Share News

Arattai encryption: వాట్సాప్ తరహాలోనే అరట్టైలో కూడా ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్‌.. అయితే ఛాయిస్ మీదే..

ABN , Publish Date - Nov 04 , 2025 | 09:52 PM

వాట్సాప్‌నకు పోటీగా దేశీయ టెక్ సంస్థ జోహో.. అరట్టై పేరుతో ఓ మెసేజింగ్ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. చాలా తక్కువ సంఖ్యలోనే ఈ అరట్టై యాప్‌నకు క్రేజ్ పెరిగింది. లక్షల సంఖ్యలో డౌన్‌లోడ్‌లు జరుగుతున్నాయి.

Arattai encryption: వాట్సాప్ తరహాలోనే అరట్టైలో కూడా ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్‌.. అయితే ఛాయిస్ మీదే..
Arattai privacy settings

వాట్సాప్‌నకు పోటీగా దేశీయ టెక్ సంస్థ జోహో.. అరట్టై పేరుతో ఓ మెసేజింగ్ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. చాలా తక్కువ సంఖ్యలోనే ఈ అరట్టై యాప్‌నకు క్రేజ్ పెరిగింది. లక్షల సంఖ్యలో డౌన్‌లోడ్‌లు జరుగుతున్నాయి. ఈ అరట్టై యాప్‌ కూడా వాట్సాప్ తరహాలోనే ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్‌ తీసుకురాబోతోంది. అయితే ఈ ఆప్షన్‌పై జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు వినియోగదారుల అభిప్రాయాలను కోరారు (Sridhar Vembu Arattai).


ఈ ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్‌ (end-to-end encryption) ఆప్షన్‌ను డీఫాల్ట్‌గా ఉంచాలా లేదా అప్షనల్‌గా ఉంచాలా అని వినియోగదారుల ముందు శ్రీధర్ రెండు ఆప్షన్లు ఉంచారు. దీనికి సంబంధించి సంస్థ రెండు విధానాలను పరిశీలిస్తోందని ఆయన వెల్లడించారు. యూజర్ కావాలనుకుంటే అన్ని ఛాట్‌లకు ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్‌ అమలు చేయడం. లేదంటే.. ఎంపిక చేసుకున్న ఛాట్‌లకు మాత్రమే ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్‌ ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవడం. అయితే ఇద్దరిలో ఎవరు ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్‌ ఆప్షన్‌ను ఎంపిక చేసుకున్నా ఆ చాట్ మొత్తం ఆటోమేటిక్‌గా సెక్యూర్ అవుతుంది.


ఈ ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్‌ ఆప్షన్‌ ఫీచర్ ద్వారా ఆ మెసేజ్‌ను పంపిన వారు, స్వీకరించిన వారు మాత్రమే చదవగలరు (Arattai privacy settings). మధ్యలోని వారెవరూ చదవలేరు. సంస్థ కూడా ఆ డేటాను పరిశీలించలేదు. ఇప్పటికే వాట్సాప్, సిగ్నల్ వంటి మెసేజింగ్ యాప్‌లు ఈ ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్‌ ఆప్షన్‌ను డీఫాల్ట్‌గా అందిస్తున్నాయి. మరి, అరట్టై విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.


ఇవీ చదవండి:

ఈ పని చేయకుంటే.. జనవరి నుంచి పాన్‌ కార్డు డీయాక్టివేట్‌!

మెంబర్ పోర్టల్‌లోనే పాస్ బుక్.. ఈపీఎఫ్ఓ కొత్త ఫీచర్

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Nov 04 , 2025 | 09:52 PM