MF Launches Multi Cap Fund : నయా ఫండ్స్
ABN , Publish Date - Jul 06 , 2025 | 02:38 AM
ట్రస్ట్ ఎంఎఫ్ మల్టీ క్యాప్ ఫండ్, యాక్సిస్ సర్వీసెస్ ఆపర్చునిటీస్ ఫండ్, ఇన్వెస్కో ఇన్‌కమ్ ప్లస్ ఆర్బిట్రేజ్ ఫండ్, బజాజ్ అలియాంజ్ నిఫ్టీ మల్టీఫ్యాక్టర్ ఫండ్...
ట్రస్ట్ ఎంఎఫ్ మల్టీ క్యాప్ ఫండ్
ట్రస్ట్ మ్యూచువల్ ఫండ్.. మల్టీ క్యాప్ ఫండ్‌ను ప్రారంభించింది. లార్జ్, మిడ్, స్మాల్ క్యాప్ స్టాక్స్‌లో పెట్టుబడులు పెట్టే ఓపెన్ ఎండెడ్ ఈక్విటీ పథకం ఇది. వృద్ధికి అపార అవకాశాలున్న స్టాక్స్‌ను గుర్తించి ఈ ఫండ్ పెట్టుబడులు పెడుతుంది. ఈ ఫండ్‌కు నిఫ్టీ 500 మల్టీ క్యాప్ 50ః25ః25 టీఆర్‌ఐ బెంచ్‌మార్క్ ఇండెక్స్‌గా ఉండనుంది. ఈ ఫండ్ ముగింపు తేదీ ఈ నెల 14.
యాక్సిస్ సర్వీసెస్ ఆపర్చునిటీస్ ఫండ్
యాక్సిస్ మ్యూచువల్ ఫండ్.. యాక్సిస్ సర్వీసెస్ ఆపర్చునిటీస్ ఫండ్‌ను ప్రారంభించింది. ఇది సర్వీసెస్ థీమ్ ఆధారిత ఓపెన్ ఎండెడ్ ఈక్విటీ పథకం. ఈ ఫండ్ కు నిఫ్టీ సర్వీసెస్ సెక్టార్ టీఆర్‌ఐ బెంచ్‌మార్క్‌గా ఉండనుంది. మంచి పనితీరు కనబరుస్తున్న సేవల రంగంలోని కంపెనీల్లో ఈ ఫండ్ పెట్టుబడులు పెట్టనుంది. ఈ ఫండ్ ముగింపు తేదీ ఈ నెల 18.
ఇన్వెస్కో ఇన్‌కమ్ ప్లస్ ఆర్బిట్రేజ్ ఫండ్
ఇన్వెస్కో మ్యూచువల్ ఫండ్.. ఇన్వెస్కో ఇండియా ఇన్‌కమ్ ప్లస్ ఆర్బిట్రేజ్ యాక్టివ్ ఫండ్ ఆఫ్ ఫండ్ ప్రారంభించింది. ఈక్విటీ ఆర్బిట్రేజ్, డెట్ ఆధారిత పథకాల్లో పెట్టుబడులు పెట్టే ఫండ్ ఆఫ్ ఫండ్. 60-65 శాతం పెట్టుబడులు డెట్ ఆధారిత పథకాల్లో పెట్టనుండగా 35-40 శాతం ఆర్బిట్రేజ్ ఫండ్‌లో పెడుతుంది. ఈ ఫండ్ ముగింపు తేదీ ఈ నెల 16.
బజాజ్ అలియాంజ్ నిఫ్టీ మల్టీఫ్యాక్టర్ ఫండ్
బజాజ్ అలియాంజ్ లైఫ్.. నిఫ్టీ 500 మల్టీఫ్యాక్టర్ 50 ఇండెక్స్ ఫండ్‌ను ప్రారంభించింది. యూలిప్ కస్టమర్ల కోసం ఈ కొత్త ఫండ్‌ను తీసుకువచ్చింది. ఈ ఫండ్.. పాలసీదారులకు లైఫ్ కవరేజీతో పాటు మల్టీఫ్యాక్టర్ ఆధారిత ఈక్విటీ ఇండెక్స్‌లో ఇన్వెస్ట్ చేసే అవకాశాన్ని కల్పిస్తోంది. ముగింపు తేదీ ఈ నెల 14.
ఈ వార్తలు కూడా చదవండి.
రాష్ట్రంలో.. ఇక స్మార్ట్ రేషన్ కార్డులు
కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా పీఎస్‌కు మాజీ మంత్రి
Read Latest Telangana News and National News