కొనసాగిన యుద్ధ భయాలు
ABN , Publish Date - Jun 24 , 2025 | 04:15 AM
ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధంలో అమెరికా కూడా జోక్యం చేసుకోవడంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత తీవ్రతరమయ్యాయి. ఇరాన్‌కు చెందిన మూడు కీలక అణు కేంద్రాలపై...
సెన్సెక్స్ 511 పాయింట్లు పతనం
మళ్లీ 25,000 దిగువ స్థాయికి నిఫ్టీ
ముంబై: ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య యుద్ధంలో అమెరికా కూడా జోక్యం చేసుకోవడంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత తీవ్రతరమయ్యాయి. ఇరాన్‌కు చెందిన మూడు కీలక అణు కేంద్రాలపై అమెరికా బాంబు దాడుల నేపథ్యంలో స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం భారీ నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ ఒక దశలో 931 పాయింట్లకు పైగా పతనమై 81,476 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని నమోదు చేసింది. చివరికి 511.38 పాయింట్ల నష్టంతో 81,896.79 వద్ద స్థిరపడింది. నిఫ్టీ మళ్లీ 25,000 స్థాయినికి కోల్పోయింది. 140.50 పాయింట్లు క్షీణించి 24,971.90 వద్ద ముగిసింది. ఐటీ, టెక్నాలజీ, ఆటో స్టాక్స్‌లో ఇన్వెస్టర్లు అమ్మకాలకు పాల్పడటం ఇందుకు కారణం. ముడిచమురు ధరలు మళ్లీ ఎగబాకిన నేపథ్యంలో ఇంధ నం, ఎయిర్‌లైన్స్, పెయింట్స్ కంపెనీల షేర్లలోనూ ఉదయం అమ్మకాలు పెరిగినప్పటికీ, సెషన్ చివరికల్లా మళ్లీ కోలుకోగలిగాయి. సెన్సెక్స్‌లోని 30 కంపెనీల్లో 21 నష్టపోయాయి. ఇన్ఫోసిస్ షేరు 2.29 శాతం క్షీణించి సూచీ టాప్ లూజర్‌గా మిగిలింది. ఎల్ అండ్ టీ, హెచ్‌సీఎల్ టెక్ కూడా రెండు శాతానికి పైగా తగ్గాయి.
డాలర్‌తో రూపాయి మారకం విలువ 23 పైసలు క్షీణించి రూ.86.78 వద్ద ముగిసింది.
అంతర్జాతీయ విపణిలో బ్యారెల్ బ్రెంట్ క్రూడాయిల్ ధర ఒక దశలో 0.49 శాతం పెరిగి 77.39 డాలర్ల స్థాయిలో ట్రేడైంది.
ఇవీ చదవండి:
ఇరాన్‌లో ఉద్రిక్తతలు.. ముడి చమురు ధరలకు రెక్కలు
సేవింగ్స్ అకౌంట్‌లో మీ డబ్బు ఉందా.. అయితే మీరీ విషయాలు తప్పక తెలుసుకోవాలి
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి