Venu Srinivasan Reappointed as Trustee: టాటా ట్రస్ట్స్ ట్రస్టీగా వేణు శ్రీనివాసన్
ABN , Publish Date - Oct 22 , 2025 | 01:55 AM
టీవీఎస్ గ్రూప్ గౌరవ చైర్మన్ వేణు శ్రీనివాసన్.. టాటా ట్రస్ట్స్ జీవితకాల ట్రస్టీగా పునర్నియమితుయారు. ఈ నెల 17న జరిగిన సమావేశంలో టాటా ట్రస్ట్స్ దీనికి...
మెహ్లీ మిస్త్రీ పునర్నియామకంపై సస్పెన్స్
న్యూఢిల్లీ: టీవీఎస్ గ్రూప్ గౌరవ చైర్మన్ వేణు శ్రీనివాసన్.. టాటా ట్రస్ట్స్ జీవితకాల ట్రస్టీగా పునర్నియమితుయారు. ఈ నెల 17న జరిగిన సమావేశంలో టాటా ట్రస్ట్స్ దీనికి సంబంధించిన తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించినట్టు సమాచారం. గురువారంతో శ్రీనివాసన్ పదవీకాలం ముగుస్తుంది. టాటా ట్రస్ట్స్ ఈ లోపే ఆయన్ని మళ్లీ జీవిత కాలానికి ట్రస్టీగా పునర్నియమించడం విశేషం. ఇప్పుడు ఇక అందరి దృష్టీ షాపూర్జీ పల్లోంజీ గ్రూప్‌నకు ప్రాతినిధ్యం వహిస్తున్న మెహ్లీ మిస్త్రీ పునర్నియామకంపై పడింది. ఈయన పదవీ కాలం ఈ నెల 28తో ముగుస్తుంది. టాటా ట్రస్ట్స్‌లో అంతర్యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో ఈ మార్పులు చోటు చేసుకుంటున్నాయి.
ఇవి కూడా చదవండి
సీఎం నియోజకవర్గం నుంచి రసవత్తర పోటీ
విధ్వంసం సృష్టించిన సౌతాఫ్రికా.. పాక్ ముందు భారీ లక్ష్యం