Share News

VinFast India: హైదరాబాద్‌ మార్కెట్లోకి విన్‌ఫాస్ట్

ABN , Publish Date - Sep 13 , 2025 | 03:16 AM

వియత్నాం కేంద్రంగా ఉన్న విన్‌గ్రూ్‌ప జేఎ్‌ససీ ఎలక్ట్రిక్‌ వాహన సంస్థ విన్‌ఫా్‌స్ట ఇండియా.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ మార్కెట్లలోకి అడుగుపెట్టింది. ఇందులో భాగంగా హైదరాబాద్‌లో తొలి...

VinFast India: హైదరాబాద్‌ మార్కెట్లోకి విన్‌ఫాస్ట్

వీఎఫ్‌6, వీఎఫ్‌7 ఎలక్ట్రిక్‌ కార్లు విడుదల

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): వియత్నాం కేంద్రంగా ఉన్న విన్‌గ్రూ్‌ప జేఎ్‌ససీ ఎలక్ట్రిక్‌ వాహన సంస్థ విన్‌ఫా్‌స్ట ఇండియా.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ మార్కెట్లలోకి అడుగుపెట్టింది. ఇందులో భాగంగా హైదరాబాద్‌లో తొలి షోరూమ్‌ను ప్రారంభించింది. శుక్రవారం నాడిక్కడ కంపెనీ డిప్యూటీ సీఈఓ అరుణోదయ్‌ దాస్‌.. గచ్చిబౌలి, బేగంపేటల్లో నానేష్‌ ఆటోమోటివ్స్‌ ఏర్పాటు చేసిన షోరూమ్స్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మార్కెట్లోకి విన్‌ఫా్‌స్ట ప్రీమియం ఎలక్ట్రిక్‌ కార్లు వీఎఫ్‌6, వీఎఫ్‌7 విడుదల చేశారు. వినియోగదారుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని 10 ఏళ్ల బ్యాటరీ వారంటీతో ఈ కార్లను తీసుకు వచ్చినట్లు ఆయన చెప్పారు. కాగా, వీఎఫ్‌6 ప్రారంభ ధర రూ.16.49 లక్షలు, వీఎఫ్‌7 ప్రారంభ ధర రూ.20.89 (ఎక్స్‌షోరూమ్‌)గా నిర్ణయించినట్లు దాస్‌ తెలిపారు. ఈ ఏడాది చివరి నాటికి దేశవ్యాప్తంగా 27కి పైగా నగరాల్లో 35 డీలర్‌షిప్స్‌, 26 వర్క్‌షా్‌ప్సను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. కాగా హైదరాబాద్‌ మార్కెట్లో ఇప్పటికే 150కి పైగా కార్లకు బుకింగ్స్‌ వచ్చాయని, ఈ నెల 22 నుంచి వీటి డెలివరీలను ప్రారంభించనున్నట్లు నానేష్‌ ఆటో డైరెక్టర్‌ అక్షయ్‌ జైన్‌ తెలిపారు.

ఈ వార్తలు కూడా చదవండి..

భాగ్యనగర వాసులకు బిగ్ అలర్ట్.. మూసీ పరివాహక ప్రాంతాల్లో రెడ్ అలర్ట్

లాకర్‌ తాళాల కోసం చిత్ర హింసలు పెట్టి..

Read Latest Telangana News and National News

Updated Date - Sep 13 , 2025 | 03:16 AM