Share News

Husbands Affair And Harassment: వేరే అమ్మాయితో భర్త ఎఫైర్.. నిలదీసిన భార్యను..

ABN , Publish Date - Sep 03 , 2025 | 09:00 AM

భర్త దిగొచ్చాడు. అదనపు కట్నం వద్దని, ఎఫైర్ ఆపేస్తానని నందీష్ ఆమెకు మాటిచ్చాడు. ఇంటికి వచ్చేయమన్నాడు. దీంతో పూజాశ్రీ అత్తింటికి వెళ్లింది. మూడు రోజుల క్రితం నందీష్, పూజాశ్రీకి మధ్య గొడవైంది. నందీష్ ఆమెను కొట్టాడు.

Husbands Affair And Harassment: వేరే అమ్మాయితో భర్త ఎఫైర్.. నిలదీసిన భార్యను..
Husbands Affair And Harassment

భర్త వివాహేతర సంబంధం భార్య ప్రాణం తీసింది. భర్త వేధింపులు తట్టుకోలేక ఆ భార్యా ప్రాణాలు తీసుకుంది. ఈ సంఘటన కర్ణాటకలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళితే.. బెంగళూరుకు చెందిన నందీష్, పూజాశ్రీకి మూడేళ్ల క్రితం పెళ్లయింది. వీరిది పెద్దలు కుదిర్చిన వివాహం. సంవత్సరం క్రితం వీరికి ఓ పాప పుట్టింది. నందీష్ ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. పూజాశ్రీ ఓ ప్రైవేట్ బ్యాంకులో క్యాషియర్‌గా పని చేస్తోంది. కొన్ని నెలల క్రితం పూజాశ్రీకి ఓ దారుణమైన విషయం తెలిసింది.


భర్త ఓ ఏడాది నుంచి వేరే అమ్మాయితో ఎఫైర్ పెట్టుకున్నాడన్న సంగతి బయటపడింది. దీంతో ఆమె తట్టుకోలేకపోయింది. భర్తను నిలదీసింది. భార్య తనను ప్రశ్నించటం నందీష్ తట్టుకోలేకపోయాడు. ఆమెను వేధింపులకు గురి చేయటం మొదలెట్టాడు. మరో వైపు అత్త అదనపు కట్నం తెమ్మంటూ ఇబ్బందిపెట్టసాగింది. అత్తింటి వారి వేధింపులు తట్టుకోలేక పూజాశ్రీ పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ నేపథ్యంలోనే భర్త దిగొచ్చాడు. అదనపు కట్నం వద్దని, ఎఫైర్ ఆపేస్తానని నందీష్ ఆమెకు మాటిచ్చాడు. ఇంటికి వచ్చేయమన్నాడు. దీంతో పూజాశ్రీ అత్తింటికి వెళ్లింది. మూడు రోజుల క్రితం నందీష్, పూజాశ్రీకి మధ్య గొడవైంది. నందీష్ ఆమెను కొట్టాడు.


భర్త దారుణాలను పూజాశ్రీ తట్టుకోలేకపోయింది. మళ్లీ పుట్టింటికి వెళ్లిపోయింది. సోమవారం పుట్టింట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మంగళవారం ఉదయం కుటుంబసభ్యులు పూజాశ్రీ ఉరికి వేలాడుతుండటాన్ని గుర్తించారు. ఆమె చనిపోవటంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఆమె కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు ఫైల్ చేశారు. దర్యాప్తు చేస్తున్నారు. నందీష్‌ను అరెస్ట్ చేశారు. పాపం.. తల్లి మరణం, తండ్రి జైలు పాలవ్వటంతో వారి కూతురు అనాథగా మిగిలిపోయింది.


ఇవి కూడా చదవండి

ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఆరు అలవాట్లు తప్పనిసరి!

ది రాక్‌కు ఏమైంది?.. మరీ ఇంత సన్నగా అయ్యాడేంటి?

Updated Date - Sep 03 , 2025 | 09:03 AM