Share News

Vintage Coffee: వింటేజ్‌ కాఫీ రూ.215 కోట్ల సమీకరణ

ABN , Publish Date - Jul 08 , 2025 | 03:52 AM

ప్రిఫరెన్షియల్‌ పద్ధతిలో ఈక్విటీ షేర్లు, కన్వర్టబుల్‌ వారంట్ల జారీ ద్వారా రూ.215.76 కోట్ల సమీకరణకు బోర్డు సభ్యుల నుంచి ఆమోదం లభించిందని హైదరాబాద్‌కు చెందిన వింటేజ్‌ కాఫీ అండ్‌ బెవరేజెస్‌ లిమిటెడ్‌ వీసీబీఎల్‌ సోమవారం వెల్లడించింది.

Vintage Coffee: వింటేజ్‌ కాఫీ రూ.215 కోట్ల సమీకరణ

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): ప్రిఫరెన్షియల్‌ పద్ధతిలో ఈక్విటీ షేర్లు, కన్వర్టబుల్‌ వారంట్ల జారీ ద్వారా రూ.215.76 కోట్ల సమీకరణకు బోర్డు సభ్యుల నుంచి ఆమోదం లభించిందని హైదరాబాద్‌కు చెందిన వింటేజ్‌ కాఫీ అండ్‌ బెవరేజెస్‌ లిమిటెడ్‌ (వీసీబీఎల్‌) సోమవారం వెల్లడించింది. అయితే, ఈ ఇష్యూకు షేర్‌హోల్డర్లతో పాటు ఇతర అనుమతులు ఇంకా రావాల్సి ఉందని కంపెనీ స్పష్టం చేసింది. ఈ ఇష్యూ ద్వారా సమీకరించనున్న నిధులను 5,000 ఎంటీపీఏ సామర్థ్యంతో ఫ్రీజ్‌ డ్రైడ్‌ కాఫీ ప్లాంట్‌ ఏర్పాటుకు ఉపయోగించనున్నట్లు తెలిపింది. అంతేకాకుండా ప్రీమియం కాఫీ విభాగంలో మెరుగైన మార్కెట్‌ వాటాను దక్కించుకునేందుకు ఇది దోహదపడుతుందని పేర్కొంది. కాగా, కంపెనీకి చెందిన స్ర్పే డ్రైడ్‌ అండ్‌ అగ్లోమెరాటెడ్‌ కాఫీ ఉత్పత్తి సామర్థ్యం ప్రస్తుతమున్న 6,500 ఎంటీపీఏ నుంచి 2026 మార్చి చివరికల్లా 11,000 ఎంటీపీఏకు పెరగవచ్చని వీసీబీఎల్‌ అంచనా వేస్తోంది.

Updated Date - Jul 08 , 2025 | 03:54 AM