సమ్మిళిత ఆర్థిక వృద్ధిలో మహిళలది కీలక పాత్ర
ABN , Publish Date - Mar 07 , 2025 | 06:40 AM
సమ్మిళిత ఆర్థిక వృద్ధిలో మహిళా వ్యాపార కరస్పాండెంట్ల (బీసీ)ది కీలక పాత్ర అని ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్...

ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): సమ్మిళిత ఆర్థిక వృద్ధిలో మహిళా వ్యాపార కరస్పాండెంట్ల (బీసీ)ది కీలక పాత్ర అని ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ పినాక చక్రవర్తి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణలో మంచి ప్రతిభ కనబరిచిన ఎయిర్‌టెల్ పేమెంట్ బ్యాంక్ మహిళా వ్యాపార కరస్పాండెంట్లను సన్మానించిన సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ఈ విషయం చెప్పారు. తమ బ్యాంకు మహిళా కరస్పాండెంట్లలో నూటికి 80 శాతం మంది బ్యాంకింగ్ సదుపాయలు అందుబాటులో లేని మారుమూల ప్రాంతాల్లో పని చేస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణలో తమకు 15,000 మంది వ్యాపార కరస్పాండెంట్లు ఉంటే అందులో 3,000 మంది మహిళా కరస్పాండెంట్లన్నారు. వీరి సంఖ్యను మరింత పెంచే యోచన ఉందన్నారు.
Read More Business News and Latest Telugu News