Union Bank of India: యూబీఐ లాభం రూ.4,116 కోట్లు
ABN , Publish Date - Jul 20 , 2025 | 03:45 AM
జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో ప్రభుత్వ రంగానికి చెందిన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ) రూ.4,116 కోట్ల నికర లాభం ప్రకటించింది....
జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో ప్రభుత్వ రంగానికి చెందిన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ) రూ.4,116 కోట్ల నికర లాభం ప్రకటించింది. గత ఏడాదిలో ఇదే కాలానికి నమోదైన రూ.3,679 కోట్ల లాభంతో పోలిస్తే 12 శాతం వృద్ధి కనబరిచింది. యూబీఐ మొత్తం ఆదాయంం రూ.30,874 కోట్ల నుంచి రూ.31,791 కోట్లకు పెరిగింది. గడిచిన మూడు నెలల్లో బ్యాంక్ మొత్తం వడ్డీ ఆదాయం రూ.27,296 కోట్లకు పెరిగినప్పటికీ, నికర వడ్డీ రాబడి (ఎన్‌ఐఐ) మాత్రం రూ.9,113 కోట్లకు తగ్గింది. జూన్ చివరి నాటికి బ్యాంక్ మొత్తం వ్యాపారం 5 శాతం పెరిగి రూ.22,14,422 కోట్లకు చేరుకుంది.
ఈ వార్తలు కూడా చదవండి..
ప్రభుత్వ బడుల్లో నో వేకెన్సీ పరిస్థితి తేవాలి
Read latest AP News And Telugu News