Share News

ప్రేమను నిరాకరించిందని.. విద్యార్థిని దారుణ హత్య

ABN , Publish Date - May 30 , 2025 | 12:19 PM

తన ప్రేమను నిరాకరించిందని విద్యార్థినిని దారుణంగా హత్య చేశాడో యువకుడు. 10వ తరగతి చదువుున్న జననిని సుబ్రమణి అనే యువకుడు ప్రేమిస్తున్నానంటూ గతకొద్ది రోజులుగా వేధిస్తున్నాడు. అయితే.. జనని నిరాకరించడంతో కత్తితో దాడిచేసి హతమార్చాడు. వివరాలిలా ఉన్నాయి.

 ప్రేమను నిరాకరించిందని.. విద్యార్థిని దారుణ హత్య

చెన్నై: ప్రేమను నిరాకరించిందంటూ విద్యార్థినిని దారుణంగా హతమార్చిన ఘటన రాణిపేట(Ranipet) జిల్లాలో జరిగింది. షోలింగర్‌ సమీపం పులివల గ్రామానికి చెందిన జగత్‌కుమార్‌ కుమార్తె జనని (15) 10వ తరగతి చదువుతోంది. వేసవి సెలవులు కావడంతో, జగత్‌కుమార్‌ అక్క కుమార్తె లక్ష్య (16)తో కలసి జనని బామ్మ ఇంట్లో ఉంటోంది. ఈ క్రమంలో, బుధవారం రాత్రి ఇంట్లోకి ప్రవేశించిన ఓ యువకుడు తలుపులు మూసివేసి, కత్తితో జననిపై తీవ్రంగా దాడిచేశాడు.


అతడిని అడ్డుకునేందుకు యత్నించిన లక్ష్యపై కూడా దాడిచేశాడు. వారి కేకలకు చుట్టుపక్కల వారు అక్కడకు చేరుకుని తలుపులు బద్దలుకొట్టి లోనికి వెళ్లగా జనని, లక్ష్య రక్తపు మడుగుల్లో పడి ఉండడం చూసి దిగ్ర్భాంతి చెందారు. ఈ ఘటనలో తీవ్రగాయాలతో జనని ఘటనా స్థలంలోనే మృతిచెందింది. అలాగే, గాయపడిన లక్ష్యను సమీపంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు.


nani2.2.jpg

ఈ నేపథ్యంలో, ఇంట్లో కత్తితో నిలబడి తప్పించుకునేందుకు యత్నించిన యువకుడిని ప్రజలు చితకబాది పోలీసులకు అప్పగించారు. పోలీసుల విచారణలో... తిరువళ్లూర్‌ జిల్లా కేజీ కండికై ప్రాంతానికి చెందిన సుబ్రమణి (21) అని, అతను పలుమార్లు తనను ప్రేమించాలంటూ జననిని వేధించేవాడని, అందుకు ఆమె నిరాకరించడంతో ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలిసింది.


ఈ వార్తలు కూడా చదవండి.

Gold Rates In India on May 30: నేడూ స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు

Fee Reimbursement: ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్‌కు 75 శాతం హాజ‌రు తప్పనిసరి

Read Latest Telangana News and National News

Updated Date - May 30 , 2025 | 12:19 PM