Share News

Wild Waters Sensational Offer: వైల్డ్ వాటర్స్ సంచలన ఆఫర్.. టికెట్ ధరలను దాదాపు సగానికి తగ్గించిన థీమ్ పార్క్

ABN , Publish Date - Dec 14 , 2025 | 09:47 AM

శంకర్‌పల్లిలో ఉన్న వైల్డ్ వాటర్స్ థీమ్ పార్క్ వార్షిక సంవత్సరాంత సేల్‌లో భాగంగా టికెట్ ధరలను భారీగా తగ్గిస్తూ ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది.

Wild Waters Sensational Offer: వైల్డ్ వాటర్స్ సంచలన ఆఫర్.. టికెట్ ధరలను దాదాపు సగానికి తగ్గించిన థీమ్ పార్క్
Wild Waters Sensational Offer

హైదరాబాద్, డిసెంబర్ 14: శంకర్‌పల్లిలో ఉన్న వైల్డ్ వాటర్స్ థీమ్ పార్క్ వార్షిక సంవత్సరాంత సేల్‌లో భాగంగా టికెట్ ధరలను భారీగా తగ్గిస్తూ ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. డిసెంబర్ 14, 15, 16 తేదీలలో మాత్రమే అందుబాటులో ఉండే ఈ ఆఫర్ కింద రూ.1,590 విలువైన టికెట్ ఇప్పుడు కేవలం రూ.849కి లభిస్తుంది. ఈ ఆఫర్ ద్వారా వినియోగదారులకు దాదాపు 50 శాతం ధర తగ్గింపు లభిస్తుంది. అంతేకాదు.. ఈ టికెట్ మార్చి 31, 2025 వరకు ఉపయోగించుకునే వీలు ఉంటుంది. డిసెంబర్ 11 నుంచి 16 వరకు "Book, Refer & Win" కార్యక్రమం కూడా కొనసాగుతుంది.

OFFER.jpg


టికెట్ బుక్ చేసుకున్న సందర్శకులు తమ ప్రత్యేక రిఫరల్ లింక్‌ను షేర్ చేయడం ద్వారా ఆకర్షణీయ బహుమతులను గెలుచుకునే అవకాశం ఉంది. శంకర్‌పల్లిలోని 30 ఎకరాల విస్తీర్ణంలో విభిన్నమైన 50కి పైగా వాటర్, డ్రై రైడ్స్ కలిగిన వైల్డ్ వాటర్స్ తెలంగాణ టూరిజం నుంచి 2015, 2016, 2017, 2021లో ‘బెస్ట్ థీమ్ రిసార్ట్’ అవార్డులు.. 2025లో ‘బెస్ట్ థీమ్ పార్క్’ అవార్డు అందుకుంది. సురక్షితమైన వినోదాన్ని అందించడంలోనూ, నాణ్యమైన ఆహార ఎంపికలతో కూడిన ఫుడ్ కోర్ట్‌లోనూ ఈ పార్క్ ప్రత్యేకంగా నిలుస్తోంది.

వైల్డ్ వాటర్స్ మేనేజింగ్ డైరెక్టర్ మాట్లాడుతూ.. ‘ఈ సంవత్సరాంతం మా సందర్శకులకు కృతజ్ఞతగా.. సెలవు సీజన్‌ ఉత్సాహాన్ని భాగస్వాయ్యం చేయడానికి ఈ ఆఫర్‌ను అందించాం. కుటుంబసభ్యులు, స్నేహితులు కలిసి ఆనందకరమైన అనుభవాలను పొందే అవకాశమిది’ అని అన్నారు.


ఇవి కూడా చదవండి

అక్కడ.. క్లబ్‌లో భజనలు చేస్తారు!

గుడివాడలో భారీ అగ్ని ప్రమాదం.. షాపింగ్ కాంప్లెక్స్‌లో ఎగసిపడుతున్న మంటలు..

Updated Date - Dec 14 , 2025 | 12:24 PM