Bengaluru: పోలీసులా.. మజాకా.. మాకే బిల్లు ఇస్తావా అంటూ..
ABN , Publish Date - Sep 30 , 2025 | 12:47 PM
భోజనం చేశాం.. అయితే మాకే బిల్లు ఇస్తావా..అంటూ పోలీసులు ఓ మాజీ సైనికుడిపై విరుచుకు పడ్డారు. ధారవాడలో హోటల్ నిర్వహిస్తున్న మాజీ సైనికుడిని పోలీసులు చితకబాదిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది. ఆదివారం రాత్రి 11గంటలకు సప్తపుర లే అవుట్ వివేకానంద సర్కిల్‌లో పోలీసులు భోజనం చేసేందుకు వెళ్లారు.
- భోజనం హోటల్ నిర్వహిస్తున్న మాజీ సైనికుడిని చితకబాదిన పోలీసులు
బెంగళూరు: భోజనం చేశాం.. అయితే మాకే బిల్లు ఇస్తావా..అంటూ పోలీసులు ఓ మాజీ సైనికుడిపై విరుచుకు పడ్డారు. ధారవాడలో హోటల్ నిర్వహిస్తున్న మాజీ సైనికుడిని పోలీసులు చితకబాదిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది. ఆదివారం రాత్రి 11గంటలకు సప్తపుర లే అవుట్ వివేకానంద సర్కిల్‌లో పోలీసులు భోజనం చేసేందుకు వెళ్లారు. ఏఎస్సై, నలుగురు కానిస్టేబుళ్లు భోజనం ముగించారు. బిల్లు ఇచ్చేందుకు వెళ్లగా పోలీసులు మాకే బిల్లు ఇస్తావా...? ఇంతరాత్రి దాకా ఎందుకు హోటల్ పెట్టావు..? అంటూ గొడవ చేశారు.
భోజనం చేసినందుకే బిల్లు అడుగుతున్నా అని మాజీ సైనికుడు రామప్ప నిప్పాణి వాదించగా మరింత ఆగ్రహంతో ఏఎస్సైతోపాటు పోలీసులు ఒక్కసారిగా హెల్మెట్‌తోపాటు లాఠీలతో చితకబాదారు. మెస్‌లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. తీవ్రగాయాలపాలైన రామప్ప నిప్పాణి కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ధారవాడ జిల్లా ఉక్కలి గ్రామానికి చెందిన మాజీ సైనికుడు రామప్ప నిప్పాణి హోటల్ నిర్వహిస్తున్నారు.
కొంతకాలంగా భార్యతోకలసి సైనిక్ మెస్ అండ్ హోటల్ పేరిట వ్యాపారమే జీవనంగా కొనసాగిస్తున్నారు. ఇదే విషయమై ఆయన భార్య మీడియాతో మాట్లాడుతూ తన భర్తను తన ఎదురుగానే ఐదుగురు పోలీసులు కలసి తీవ్రంగా కొట్టారన్నారు. తనను నోటికి వచ్చినట్టు దూషించి అవమానం చేశారన్నారు. తమ కుటుంబానికి న్యాయం చేయాలని వేడుకున్నారు. ధారవాడ ఉపనగర్‌కు చెందిన పోలీసులపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
భారీగా పెరిగిన బంగారం ధర.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
Read Latest Telangana News and National News