ట్రంప్ సుంకాలతో ఫార్మాలో అనిశ్చితి
ABN , Publish Date - Mar 14 , 2025 | 04:13 AM
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల హెచ్చరికలతో భారత ఫార్మా కంపెనీలూ బెదిరిపోతున్నాయి. ఈ హెచ్చరికలతో ఫార్మా రంగంలో ప్రస్తుతం ఔనన్నా కాదన్నా అనిశ్చితి...

అరబిందో ఫార్మా సీఎ్‌ఫఓ సంతానం సుబ్రమణియన్
హైదరాబాద్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల హెచ్చరికలతో భారత ఫార్మా కంపెనీలూ బెదిరిపోతున్నాయి. ఈ హెచ్చరికలతో ఫార్మా రంగంలో ప్రస్తుతం ఔనన్నా కాదన్నా అనిశ్చితి నెలకొందని అరబిందో ఫార్మా సీఎ్‌ఫఓ సంతానం సుబ్రమణియన్ ‘ఈటీ నౌ’ బిజినెస్ న్యూస్ టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. అయితే అమెరికాతో పాటు ఇతర దేశాల మార్కెట్లపైనా దృష్టి పెడుతున్నందున ఈ ప్రభావం తమ కంపెనీపై పెద్దగా ఉండకపోవచ్చన్నారు. తమ ఎగుమతుల్లోని టాప్ 10 ఔషధాల్లో అమెరికా వాటా 20 శాతానికి మించిలేదన్నారు. కాబట్టి ట్రంప్ సర్కార్ సుంకాలు పెంచినా ఆ ప్రభావం తమపై పెద్దగా ఉండక పోవచ్చన్నారు.
వృద్ధి ఒక్కటే లక్ష్యం కాదు: వృద్ధి ఒక్కటే తమ కంపెనీ లక్ష్యం కాదని సంతానం స్పష్టం చేశారు. వృద్ధితో పాటు సుస్థిర లాభాలు, టర్నోవర్‌పైనా ప్రత్యేక దృష్టి పెడుతున్నట్టు తెలిపారు. వ్యాపార విస్తరణ కోసం ఇంజెక్టబుల్స్, పెప్టైడ్స్, బయోసిమిలర్స్‌పైనా దృష్టి పెట్టినట్టు చెప్పారు. వచ్చే ఆర్థిక సంవత్సరం (2025-26) రెండో త్రైమాసికంలోగా బయోసిమిలర్ ప్లాంటులో ఉత్పత్తి ప్రారంభమవుతుందని సంతానం చెప్పారు.
ఇవి కూడా చదవండి:
Gold Silver Rates Today: హోలీకి ముందే షాక్.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు
Recharge Offer: నెలకు రూ. 99కే రీఛార్జ్ ప్లాన్.. జియో, ఎయిర్‌టెల్‌కు గట్టి సవాల్
BSNL Offers: రూ. 200 బడ్జెట్‌లోపు బెస్ట్ రీఛార్జ్ పాన్లు.. ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయంటే..
Read More Business News and Latest Telugu News