Share News

రుణాల కోసం వొడాఫోన్‌ ఐడియా మంతనాలు

ABN , Publish Date - Jun 26 , 2025 | 05:27 AM

ఆర్థిక కష్టాల్లో ఉన్న వొడాఫోన్‌ ఐడియా మార్కెట్లో పోటీని తట్టుకునేందుకు వీలుగా నెట్‌వర్క్‌ విస్తరణ కోసం రూ.25,000 కోట్ల రుణ సమీకరణకు బ్యాంకులతో మంతనాలు...

రుణాల కోసం వొడాఫోన్‌ ఐడియా మంతనాలు

న్యూఢిల్లీ: ఆర్థిక కష్టాల్లో ఉన్న వొడాఫోన్‌ ఐడియా మార్కెట్లో పోటీని తట్టుకునేందుకు వీలుగా నెట్‌వర్క్‌ విస్తరణ కోసం రూ.25,000 కోట్ల రుణ సమీకరణకు బ్యాంకులతో మంతనాలు జరుపుతోంది. ఈ కన్సార్షియంకు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నాయకత్వం వహించవచ్చునని ఈ వ్యవహారంతో అనుబంధం గల ఒకరు తెలిపారు. కుమారమంగళం బిర్లా నాయకత్వంలోని ఈ కంపెనీ గతంలో ఒకసారి ఈ ప్రయత్నం చేసి వెనుకడుగేసింది. అయితే టెలికాం కంపెనీల బకాయిల విషయంలో కొంత వెసులుబాటు కల్పించేందుకు ప్రభుత్వం ఆలోచిస్తున్నదన్న వార్తల నేపథ్యంలో తాజా ప్రయత్నాలు ప్రారంభమైనట్టు చెబుతున్నారు.

ఇవీ చదవండి:

1600 కోట్ల పాస్‌వర్డ్‌లు ఆన్‌లైన్‌లో లీక్.. హెచ్చరించిన గూగుల్

ఈ యాప్ 20 లక్షల పోయిన ఫోన్‌లను గుర్తించింది.. ఎలాగంటే..

మరిన్ని ఏపీ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 26 , 2025 | 05:27 AM