వస్తున్నాయ్ జొమాటో విమానాలు
ABN , Publish Date - Jun 30 , 2025 | 03:11 AM
ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో సహ వ్యవస్థాపకుడు దీపీందర్ గోయెల్.. ల్యాట్ ఏరోస్పేస్ భాగస్వామ్యంలో ప్రాంతీయ విమానయానంలో ప్రవేశించే యోచన చేస్తున్నారు...
ముంబై/న్యూఢిల్లీ: ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో సహ వ్యవస్థాపకుడు దీపీందర్ గోయెల్.. ల్యాట్ ఏరోస్పేస్ భాగస్వామ్యంలో ప్రాంతీయ విమానయానంలో ప్రవేశించే యోచన చేస్తున్నారు. జొమాటో సహ వ్యవస్థాపకురాలు సురభి దాస్ లింక్డ్‌ఇన్ పోస్ట్‌లో ఈ విషయం వెల్లడించారు. దేశంలోని 450 ఎయిర్‌స్ట్రి్‌పలలో 150 మాత్రమే పని చేస్తున్నాయి. అంటే మూడింట రెండు వంతులు ఇప్పటికీ వృధాగానే పడి ఉన్నాయి. వాటిని వినియోగంలోకి తేవడం వల్ల ఇప్పటికీ రోడ్డు లేదా రైలు మార్గాల్లో ప్రయాణిస్తూ గంటలు, రోజులు వృధా చేసుకుంటున్న సగటు జీవులకు తక్కువ వ్యయంతో విమానాల్లో తిరిగే అవకాశం కల్పించవచ్చని ఆమె పేర్కొన్నారు. తాము ప్రారంభించాలనుకుంటున్న ల్యాట్ ఏరోస్పేస్ విమానాలు ఒక పార్కింగ్ లాట్‌తో సమానమైన విస్తీర్ణం ఉండే ఎయిర్-స్టా్‌పలలో టేకాఫ్, ల్యాండింగ్ కాగలవని ఆమె చెప్పారు.
Also Read:
యువ రచయిత సూరాడ ప్రసాద్‌కు సీఎం చంద్రబాబు అభినందనలు..
నా శత్రువు పెద్దారెడ్డి మాత్రమే...
For More Telugu News