అదానీ నివేదికపై కట్టుబడి ఉన్నాం..
ABN , Publish Date - Feb 05 , 2025 | 06:02 AM
భారత్‌లో రెండో అతిపెద్ద ధనవంతుడు గౌతమ్ అదానీకి చెందిన అదానీ గ్రూప్‌పై చేసిన ఆరోపణలు సహా తాము విడుదల చేసిన అన్ని నివేదికలకూ ఇప్పటికీ కట్టుబడి ఉన్నామని అమెరికన్ మార్కెట్ రీసెర్చ్, షార్ట్ సెల్లింగ్ కంపెనీ హిండెన్‌బర్గ్ రీసెర్చ్...
సంస్థ మూసివేతలో ఎవరి బలవంతం లేదు..
హిండెన్‌బర్గ్ వ్యవస్థాపకులు నాథన్ ఆండర్సన్
న్యూఢిల్లీ: భారత్‌లో రెండో అతిపెద్ద ధనవంతుడు గౌతమ్ అదానీకి చెందిన అదానీ గ్రూప్‌పై చేసిన ఆరోపణలు సహా తాము విడుదల చేసిన అన్ని నివేదికలకూ ఇప్పటికీ కట్టుబడి ఉన్నామని అమెరికన్ మార్కెట్ రీసెర్చ్, షార్ట్ సెల్లింగ్ కంపెనీ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ వ్యవస్థాపకులు నాథన్ ఆండర్సన్ అన్నారు. అదానీ గ్రూప్ కంపెనీల అక్రమాలకు సంబంధించి మీడియాలో పలు కథనాలు వచ్చిన నేపథ్యంలోనే తామూ దర్యాప్తు ప్రారంభించామన్నారు. మీడియా కథనాల్లో ప్రస్తావించిన అవకతవకలపై ఆధారాల కోసం అన్వేషించామన్నారు. కానీ, హిండెన్‌బర్గ్ రీసెర్చ్‌ను మూసివేస్తున్నట్లు నాథన్ ఆండర్సన్ ఈ ఏడాది జనవరిలో ప్రకటించి అందరినీ విస్మయపరిచారు. బలమైన ఒత్తిళ్ల వల్లే ఆయన దుకాణం కట్టేశారన్న ఊహాగానాలు గుప్పుమన్నాయి. అయితే, తమను ఎవరూ బెదిరించలేదని.. కేవలం పనిభారం వల్లే ఆ నిర్ణయం తీసుకున్నట్లు పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన స్పష్టం చేశారు.
‘‘అదేమైనా సాఫ్ట్‌వేర్ అప్లికేషన్ లేదా వస్తు తయారీ అయితే దాన్ని ఇతరులకు విక్రయించవచ్చు. కానీ, నా పని మార్కెట్ పరిశోధన. దాన్ని ఇతరులకు అప్పగించలేను కదా. అందుకే సంస్థను మూసివేయాల్సి వచ్చింది. అయితే, నాతో పనిచేసిన బృందం కొత్త సంస్థను ప్రారంభిస్తే గనుక వారికి అవసరమైన మద్దతును సంతోషంగా అందిస్తా’’నని ఆండర్సన్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి:
Ratan Tata: రతన్ టాటా యంగ్ ఫ్రెండ్ శంతను నాయుడికి టాటా మోటార్స్‌లో కీలక పదవి
8th Pay Commission: ప్యూన్ నుంచి ఆఫీసర్ జీతాలు ఎలా పెరుగుతాయంటే.. నెలకు లక్షకుపైగా
Bank Holidays: ఫిబ్రవరి 2025లో బ్యాంకు సెలవులు ఎన్ని రోజులంటే.. పూర్తి జాబితా..
RBI Report: దేశంలో క్రెడిట్, డెబిట్ కార్డులు ఎన్ని ఉన్నాయంటే.. వీటి వాడకంలో
IRCTC: తక్కువ ధరలకే కుంభమేళా టూర్ ప్యాకేజీ.. ఇలా బుక్ చేసుకోండి మరి..
Read More Business News and Latest Telugu News