Share News

Zepto IPO: జెప్టో మెగా ఐపీఓ

ABN , Publish Date - Dec 28 , 2025 | 05:43 AM

దేశీయ క్విక్‌ కామర్స్‌ దిగ్గజం జెప్టో పబ్లిక్‌ ఇష్యూకు వస్తోంది. ఈ మేరకు కంపెనీ.. మార్కెట్‌ నియంత్రణ మండలి సెబీకి కాన్ఫిడెన్షియల్‌ విధానం లో ముసాయిదా పత్రాలను...

Zepto IPO: జెప్టో మెగా ఐపీఓ

రూ.11,000 కోట్ల సమీకరణ లక్ష్యం

న్యూఢిల్లీ: దేశీయ క్విక్‌ కామర్స్‌ దిగ్గజం జెప్టో పబ్లిక్‌ ఇష్యూకు వస్తోంది. ఈ మేరకు కంపెనీ.. మార్కెట్‌ నియంత్రణ మండలి సెబీకి కాన్ఫిడెన్షియల్‌ విధానం లో ముసాయిదా పత్రాలను సమర్పించింది. ఈ ఐపీఓ ద్వారా సుమారు రూ. 11,000 కోట్లను సమీకరించాలని జెప్టో లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది మార్కెట్లో లిస్టింగ్‌ కావాలని జెప్టో భావిస్తోంది. అనుకున్నట్టుగా జరిగితే భారత మార్కెట్లో లిస్టయిన అత్యంత యువ స్టార్ట్‌పలలో ఒకటిగా జెప్టో నిలవనుంది. ప్రస్తుతం 63,000 కోట్ల మార్కెట్‌ విలువ కలిగిన జెప్టో ఈ ఐపీఓ ద్వారా లభించే నిధులను కార్యకలాపాల విస్తరణకు వినియోగించనుంది. కాగా జొమాటో (బ్లింకిట్‌), స్విగ్గీ (ఇన్‌స్టామార్ట్‌) వంటి సంస్థలు ఇప్పటికే మార్కెట్లో లిస్ట్‌ అయ్యాయి.

ఇవీ చదవండి:

సూపర్.. ప్రపంచంలో నెం.3 స్థానానికి చేరిన వెండి!

ఈ ఏడాది ఐటీ నియామకాల్లో 16 శాతం వృద్ధి

Updated Date - Dec 28 , 2025 | 05:43 AM