Chennai News: మృత్యువులోనూ వీడని అనుబంధం.. తమ్ముడి మరణాన్ని తట్టుకోలేక సోదరుడి మృతి
ABN , Publish Date - Jul 04 , 2025 | 11:23 AM
ఐదేళ్ల ప్రాయం నుండి 75 యేళ్ల వరకు కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చిన తమ్ముడు ఆకస్మికంగా మృతి చెందటంతో ఆ బాధ తట్టుకోలేక అతడి సోదరుడు మృతదేహంపై పడి ప్రాణాలు విడిచాడు.
చెన్నై: ఐదేళ్ల ప్రాయం నుండి 75 యేళ్ల వరకు కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చిన తమ్ముడు ఆకస్మికంగా మృతి చెందటంతో ఆ బాధ తట్టుకోలేక అతడి సోదరుడు మృతదేహంపై పడి ప్రాణాలు విడిచాడు. వేలూరు(Veluru) జిల్లా ఒడకత్తూరు సమీపంలోని కోట్టావూరు గ్రామంలో జరిగిన ఈ సంఘటన గ్రామస్థుల కంట తడిపెట్టించింది. ఆ గ్రామంలో జయరామన్ (85), బలరామన్ (80) అనే అన్నదమ్ములు నివసిస్తున్నారు. ఇద్దరూ రైతులు.
వీరికి ఇద్దరేసి కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. ఐదేళ్ల క్రితం వారిద్దరి భార్యలు మృతి చెందారు. ఆ తర్వాత అన్నదమ్ములు ఇద్దరూ ఒకే ఇంటిలో నివసిస్తూ పొలం పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. మూడేళ క్రితం బలరామన్ కాలు విరిగి మంచానికే పరిమితమయ్యారు.. ఈ నేపథ్యంలో బుధవారం మధ్యాహ్నం బలరామన్ చెందాడు.

దీంతో అతడి సోదరుడు జయరామన్ తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు, గ్రామస్థులు కలిసి జయరామన్ అంత్యక్రియల ఏర్పాట్లు చేపట్టారు. ఇంటి నుండి వెలుపలకు వచ్చిన జయరామన్ తను అల్లారు ముద్దుగా పెంచిన తమ్ముడు బలరామన్ మృతదేహాన్ని చూసి బోరున విలపిస్తూ కుప్పకూలిపడ్డాడు.
తమ్ముడి దేహంపై పడిన జయరామన్‌ను బంధువులు లేపేందుకు ప్రయత్నించినా లేవలేదు. ఆ తర్వాత పరీక్షించి చూడగా జయరామన్ మృతి చెందినట్లు తెలుసుకుని శోకతప్తులయ్యారు. చివరకు భారమైన మనస్సుతో ఆ అన్నదమ్ముల అంత్యక్రియలను కుటుంబ సభ్యులు, స్థానికులు ఘనంగా జరిపించారు.
ఈ వార్తలు కూడా చదవండి.
కాటేదాన్ రబ్బర్ కంపెనీలో అగ్ని ప్రమాదం
రిజర్వేషన్లు అమలు తర్వాతే ఎన్నికలు నిర్వహించాలి
Read Latest Telangana News and National News