Share News

Year End Car Drive Big Discounts: ఇయర్‌ ఎండ్‌ ఆఫర్లు.. రండి బాబు రండి..

ABN , Publish Date - Dec 24 , 2025 | 03:05 AM

Year End Car Offers Drive Big Discounts Across Passenger Vehicle Market

Year End Car Drive Big Discounts: ఇయర్‌ ఎండ్‌ ఆఫర్లు.. రండి బాబు రండి..

వినియోగదారులకు కార్ల కంపెనీల వల.. కొనుగోళ్లపై ఆఫర్ల మీద ఆఫర్లు

ప్యాసింజర్‌ కార్ల మార్కెట్లో ఇయర్‌ ఎండ్‌ సందడి నడుస్తోంది. 2025 స్టాకును వదిలించుకునేందుకు కార్ల కంపెనీలు ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. క్యాష్‌ బెనిఫిట్స్‌, ఎక్స్ఛేంజీ బోన్‌సలతో పాటు ఈఎంఐల వెసులుబాటు రూపంలోనూ కంపెనీలు కొనుగోలుదారులను రండి బాబు రండి అని ఆకర్షిస్తున్నాయి. ఫోక్స్‌వ్యాగన్‌, మారుతి సుజుకీ, కియా, హ్యుండయ్‌ మోటార్స్‌తో పాటు హోండా వంటి దిగ్గజ కార్ల కంపెనీల హ్యాచ్‌బ్యాక్‌లు, సెడాన్‌లతో పాటు ఎస్‌యూవీలపై ఆఫర్లు అందిస్తున్నాయి. ఫెస్టివల్‌ సీజన్‌లో ప్రారంభమైన ఈ ఆఫర్లు ఈ నెలాఖరుకల్లా క్లోజ్‌ కాబోతున్నాయి. వివిధ కంపెనీలు ఆఫర్‌ చేస్తున్న ఈ ఇయర్‌ ఎండ్‌ ఆఫర్లు ఎలా ఉన్నాయంటే..

క్యాష్‌ డిస్కౌంట్‌లు, ఎక్స్ఛేంజీ బోన్‌సలు, లాయల్టీ బోన్‌సలు, కార్పొరేట్‌ ఆఫర్లు, బీమా పథకాలతో కలిపి ఈ ప్రయోజనాలు లభిస్తాయి. అయితే కొనుగోలు చేసే వాహనం మోడల్‌, ప్రాంతం, డీలర్‌ను బట్టి పై ప్రయోజనాల్లో స్వల్ప తేడాలు ఉంటాయి.

కియా ఇండియా

అమ్మకాలు పెంచుకునేందుకు కియా ఇండియా ‘ఇన్‌స్పైరింగ్‌ డిసెంబర్‌’ పేరుతో ప్రత్యేక ప్రచార కార్యక్రమం చేపట్టింది. ఈ ప్రచారంలో భాగంగా సెల్టోస్‌, సోనెట్‌, కార్నివాల్‌ వంటి ఎంపిక చేసిన కొన్ని మోడల్స్‌పై నగదు డిస్కౌంట్‌లు, ఎక్స్ఛేంజీ ఆఫర్లు, లాయల్టీ బోన్‌సల రూపంలో రూ.3.65 లక్షల వరకు ప్రత్యేక ప్రయోజనాలు అందజేస్తోంది. ఈ నెలాఖరుతో ముగిసే ఈ ప్రత్యేక ఆఫర్లు స్టాకు ఉన్నంత వరకు మాత్రమేనని కంపెనీ తెలిపింది.

మారుతి సుజుకీ

  • వ్య్ఠాగన్‌ఆర్‌ పెట్రోల్‌, సీఎన్‌జీ వేరియంట్స్‌పై ఎక్స్ఛేంజీ, స్ర్కాపేజీ బోన్‌సలు, నగదు ప్రయోజనాల రూపంలో రూ.61,100 వరకు ఆఫర్‌

  • బాలెనో పెట్రోల్‌ మాన్యువల్‌, సీఎన్‌జీ వెర్షన్లపై రూ.48,000 వరకు, ఏఎంటీ వెర్షన్‌పై రూ.53,000 వరకు ప్రయోజనాలు

  • డిజైర్‌ పెట్రోల్‌, సీఎన్‌జీ వేరియంట్స్‌పై రూ.15,000 వరకు ప్రయోజనాలు

  • స్విఫ్ట్‌ పెట్రోల్‌ మాన్యువల్‌, ఏఎంటీ వేరియంట్లపై రూ.40,000 వరకు, సీఎన్‌జీ వెర్షన్లపై రూ.30,000 వరకు ఆదా

  • గ్రాండ్‌ విటారా పెట్రోల్‌, ఆల్‌ వీల్‌ డ్రైవ్‌, సీఎన్‌జీ వేరియంట్స్‌పై రూ.లక్షకుపైగా, హైబ్రిడ్స్‌పై ఎక్స్‌టెండెడ్‌ వారెంటీతో పాటు రూ.2.03 లక్షల వరకు ఆదా

టాటా మోటార్స్‌

ఞటాటా పంచ్‌ పెట్రోల్‌, సీఎన్‌జీ వేరియంట్లపై

రూ.40,000 వరకు డిస్కౌంట్‌

  • రూ.7.99 లక్షల నుంచి రూ.14.15 లక్షల ధర ఉండే టాటా నెక్సస్‌ పెట్రోల్‌, డీజిల్‌, సీఎన్‌జీ వెర్షన్ల మీద రూ.50,000 వరకు డిస్కౌంట్‌

  • కొత్త ఆలో్ట్రజ్‌ మోడల్స్‌ మీద రూ.25,000 వరకు రాయితీ

  • రూ.6.3 లక్షలు- రూ.10.51 లక్షల మధ్య ధర ఉండే పాత ఆలో్ట్రజ్‌ మోడల్స్‌పై రూ.85,000 వరకు డిస్కౌంట్‌

  • హారియర్‌, సఫారీ మోడల్స్‌పై రూ.లక్ష వరకు ప్రయోజనాలు

  • టియాగో, టిగోర్‌, పంచ్‌, ఆలో్ట్రజ్‌, నెక్సాన్‌, కర్వ్‌ వంటి ఐసీఈ వాహన రుణాలపై కనీస ఈఎంఐ రూ.4,999 నుంచి రూ.9,999 వరకు.

  • ఈవీల రుణాలపైనా రూ.5,999 నుంచి రూ.14,555 వరకు కనీస ఈఎంఐలు


మహీంద్రా అండ్‌ మహీంద్రా (ఎం అండ్‌ ఎం)

  • ఎక్స్‌యూవీ 3ఎక్స్‌ఓ కొనుగోళ్లపై రూ.1,14,500 వరకు

  • ఎక్స్‌యూవీ 400 మోడల్‌పై రూ.4.45 లక్షల వరకు

  • స్కార్పియో క్లాసిక్‌పై రూ.1.14 లక్షల వరకు ఆదా

  • స్కార్పియో ఎన్‌ మోడల్‌ మీద రూ.85,600 వరకు

  • థార్‌ రాక్స్‌ మోడల్‌పై రూ.1.20 లక్షల వరకు ఆదా

  • ఎక్స్‌యూవీ 700 మోడల్‌ మీద రూ.1,55,600 వరకు

స్కోడా

  • జూ మిడ్‌ సైజ్‌ ఎస్‌యూవీ కుషాక్‌పై రూ.3.25 లక్షల వరకు ఆదా

  • జూ స్లావియా సెడాన్‌ మీద రూ.2.25 లక్షల వరకు ప్రయోజనాలు

  • జూకైలాక్‌పై రూ.75,000 వరకు ప్రయోజనాలు

  • జూటాప్‌ ఎండ్‌ కోడియాక్‌ మోడల్‌ ఎస్‌యూవీపై రూ.6 లక్షల వరకు ఆదా

111-Business.jpg

హ్యుండయ్‌ మోటార్‌

  • గ్రాండ్‌ ఐ10 నియోస్‌ మీద రూ.1,43,808 వరకు

  • ఐ20 పై రూ.1,68,053 వరకు

  • ఎక్స్‌టర్‌ మీద రూ.1,74,209 వరకు

  • ఆరాపై రూ.1,11,465 వరకు

  • వెర్నా మోడల్‌ మీద రూ.1,35,640 వరకు

  • అల్కాజార్‌ మోడల్‌పై రూ.1,15,376 వరకు

హోండా కార్స్‌

  • రూ.7,40,800 నుంచి ప్రారంభమయ్యే అమేజ్‌ మోడల్‌ మీద రూ.87,000 వరకు ప్రయోజనాలు

  • రూ.10,99,900 నుంచి ప్రారంభమయ్యే హోండా ఎలివేటర్‌ ఎస్‌యూవీ మీద రూ.1.76 లక్షల వరకు

  • రూ.11,95,300 నుంచి ప్రారంభమయ్యే సిటీ సెడాన్‌ సెలక్ట్‌ వేరియంట్స్‌పై రూ.1,57,700 వరకు


ప్రయోజనాలు

ఫోక్స్‌వ్యాగన్‌

  • టైగన్‌ స్పోర్ట్‌ 1.0 లీటర్‌ టీఎ్‌సఐ ఆటోమేటిక్‌ వెర్షన్‌ మీద రూ.80,000 వరకు ఆదా

  • టైగన్‌ జీటీ ప్లస్‌ స్పోర్ట్‌ 1.5 లీటర్‌ టీఎ్‌సఐ డీఎ్‌సజీ మోడల్‌పై రూ.50,000 ఎక్స్ఛేంజీ ప్రయోజనాలతో పాటు తొలి ఆరు ఈఎంఐలు కంపెనీనే చెల్లిస్తుంది

  • టైగన్‌ హైలైన్‌ ప్లస్‌ 1.0 లీటర్‌ టీఎ్‌సఐ ఆటోమేటిక్‌ మోడల్‌పై రూ.లక్ష వరకు ప్రయోజనాలు

  • 1.0 లీటర్‌ టీఎ్‌సఐ ఆటోమేటిక్‌, జీటీ ప్లస్‌ క్రోమ్‌ 1.5 లీటర్‌ టీఎ్‌సఐ డీఎ్‌సజీ మోడల్స్‌పై ఆరు నెలల ఈఎంఐ చెల్లింపు మద్దతు

  • 1.5 లీటర్‌ డీఎ్‌సజీ మోడల్‌పై అదనంగా రూ.50,000 ఎక్స్ఛేంజీ ఆఫర్‌

  • వర్టస్‌ జీటీ ప్లస్‌ క్రోమ్‌ 1.5 లీటర్‌ టీఎ్‌సఐ డీఎ్‌సజీ మోడల్‌పై రూ.30,000 ఎక్స్ఛేంజీ ఆఫర్‌తో పాటు తొలి ఆరు నెలల ఈఎంఐలను కంపెనీ భరిస్తుంది

  • జీటీ ప్లస్‌ స్పోర్ట్‌ డీఎ్‌సజీపైనా ఆరు నెలల ఈఎంఐ చెల్లింపు, రూ.30,000 ఎక్స్ఛేంజీ ప్రయోజనాలు

  • వర్టస్‌ స్పోర్ట్‌ మోడల్ప్‌పైనా రూ.80,000 ప్రయోజనాలు

ఇవీ చదవండి:

జోస్‌ అలుక్కాస్‌ ప్రచారకర్తగా దుల్కర్‌ సల్మాన్‌

ఈ ఏడాది ఐటీ నియామకాల్లో 16 శాతం వృద్ధి

Updated Date - Dec 24 , 2025 | 03:05 AM