Share News

Boyfriend Assasinates Young Woman: ప్రియుడి దారుణం.. లవర్ పెళ్లికి ఒప్పుకోలేదన్న కోపంతో..

ABN , Publish Date - Sep 24 , 2025 | 01:15 PM

స్వాతి డిగ్రీ రెండవ సంవత్సరం చదువుతోంది. వీలైనంత త్వరగా పెళ్లి చేసుకుందామంటూ సూర్య ఆమెపై ఒత్తిడి తెస్తున్నాడు. ఇదే విషయాన్ని ఆమె తన తల్లిదండ్రులకు చెప్పింది.

Boyfriend Assasinates Young Woman: ప్రియుడి దారుణం.. లవర్ పెళ్లికి ఒప్పుకోలేదన్న కోపంతో..
Boyfriend Assasinates Young Woman

మనం ఎన్ని ఇబ్బందులు పడ్డా ప్రేమించిన వాళ్లు సంతోషంగా ఉంటే చాలనుకునేవారు ఈ సమాజంలో తక్కువైపోయారు. స్వార్థం కోసం ఎదుటి వ్యక్తిని వాడుకోవాలని చూసే వాళ్లే ఎక్కువయ్యారు. తమకు దక్కని వాళ్లు ఎవ్వరికీ దక్క కూడదు అనుకునే సైకోలు కూడా లేకపోలేదు. తాజాగా, ఓ యువకుడు ప్రియురాలు పెళ్లికి ఒప్పుకోలేదన్న కోపంతో దారుణానికి ఒడిగట్టాడు. ఆమెను నమ్మించి తీసుకెళ్లి చంపేశాడు. కాలువలో తోసి ప్రాణాలు తీశాడు. ఈ సంఘటన కర్ణాటకలో ఆసల్యంగా వెలుగుచూసింది. పోలీసులు, మృతురాలి కుటుంబసభ్యులు తెలిపిన వివరాల మేరకు..


భద్రావతి తాలూకాలోని యక్కుంద గ్రామానికి చెందిన సూర్య, స్వాతి గత కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. స్వాతి డిగ్రీ రెండవ సంవత్సరం చదువుతోంది. వీలైనంత త్వరగా పెళ్లి చేసుకుందామంటూ సూర్య ఆమెపై ఒత్తిడి తెస్తున్నాడు. ఇదే విషయాన్ని ఆమె తన తల్లిదండ్రులకు చెప్పింది. చదువు పూర్తయ్యే వరకు పెళ్లి చేయటం కుదరదని వాళ్లు తేల్చి చెప్పారు. ఇదే విషయాన్ని స్వాతి, సూర్యకు చెప్పింది. అతడు ఆగ్రహానికి గురయ్యాడు. 21వ తేదీన ఇద్దరి మధ్యా గొడవ జరిగింది. సూర్య ఆమెను ఇంటినుంచి బయటకు పిలిచాడు.


నేరుగా భద్రా కాలువ బ్రిడ్జి దగ్గరకు తీసుకెళ్లాడు. ఆమెను మాటల్లో పెట్టి బ్రిడ్జి అంచుకు తీసుకువచ్చాడు. అక్కడి నుంచి ఆమెను నదిలో తోసేశాడు. స్వాతి నీటి ప్రవాహంలో కొట్టుకుపోయింది. నీటిలో ఊపిరాడక చనిపోయింది. మంగళవారం ఉదయం స్వాతి మృతదేహం బయటపడింది. శవాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. స్వాతి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.


స్వాతి కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. వారు సూర్యతో పాటు సూర్య తండ్రిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఇద్దరే తమ కూతుర్ని చంపారని ఆరోపిస్తున్నారు. పోలీసులు సూర్య, అతడి తండ్రిపై కేసు నమోదు చేశారు. సూర్యను ఏ1గా, సూర్య తండ్రిని ఏ2గా పేర్కొన్నారు. ఇద్దర్నీ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.


మరో సంఘటనలో..

బాగలకోటె జిల్లా జమ్‌ఖండి తాలూకాలోని మధురఖండి గ్రామ సమీపంలోని కాలువలో గుర్తు తెలియని మహిళ మృతదేహం వెలుగుచూసింది. ఆ శవం బాగా కుళ్లిపోయి ఉంది. గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కాలువ దగ్గరకు చేరుకున్న పోలీసులు శవాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో ఆ మహిళ వయసు 35 నుంచి 40 సంవత్సరాలు ఉండొచ్చని వెల్లడైంది. శవం బాగా కుళ్లిపోయి ఉండటంతో ఆనవాళ్లు గుర్తించటం కష్టంగా మారింది.


ఇవి కూడా చదవండి

రక్తంతో లేఖ రాసిన ఫ్యాన్.. భయపడిపోయిన మహేష్ హీరోయిన్..

దసరా నవరాత్రి ఉత్సవాలకు ఏపీటీడీసీ ప్రత్యేక ప్యాకేజీ

Updated Date - Sep 24 , 2025 | 01:48 PM