Hyderabad Business News: హైదరాబాద్‌లో మరో రెండు అంతర్జాతీయ సంస్థల కార్యాలయాలు
ABN , Publish Date - Nov 21 , 2025 | 05:45 AM
మరో రెండు అంతర్జాతీయ సంస్థలు హైదరాబాద్‌లో తమ కార్యాలయాలు నెలకొల్పాయి. వాటిలో సొనోకో ప్రోడక్ట్స్ , ఈబీజీ గ్రూప్ ఉన్నాయి...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): మరో రెండు అంతర్జాతీయ సంస్థలు హైదరాబాద్‌లో తమ కార్యాలయాలు నెలకొల్పాయి. వాటిలో సొనోకో ప్రోడక్ట్స్ , ఈబీజీ గ్రూప్ ఉన్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో అత్యాధునిక ఐటీ పెర్ఫార్మెన్స్ హబ్‌ను ప్రారంభించిన సొనోకో ఇప్పుడు శాశ్వత భవనంలోకి మారింది. హైదరాబాద్‌లో ఫైనాన్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈ) ఏర్పాటు చేయనున్నట్టు కూడా కంపెనీ వైస్ ప్రెసిడెంట్, చీఫ్ ఇన్ఫర్మేషన్ అధికారి రాజీవ్ అంకిరెడ్డిపల్లి ప్రకటించారు.
వెల్‌నెస్, మొబిలిటీ, టెక్నాలజీ, రియల్టీ, లైఫ్‌స్టైల్ రంగాల్లో కార్యకలాపాలు సాగిస్తున్న ఈబీజీ గ్రూప్ హైదరాబాద్‌లోని డల్లాస్ సెంటర్‌లో ఈబీజీ పవర్‌హౌస్‌ను ప్రారంభించింది. రాబోయే రెండేళ్ల కాలంలో ఈ సెంటర్‌పై 70 లక్షల డాలర్లు (రూ.6,160 కోట్లు) పెట్టుబడి పెట్టనున్నట్టు కంపెనీ తెలిపింది.
ఇవీ చదవండి:
హిడ్మా ఎన్‌కౌంటర్.. ప్రొ.హరగోపాల్ కీలక వ్యాఖ్యలు
అందుకే మారేడుమిల్లికి వచ్చిన మావోయిస్టులు.. జిల్లా ఎస్పీ