Share News

UP Engineer: భార్య వేధింపులు తాళలేక ఆత్మహత్య.. న్యాయం జరగకపోతే అస్థికలు డ్రైనేజీలో కలపాలని విజ్ఞప్తి

ABN , Publish Date - Apr 20 , 2025 | 04:03 PM

భార్య, ఆమె కుటుంబసభ్యుల వేధింపులు తాళలేకపోతున్నానంటూ ఓ యూపీ ఇంజినీర్ ఆత్మహత్య చేసుకున్నారు. పురుషుల కోసం చట్టాలు ఉండి ఉంటే తాను ఇలా చేసుండేవాడిని కాదన్నారు.

UP Engineer: భార్య వేధింపులు తాళలేక ఆత్మహత్య.. న్యాయం జరగకపోతే అస్థికలు డ్రైనేజీలో కలపాలని విజ్ఞప్తి
UP Engineer Ends life alleges Harassment by Wife

భార్య, ఆమె కుటుంబసభ్యుల వేధింపులు తాళలేకపోతున్నానంటూ నోయిడాకు చెందిన టెకీ మోహిత్ కుమార్ తాజాగా ఆత్మహత్య చేసుకున్నారు. తన మరణం తరువాతైనా న్యాయం దక్కకపోతే తన అస్థికలను డ్రైనేజీలో కలపాలని విజ్ఞప్తి చేశారు. స్థానికంగా ఉన్న ఓ హోటల్‌ రూమ్‌లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. తన మానసిక క్షోభను చెబుతూ వీడియో రికార్డు చేశాక బలవన్మరణానికి పాల్పడ్డారు. హోటల్‌‌లో అతడి మృతదేహాన్న స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్ట్ మార్టంకు పంపించారు.

తన ఆస్తి మొత్తాన్ని భార్య, ఆమె కుటుంబసభ్యుల పేర బదిలీ చేయాలంటూ వారు ఒత్తిడి చేస్తున్నారని మోహిత్ ఆరోపించారు. మాట వినకపోతే వరకట్నం కేసు పెడతామంటూ బెదిరిస్తున్నారని అన్నారు. ‘‘మీరు ఈ వీడియో చూసేసరికి నేను ఈ లోకాన్ని వీడి ఉంటాను. పురుషుల రక్షణం కోసం చట్టాలు ఉండి ఉంటే నేను ఇలా చేసుండేవాడిని కాను. అమ్మా, నాన్నా నన్ను క్షమించండి. కానీ నేను నా భార్య ఆమె కుటుంబం పెట్టే మెంటల్ చార్చర్‌ను తట్టుకోలేకపోతున్నాను. నా భార్య ప్రియా యాదవ్, ఆమె తల్లి ప్రోద్బలంతో అబార్షన్‌ చేయించుకుంది. నగలు డబ్బు అన్నీ తన వద్దే పెట్టుకుంది. ఇల్లు, ఇతర ఆస్తులు తన పేర బదిలీ చేయకపోతే నా మీద, నా కుటుంబం మీద వరకట్నం కేసు పెడతానని బెదిరిస్తోంది. మరణం తరువాతైనా నాకు న్యాయం దక్కకపోతే నా అస్థికలను డ్రెయినేజీలో కలిపేయండి. మీ అంచనాలను అందుకోలేకపోయినందుకు అమ్మా.. నాన్నా నన్ను క్షమించండి’’ అని మోహిత్ తెలిపారు.


యూపీలోని ఆరియా జిల్లాకు చెందిన మోహిత్ ప్రియ యాదవ్‌తో చాలా కాలంగా రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. కానీ ప్రీయాకు బీహార్‌లో ప్రైమరీ టీచర్‌గా ఉద్యోగం వచ్చాక పరిస్థితి మారిపోయిందని మోహిత్ కుటుంబం ఆరోపించింది. ప్రియా ప్రవర్తనలో మార్పు వచ్చిందని, తన తల్లి, సోదరుడి ప్రభావానికి లోనై మోహిత్‌పై మానసిక వేధింపులకు దిగిందని వారు ఆరోపించారు. పోస్ట్ మార్టం తరువాత మోహిత్‌కు అతడి కుటుంబసభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు.


‘‘మోహిత్‌కు సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న సమయంలో ప్రియాతో పరిచయమైంది. ఆ తరువాత వారి రిలేషన్‌షిప్ ఏడేళ్ల పాటు సాగింది. అనంతరం వారికి మేము పెళ్లి జరిపించాము. పెళ్లి తరువాత మొదటి మూడు నెలలు అంతా సాఫీగానే సాగిపోయింది. తరువాత ప్రియా అతడిని మెంటల్‌గా టార్చర్ పెట్టడం ప్రారంభించింది. మాకు అతడిని దూరం చేసింది. ఆస్తులు తన పేర బదిలీ చేయాలంటూ ఒత్తిడి చేయడం ప్రారంభించింది. ఆమె సోదరుడు, తల్లి కూడా బెదిరింపులకు దిగారు. ఒత్తిడి తట్టుకోలేక నా సోదరుడు ప్రాణాలు తీసుకున్నాడు. ఆత్మహత్యకు ముందు రాత్రి వీడియో రికార్డూ చేసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశాడు’’ అని మృతుడి సోదరుడు తెలిపారు.

ఇవి కూడా చదవండి:

ఐసీయూలో ఎయిర్‌హోస్టస్‌పై అత్యాచారం.. ఎట్టకేలకు పోలీసుల అదుపులో నిందితుడు

మాజీ బాయ్‌ఫ్రెండే కాబోయే మామగారు.. యువతి లైఫ్‌లో వింత ట్విస్ట్

తల్లి హృదయం ఎంత గొప్పది.. చిరుత దాడిలో గాయపడ్డా లెక్క చేయక ఈ తల్లి శునకం..

Read Latest and Crime News

Updated Date - Apr 20 , 2025 | 04:03 PM