Shrimp Exports: ఙరొయ్యల ఎగుమతీ సమస్యే
ABN , Publish Date - Jul 31 , 2025 | 02:22 AM
ట్రంప్ సుంకాల ప్రభావం ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడుల్లోని రొయ్యల ఎగుమతులపైనా పడనుంది. మన దేశం నుంచి ఏటా 11 లక్షల టన్నుల రొయ్యలు ఎగుమతి అవుతుంటే అందులో ఎనిమిది లక్షల టన్నులు ఆంధ్రప్రదేశ్...
హైదరాబాద్/భీమవరం (ఆంధ్రజ్యోతి): ట్రంప్ సుంకాల ప్రభావం ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడుల్లోని రొయ్యల ఎగుమతులపైనా పడనుంది. మన దేశం నుంచి ఏటా 11 లక్షల టన్నుల రొయ్యలు ఎగుమతి అవుతుంటే అందులో ఎనిమిది లక్షల టన్నులు ఆంధ్రప్రదేశ్ నుంచే ఎగుమతి అవుతున్నాయి. రాష్ట్రం నుంచి ఎగుమతయ్యే రొయ్యల్లో 70 శాతం అమెరికాకే వెళ్తాయి. ట్రంప్ తాజా సుంకాలతో రైతులతో పాటు, ఇటు ఎగుమతిదారులూ తీవ్రంగా నష్టపోతారని జగదీష్ మెరైన్ ప్రొడక్ట్స్ అధినేత జగదీశ్ చెప్పారు. అమెరికాతో ద్వైపాక్షి క వాణిజ్య ఒప్పందం (బీటీఏ) కుదిరే వరకు ఈ తిప్పలు తప్పవన్నారు.
సగం వాటా రొయ్యలదే: మన దేశం నంచి ఏటా 480 కోట్ల డాలర్ల విలువైన మత్స్య ఎగుమతులు జరుగుతుంటే అందులో సగానికిపైగా వాటా రొయ్యలదే. ఇపుడు ట్రంప్ సర్కార్ మన దేశానికి చెందిన మత్స్య ఎగుమతులపైనా 25 శాతం దిగుమతి సుంకం విధించింది. దీనికి తోడు రష్యా నుంచి చమురు, ఆయుధాలు దిగుమతి చేసుకుంటే జరిమానాలూ తప్పవని ట్రంప్ ప్రకటించారు. ఇదే సమయంలో అమెరికాకు అతి సమీపంలో ఉన్న ఈక్వెడార్ నుంచి అతి తక్కువ సుంకాలతో రొయ్యలతో సహా అనేక మత్స్య దిగుమతులను అనుమతించనుంది. దీంతో భారత రొయ్యలకు అతి పెద్ద మార్కెట్ అయిన అమెరికా మార్కె ట్ దాదాపు మూసుకు పోయినట్టేనని భావిస్తున్నారు. ఈ ప్రభావం వ్యాపారులు రొయ్యల రైతులకు చెల్లించే ధరలపైనా పడుతుందని మార్కెట్ వర్గాల అంచనా.
ఇవి కూడా చదవండి
రష్యాలో భారీ భూకంపం.. జపాన్, అమెరికాలో సునామీ అలర్ట్
ఆగస్టులో 15 రోజులు బ్యాంకులకు సెలవులు.. ముందే ప్లాన్ చేసుకోండి
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి