Man Killed over Holi: హోలీ రంగు పూస్తుంటే వద్దన్నాడని.. యువకుడిని లైబ్రరీలోనే దారుణంగా..
ABN , Publish Date - Mar 13 , 2025 | 11:08 PM
హోలీ రంగు వేస్తుంటే వద్దన్న యువకుడిని లైబ్రరీలో హత్య చేసిన షాకింగ్ ఘటన రాజస్థాన్‌లో వెలుగు చూసింది.

ఇంటర్నెట్ డెస్క్: రాజస్థాన్‌లో (Rajasthan) తాజాగా షాకింగ్ ఘటన వెలుగు చూసింది. హోలీ రంగులు వేస్తుంటే వద్దన్నాడని ఓ యువకుడి మరో ముగ్గురు వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. దౌసా జిల్లాలో ఈ షాకింగ్ ఘటన వెలుగు చూసింది.
పూర్తి వివరాల్లోకి వెళితే, రాల్‌వాస్ గ్రామానికి చెందిన హంసరాజ్ పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్నాడు. బుధవారం సాయంత్రం అతడు స్థానిక లైబ్రరీకి వెళ్లి చదువులో నిమగ్నమయ్యాడు. ఈ క్రమంలో అశోక్, బబ్లూ, కాలూరామ్‌లు లైబ్రరీలోకి వచ్చి హంసరాజ్‌కు రంగు పూసే ప్రయత్నం చేశారు. కానీ హంసరాజ్ మాత్రం తిరస్కరించాడు.
దీంతో, రెచ్చిపోయిన నిందితులు అతడిపై దాడి చేశారు. తన్ని, బెల్టుతో కొట్టి నరకం చూపించారు. ఆ తరువాత వారిలో ఒకరు నిందితుడికి ఊపిరాడకుండా చేసి చంపేశారు.
హంసరాజ్ మృతితో అతడి కుటుంబసభ్యులు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. మృతదేహాన్ని హైవేపై పెట్టి ధర్నాకు దిగారు. మధ్యాహ్నం 1 గంట వరకూ నిరసన కొనసాగించారు. మృతుడి కుటుంబానికి పరిహారంగా రూ.50 లక్షలు, కుటుంబసభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో పోలీసులు జోక్యం చేసుకుని వారికి హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు. ఈ ఉదంతం స్థానికంగా కలకలానికి దారి తీసింది.
Indiana Foster kid Death: 10 ఏళ్ల బాలుడి ఛాతిపై కూర్చొన్న తల్లి.. చిన్నారి దుర్మరణం
ఇదెలా ఉంటే మోహాలీలో పార్కింగ్ విషయమై జరిగిన వివాదంలో యువ శాస్త్రవేత్త అభిషేక్ స్వర్ణకార్ ప్రాణాలు పోగొట్టుకున్నారు. కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ ఆపరేషన్ నుంచి కోలుకుంటున్న యువ శాస్త్రవేత్తపై పొరుగింటి వ్యక్తి మాంటీ విచక్షణా రహితంగా దాడి చేయడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందారు. దీంతో, ఆ కుటుంబంలో విషాద చాయలు అలుముకున్నాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. త్వరలోనే అతడిని అదుపులోకి తీసుకుంటామని పేర్కొన్నారు.