Large Mid Small Cap Funds: యూనియన్ ఎంఎఫ్ నుంచి కొత్త ఫండ్
ABN , Publish Date - Aug 13 , 2025 | 01:23 AM
యూనియన్ మ్యూచువల్ ఫండ్ (ఎంఎఫ్) మరో సరికొత్త పథకాన్ని ప్రారంభిస్తోంది. ‘యూనియన్ డైవర్సిఫైడ్ ఈక్విటీ ఆల్ క్యాప్ ఎఫ్‌ఓఎఫ్’ పేరుతో ప్రారంభిస్తున్న...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): యూనియన్ మ్యూచువల్ ఫండ్ (ఎంఎఫ్) మరో సరికొత్త పథకాన్ని ప్రారంభిస్తోంది. ‘యూనియన్ డైవర్సిఫైడ్ ఈక్విటీ ఆల్ క్యాప్ ఎఫ్‌ఓఎఫ్’ పేరుతో ప్రారంభిస్తున్న ఈ పథకం సబ్‌స్ర్కిప్షన్ వచ్చే నెల 1 నుంచి 15 వరకు అందుబాటులో ఉంటుంది. ఈ పథకం ద్వారా సమీకరించే నిధుల్లో 80 నుంచి 90 శాతాన్ని లార్జ్, మిడ్, స్మాల్ క్యాప్ ఈక్విటీ పథకాల్లో మదుపు చేయబోతున్నట్టు యూనియన్ అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ ఎండీ, సీఈఓ మధు నాయర్ చెప్పారు. దేశంలో ఒక మ్యూచువల్ ఫండ్ సంస్థ ఫండ్ ఆఫ్ ఫండ్స్ (ఎఫ్‌ఓపీ)లో ఈ తరహా పథకాన్ని ప్రవేశపెట్టడం ఇదే మొదటిసారన్నారు. ఈ పథకంలో పెట్టే పెట్టుబడులను రెండేళ్లకు పైగా ఉంచుకుంటే వచ్చే లాభాలకు దీర్ఘకాలిక మూలధన లాభాల (ఎల్‌టీసీజీ) కింద 12.5 శాతం మాత్రమే పన్ను వర్తిస్తుందన్నారు.
ఇవి కూడా చదవండి
ఈ తేదీకి ముందే ఐటీఆర్ దాఖలు చేయండి… ఆలస్య రుసుమును తప్పించుకోండి
రైల్వే టిక్కెట్లపై 20% తగ్గింపు ఆఫర్.. ఈ అవకాశాన్ని వినియోగించుకోండి
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి