Pneumococcal Conjugate Nubevax 14: బయోలాజికల్ ఇ వ్యాక్సిన్‌కు ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తింపు
ABN , Publish Date - Nov 21 , 2025 | 05:51 AM
హైదరాబాద్‌కు చెందిన బయోలాజికల్-ఇ తయారుచేసిన న్యూమోకోకల్ కాంజుగేట్ వ్యాక్సిన్ (పీసీవీ) న్యూబెవాక్స్ 14కి (బీఈ-పీసీవీ-14) ప్రపంచ ఆరో గ్య సంస్థ గుర్తింపు లభించింది...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): హైదరాబాద్‌కు చెందిన బయోలాజికల్-ఇ తయారుచేసిన న్యూమోకోకల్ కాంజుగేట్ వ్యాక్సిన్ (పీసీవీ) న్యూబెవాక్స్ 14కి (బీఈ-పీసీవీ-14) ప్రపంచ ఆరో గ్య సంస్థ గుర్తింపు లభించింది. డబ్ల్యూహెచ్‌ఓ నుంచి బీఈ ప్రీ క్వాలిఫికేషన్ సాధించిన 11వ వ్యాక్సిన్ ఇది. 14 రకాల స్ర్టెప్టోకోకస్ న్యుమోనియా, మెదడువాపు, సెప్సిస్ వ్యాధుల నుంచి న్యూబెవాక్స్ రక్షణ కల్పిస్తుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఆరు వారాల వయసు గల పిల్లలకు దీన్ని వేయవచ్చు. ఈ గుర్తింపుతో ప్రపంచ దేశాలకు అత్యున్నత నాణ్యత గల పీసీవీ వ్యాక్సిన్లను సరఫరా చేసే అవకాశం తమకు కలిగిందని బయోలాజికల్-ఇ ఎండీ మహిమ దాట్ల అన్నారు.
కుప్పం ప్రజలకు అండగా ఉంటాం: నారా భువనేశ్వరి
కోర్టుకు హాజరైన కేంద్ర మంత్రి బండి సంజయ్
Read Latest AP News And Telugu News