60 సంవత్సరాల్లో 55 02 284 శాతం
ABN , Publish Date - May 06 , 2025 | 05:04 AM
ప్రపంచ ప్రఖ్యాత స్టాక్ ఇన్వెస్టర్, బెర్క్‌షైర్ హ్యాత్‌వే చైర్మన్, సీఈఓ వారెన్ బఫెట్ ఎట్టకేలకు తన వారసుడిని ప్రకటించారు. ఈ ఏడాది చివరి నాటికి కంపెనీ సారథ్య బాధ్యతలను ప్రస్తుత వైస్ చైర్మన్ గ్రెగ్ అబెల్ చేతుల్లో...
బఫెట్ సారథ్యంలో బెర్క్‌షైర్ హ్యత్‌వే స్టాక్ అందించిన రాబడి
సీఈఓ పదవికి బఫెట్ గుడ్‌బై
గ్రెగ్ అబెల్‌కు కంపెనీ పగ్గాలు
ఒమాహా (అమెరికా): ప్రపంచ ప్రఖ్యాత స్టాక్ ఇన్వెస్టర్, బెర్క్‌షైర్ హ్యాత్‌వే చైర్మన్, సీఈఓ వారెన్ బఫెట్ ఎట్టకేలకు తన వారసుడిని ప్రకటించారు. ఈ ఏడాది చివరి నాటికి కంపెనీ సారథ్య బాధ్యతలను ప్రస్తుత వైస్ చైర్మన్ గ్రెగ్ అబెల్ చేతుల్లో పెట్టాలనుకుంటున్నట్లు గత శనివారం జరిగిన వాటాదారుల వార్షిక సమావేశం చివర్లో ప్రకటించారు. బఫెట్ సీఈఓ పదవి నుంచి తప్పుకోనున్నప్పటికీ కంపెనీ చైర్మన్‌గా మాత్రం కొనసాగుతారు. బఫెట్ నేతృత్వంలో బెర్క్‌షైర్ జైత్రయాత్ర సాగిందిలా..
94 ఏళ్ల బఫెట్.. గత 6 దశాబ్దాలుగా (1964-2024) బెర్క్‌షైర్ హ్యాత్‌వేకు సారథ్యం వహిస్తున్నారు. ఈ 60 వసంతాల్లో బెర్క్‌షైర్ హ్యాత్‌వేను ఓ విఫల టెక్స్‌టైల్ కంపెనీ నుంచి దాదాపు 180 వ్యాపారాల అతిపెద్ద సామ్రాజ్యంగా తీర్చిదిద్దారు. 1.2 లక్షల కోట్ల డాలర్ల (రూ.101 లక్షల కోట్లు) మార్కెట్ క్యాప్‌తో ప్రపంచంలోని అత్యంత విలువైన కంపెనీల్లో ఒకటిగా నిలబెట్టారు.
గడిచిన అరవై ఏళ్లలో కంపెనీ స్టాక్ 55,02,284 శాతం రిటర్నులు పంచింది. అదే సమయంలో అమెరికన్ ఈక్విటీ ఇండెక్స్ ‘ఎస్ అండ్ పీ 500’ పంచిన రిటర్నులు 39,054 శాతమే. ఈ ఆరు దశాబ్దాల్లో బెర్క్‌షైర్ హ్యాత్‌వే షేరు విలువ ఏటేటా 19.9 శాతం చొప్పున వృద్ధి (సీఏజీఆర్) చెందుతూ వచ్చింది. ఎస్ అండ్ పీ 500 ఇండెక్స్ 10.4 శాతం సీఏజీఆర్‌తో పోలిస్తే ఇది దాదాపు రెట్టింపు.
ప్రపంచంలోని అత్యంత విలువైన లిస్టెడ్ కంపెనీల జాబితాలో బెర్క్‌షైర్ ప్రస్తుతం 8వ స్థానంలో ఉంది.
బెర్క్‌షైర్ గ్రూప్ వ్యాపారాల వార్షిక ఆదాయం దాదాపు 40,000 కోట్ల డాలర్ల (రూ.33.72 లక్షల కోట్లు) స్థాయికి చేరుకుంది.
ఈ మార్చి 31 నాటికి కంపెనీ వద్ద ఉన్న నగదు నిల్వలు 34,770 కోట్ల డాలర్లకు (రూ.29.31 లక్షల కోట్ల పైమాటే) పెరిగాయి. అంతేకాదు, ప్రస్తుతం చలామణిలో ఉన్న యూఎస్ ట్రెజరీ బిల్లుల్లో 5 శాతం కంపెనీ చేతుల్లో ఉన్నాయి.
గత ఏడాది చివరినాటికి కంపెనీలో 3.92 లక్షలకు పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
పెరిగిన ఏటీఎమ్ విత్‌డ్రా చార్జీలు.. నేటి నుంచి కొత్త రూల్స్
ఇప్పటికీ జనాల వద్ద రూ.2 వేల నోట్లు.. ఆర్బీఐ తాజా అప్‌డేట్ ఏంటంటే..
వాణిజ్యాన్ని ఆయుధంగా వాడొద్దన్న వారెన్ బఫెట్
Read More Business News and Latest Telugu News