Vodafone Idea Relief Package: వొడాఫోన్ ఐడియాకు భారీ ఊరట ప్యాకేజీ
ABN , Publish Date - Nov 12 , 2025 | 04:56 AM
లక్షల కోట్ల అప్పులు, వేల కోట్ల నష్టాలతో సతమతం అవుతున్న ప్రైవేట్ టెలికాం కంపెనీ వొడాఫోన్ ఐడియాకు త్వరలో భారీ ఊరట లభించే అవకాశం కనిపిస్తోంది. ఏజీఆర్ బకాయిలపై సుప్రీంకోర్టు తాజా...
న్యూఢిల్లీ: లక్షల కోట్ల అప్పులు, వేల కోట్ల నష్టాలతో సతమతం అవుతున్న ప్రైవేట్ టెలికాం కంపెనీ వొడాఫోన్ ఐడియాకు త్వరలో భారీ ఊరట లభించే అవకాశం కనిపిస్తోంది. ఏజీఆర్ బకాయిలపై సుప్రీంకోర్టు తాజా తీర్పు నేపథ్యంలో కంపెనీ కోసం కేంద్ర ప్రభుత్వం ఊరట ప్యాకేజీ రూపకల్పనను ప్రారంభించినట్లు తెలిసింది. సవరించిన ఏజీఆర్ బకాయిలతోపాటు వడ్డీ, పెనాల్టీపైనా మినహాయింపులతో కలిపి సమగ్ర ప్యాకేజీని ప్రకటించే అవకాశాలున్నట్లు సమాచారం. ఈ మార్చి చివరినాటికి వొడాఫోన్ ఐడియా ఏజీఆర్ బకాయిలు రూ.83,400 కోట్లకు పెరిగాయి. కాగా, ఈ సెప్టెంబరు త్రైమాసికంలో కంపెనీ నష్టం 19 క్వార్టర్ల కనిష్ఠ స్థాయి రూ.5,524 కోట్లకు తగ్గింది. ఆదాయం రూ.11,195 కోట్లకు చేరింది. ఒక్కో వినియోగదారు నుంచి సగటు ఆదాయం (ఆర్పూ) కూడా 8.7 శాతం వృద్ధితో రూ.180కి పెరిగింది. ఈ సెప్టెంబరు చివరినాటికి కంపెనీ మొత్తం రుణభారం రూ.2,02,951 కోట్లుగా నమోదైంది. కంపెనీ ఆర్థిక పనితీరు మెరుగుపడటంతోపాటు రిలీఫ్ ప్యాకేజీపై అంచనాలతో మంగళవారం వొడాఫోన్ ఐడియా షేరు 7.68ు పెరిగి రూ.10.24కు చేరింది.
ఇవి కూడా చదవండి:
పసిడి ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు..
లాభాలతో ప్రారంభమై నష్టాల్లోకి.. ఈ రోజు టాప్ ఫైవ్ స్టాక్స్ ఇవే..