్తిని సైతం తెస్తుంది. ముఖ్యమైన ప్రాజెక్టులలో విజయం సాధించడంతో మీ హోదా బలపడుతుంది. మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అలాగే కార్యాలయంలో సహచరుల మధ్య సంబంధాలు సామరస్యంగా ఉంటాయి.


కన్య..

ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు వారి విద్య, ఉద్యోగ జీవితంలో అద్భుతమైన పురోగతిని చూస్తారు. పోటీ పరీక్షలకు సిద్దమవుతున్న వారికి విజయం లభించే అవకాశాలు ఉన్నాయి. వారు తమ స్థానాన్ని మార్చుకుని విదేశాలకు వెళ్లే అవకాశం సైతం ఉన్నాయి. పాత స్నేహితుల సహాయ సహకారాలు అందుతాయి. దీంతో ఆర్థిక లాభాలు సాధించేందుకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది.


వివాదాలకు దూరంగా..

బుధుడు, శని సంయోగం శక్తిమంతమైన రాజయోగం. ఈ కాలంలో వ్యాపారం, రాజకీయాలు, సాంకేతిక రంగాల్లో పని చేసే వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ కాలంలో తీసుకునే ముఖ్య నిర్ణయాలు దీర్ఘకాలంలో శుభ ఫలితాలను ఇస్తాయి. అయితే పూర్తి ప్రయోజనాలు పొందాలంటే తొందరపాటు, అనవసర వివాదాలకు దూరంగా ఉండాల్సి ఉంటుంది.


ఈ యోగం వల్ల కలిగే ప్రయోజనం..

బుధుడు తెలివితేటలకు ప్రతీక. శని క్రమశిక్షణతోపాటు కాలానికి ప్రతీక. ఈ రెండింటి కలయిక వల్ల తెలివైన నిర్ణయాలు తీసుకోవడంతోపాటు దీర్ఘకాలిక ప్రయోజనాలు పొందుతారు.


(గమనిక.. ఇక్కడ ఇచ్చిన సమాచారం.. జ్యోతిష్య శాస్త్రం మీద ఆధారపడి ఉంటుంది. దీనికి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి దీనికి హామీ ఇవ్వదు.)

Updated Date - Nov 06 , 2025 | 08:54 PM