Assam: భార్యను చంపిన వృద్ధుడు.. ఆమె తలను సంచీలో తీసుకెళ్లి..
ABN , Publish Date - Apr 20 , 2025 | 04:40 PM
అస్సాంకు చెందిన ఓ వృద్ధుడు తన భార్యకు దారుణంగా చంపాడు. శరీరం నుంచి ఆమె తలను వేరు చేసి సంచీలో తీసుకెళ్లి పోలీసుల ముందు లొంగిపోయాడు. వృద్ధ దంపతులు నిత్యం గొడవ పడుతుండేవారని స్థానికులు తెలిపారు.
ఇంటర్నెట్ డెస్క్: అస్సాంలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. భార్యతో తగాదా పడ్డ ఓ 60 ఏళ్ల వృద్ధుడు ఆమెను అంతమొందించాడు. ఆ తరువాత ఆమె తలను శరీరం నుంచి వేరు చేసి సంచీలో తీసుకుని వెళ్లి పోలీసుల ముందు లొంగిపోయాడు. చిరాంగ్ జిల్లాలో ఈ దారుణం జరిగింది. నిందితుడిని బీతీష్ హజాంగ్‌గా గుర్తించారు.
బితీష్ తన భార్య బజంతీని చంపి పదునైన వస్తువుతో ఆమె తలను శరీరం నుంచి వేరు చేశారు. దాన్ని సంచీలో వెసుకుని సైకిల్‌పై బల్లమ్‌గురిలోని ఔట్‌పోస్టు వద్ద పోలీసులకు లొంగిపోయాడు. పోలీస్ స్టేషన్‌లో, సైకిల్‌పైనా రక్తం మరకలు ఉన్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో కూడా రికార్డయ్యాయి. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
స్థానిక మీడియా కథనాల ప్రకారం, బితీష్, అతడి భార్యకు మధ్య నిత్యం గొడవలు జరుగుతుండేవి. భార్యాభర్తలకు అస్సలు పడేది కాదని, చిన్న చిన్న విషయాలకే ఘర్షణ పడే వారని ఇరుగుపొరుగు అన్నారు. ఈ క్రమంలో శనివారం ఎప్పటిలాగే పని ముగించుకుని ఇంటికొచ్చిన బితీష్‌కు, అతడి భార్యకు మరోసారి గొడవ జరిగింది. ఈ క్రమంలోనే వృద్ధుడు దారుణానికి ఒడిగట్టాడు.
మృతదేహాన్ని పోస్టు మార్టంకు తరలించినట్టు పోలీసులు తెలిపారు. శాంపిళ్లను ఫారెంన్సిక్ నిపుణులు పరీక్షిస్తున్నారని వెల్లడించారు. నిందితుడి అదుపులోకి తీసుకున్నామని, ఘటనపై విచారణ జరుపుతున్నామని చిరాగ్ జిల్లా ఏఎస్పీ తెలిపారు.
ఇవి కూడా చదవండి:
ఐసీయూలో ఎయిర్‌హోస్టస్‌పై అత్యాచారం.. ఎట్టకేలకు పోలీసుల అదుపులో నిందితుడు
మాజీ బాయ్‌ఫ్రెండే కాబోయే మామగారు.. యువతి లైఫ్‌లో వింత ట్విస్ట్
తల్లి హృదయం ఎంత గొప్పది.. చిరుత దాడిలో గాయపడ్డా లెక్క చేయక ఈ తల్లి శునకం..