Vedanta Group bid JAL: వేదాంత చేతికి జేఏఎల్
ABN , Publish Date - Sep 06 , 2025 | 02:57 AM
జైప్రకాశ్ అసోసియేట్స్ లిమిటెడ్ (జేఏఎల్) దివాలా పరిష్కార ప్రక్రియ కొలిక్కి వచ్చిన సూచనలు కనిపిస్తున్నాయి. కంపెనీ రుణ దాతల కమిటీ (సీఓసీ) శుక్రవారం నిర్వహించిన చాలెంజ్ బిడ్డింగ్‌లో...
రూ.17,000 కోట్లకు బిడ్
న్యూఢిల్లీ: జైప్రకాశ్ అసోసియేట్స్ లిమిటెడ్ (జేఏఎల్) దివాలా పరిష్కార ప్రక్రియ కొలిక్కి వచ్చిన సూచనలు కనిపిస్తున్నాయి. కంపెనీ రుణ దాతల కమిటీ (సీఓసీ) శుక్రవారం నిర్వహించిన చాలెంజ్ బిడ్డింగ్‌లో జేఏఎల్ ఆస్తులకు రూ.17,000 కోట్లు చెల్లించేందుకు అనిల్ అగర్వాల్ నేతృత్వంలోని వేదాంత గ్రూప్ బిడ్ దాఖలు చేసింది. అదానీ గ్రూప్ ఆఫర్ చేసిన రూ.12,505 కోట్ల కంటే ఇది రూ.4,495 కోట్లు ఎక్కువ. సీఓసీ ఈ బిడ్‌ను ఆమోదిస్తే జేఏఎల్ ఆస్తులు వేదాంత గ్రూప్ పరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాదాపు రూ.57,185 కోట్ల అప్పుల్లో ఉన్న జేఏఎల్.. రియల్టీ, సిమెంట్, పవర్, హోటల్స్, రహదారుల నిర్మాణ వ్యాపారాల్లో ఉంది.
ఇవి కూడా చదవండి..
ఈడీ ముందుకు శిఖర్ ధవన్.. బెట్టింగ్ యాప్ కేసులో విచారణ..
కోహ్లీ పాస్.. లండన్‌లో టెస్ట్‌కు అనుమతి ఇవ్వడంపై ఫ్యాన్స్ ఆగ్రహం..
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..