Bengaluru Saree Theft: చీరలు దొంగిలించిన మహిళపై వ్యాపారి దాడి.. నిందితుడి అరెస్టు
ABN , Publish Date - Sep 26 , 2025 | 01:53 PM
చీరలు దొంగిలించిన ఓ మహిళను షాపు యజమాని ఇష్టారీతిన కొట్టిన ఘటన బెంగళూరులో కలకలం రేపింది. అయితే, చోరీ చేసిన మహిళతో పాటు ఆమెపై దాడి చేసిన వారిని పోలీసులు అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు.
ఇంటర్నెట్ డెస్క్: చీరలు దొంగిలించిన మహిళను ఓ వ్యాపారి నడి వీధిలో ఇష్టారీతిన కొట్టాడు. కనీసం మనిషిలా కూడా చూడకుండా దారుణంగా వ్యవహరించారు. బెంగళూరులో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేగింది. ఘటనపై అనేక మంది విమర్శలు గుప్పించారు. నిందితుడిని, అతడికి సహకరించిన మరో వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు (Bengaluru Saree Theft).
స్థానిక పోలీసుల కథనం ప్రకారం, హుంపమ్మ అనే మహిళ నగరంలోని ఎవెన్యూ రోడ్డులో గల ఓ షాపునకు వెళ్లి అక్కడ చీరలు దొంగిలించి పారిపోయింది. అయితే, ఆమె చోరీ వైనం మొత్తం సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యింది (shopkeeper violence woman).
చీరల బండల్‌ను తీసుకెళ్లేందుకు పలుమార్లు ప్రయత్నించిన మహిళ చివరకు దానితో బయటకు వెళ్లిపోయింది. ఆ తరువాత మరిన్ని చీరలు చోరీ చేసేందుకు షాపునకు వచ్చింది. ఈ క్రమంలో షాపు యజమానికి రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయింది (viral violence Bengaluru).
ఈ క్రమంలో తీవ్ర ఆగ్రహానికి గురయిన షాపు యజమాని మహిళను బయటకు ఈడ్చి నడిరోడ్డుపై ఇష్టారీతిన చేయి చేసుకున్నాడు. చేయి పట్టి నేలపై ఈడ్చాడు. కాలితో తన్నాడు. షాపు యజమాని సహాయకుడు కూడా మహిళపై దాడి చేశాడు. ఈ ఘటన నెట్టింట కూడా చర్చనీయాంశంగా మారింది.
ఈ క్రమంలో పోలీసులు మహిళలపై దొంగతనం కేసు పెట్టారు. అంతేకాకుండా ఆమెపై దాడి చేసిన షాపు యజమాని, అతడి సహాయకుడిపై కూడా కేసు నమోదు చేశారు. ముగ్గురినీ అరెస్టు చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.
ఇవి కూడా చదవండి:
శోభనం జరగలేదని భర్త నుంచి రూ.2 కోట్లు డిమాండ్
త్వరగా ఇంటికొచ్చిన భర్తకు షాక్.. భార్య మరొకరితో క్లోజ్‌గా ఉండటం చూసి..