Indian Stock Market: మార్కెట్ పైనా ట్రంప్ పిడుగు
ABN , Publish Date - Jul 31 , 2025 | 02:34 AM
అమెరికా తాజా సుంకాలు, పెనాల్టీలతో గురువారం దేశీయ స్టాక్ మార్కెట్ లాభాలకు బ్రేక్ పడే సూచనలు కనిపిస్తున్నాయి. భారత్ నుంచి వచ్చే దిగుమతులపై ఆగస్టు 1 నుంచి 25 శాతం సుంకాలు, పెనాల్టీలు విధించబోతున్నట్టు అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. దీంతో...
‘బేర్’మన్న గిఫ్ట్ నిఫ్టీ
నష్టాల్లో భారత కంపెనీల ఏడీఆర్‌లు
మూడేళ్ల కనిష్ఠానికి రూపాయి
అమెరికా తాజా సుంకాలు, పెనాల్టీలతో గురువారం దేశీయ స్టాక్ మార్కెట్ లాభాలకు బ్రేక్ పడే సూచనలు కనిపిస్తున్నాయి. భారత్ నుంచి వచ్చే దిగుమతులపై ఆగస్టు 1 నుంచి 25 శాతం సుంకాలు, పెనాల్టీలు విధించబోతున్నట్టు అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. దీంతో గురువారం నిఫ్టీ 24,700 పాయింట్ల దిగువకు పడిపోయే అవకాశం ఉందని టెక్నికల్ విశ్లేషకుల అంచనా. ముఖ్యం గా ఆటోమొబైల్ విడిభాగాలు, టెక్స్‌టైల్స్, ఫార్మా, జువెలరీ, రొయ్యల ఎగుమతి కంపెనీల షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తే అవకాశం ఉందని భావిస్తున్నారు. గురువారం నాటి నిఫ్టీ ఓపెనింగ్‌కు సూచికగా భావించే గిఫ్ట్ నిఫ్టీ, ట్రంప్ ప్రకటన వెలువడిన కొద్ది సేపటికే 24,700 పాయింట్ల దిగువకు పడిపోయింది. దీనికి తోడు గురువారం నాటి ఎఫ్ అండ్ ఓ సెటిల్‌మెంట్ భయాలూ మార్కెట్‌ను వెంటాడుతున్నాయి.
నష్టాల్లో ఏడీఆర్‌లు: ట్రంప్ సుంకాల ప్రకటనతో అమెరికా స్టాక్ మార్కెట్‌లో భారత కంపెనీలు జారీ చేసిన ఏడీఆర్‌లూ నష్టాల్లోకి జారుకున్నాయి. ఐసీఐసీఐ బ్యాంక్ (1.2ు), హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంక్ (1.06ు), విప్రో (1.7ు), ఇన్ఫోసిస్ (0.78ు), డాక్టర్ రెడ్డీ ల్యాబ్స్ (3.83ు) ఏడీఆర్‌లు భారీగా నష్టపోయాయి.
రూపాయి ఢమాల్: డాలర్ మారకంలో రూపాయి విలువ మూడేళ్ల కనిష్ఠ స్థాయికి దిగజారింది. బుధవారం ఉదయం 19 పైసల నష్టంతో రూ.87.10 వద్ద ప్రారంభమైన రూపాయి చివరికి 89 పైసల నష్టంతో రూ.87.80 వద్ద ముగిసింది. ట్రంప్ ప్రకటనతో గురువారం రూపా యి మారకం రేటు మరింత పతనమయ్యే ప్రమాదం ఉందని భావిస్తున్నారు. ‘అమెరికా-భారత వాణిజ్య ఒప్పందంపై అనిశ్చితి ఇంకా కొనసాగుతోంది. చమురు ఽధర కూడా పెరుగుతోంది. వీటికి తోడు ఎఫ్‌పీఐల అమ్మకాలు కొనసాగుతున్నాయి. దీంతో డాలర్‌తో రూపాయి మారకం రేటు మరింత పతనమవుతుందని మా అంచ నా’ అని మిరాసె అసెట్ షేర్‌ఖాన్ సంస్థ రీసెర్చి అనలిస్టు అనూజ్ చౌదరి చెప్పారు. వచ్చే కొద్ది రోజుల్లో డాలర్‌తో రూపాయి 87 - 87.90 మధ్య ట్రేడయ్యే అవకాశం ఉందన్నారు. నెలాఖరులో దిగుమతిదారుల నుంచి డాలర్లకు డిమాండ్ పెరగడం సైతం ఫారెక్స్ మార్కెట్‌లో రూపాయి మారకం రేటును కుంగదీస్తోంది.
రెండో రోజూ లాభాల్లో సెన్సెక్స్
ట్రంప్ సుంకాల భయం వెంటాడడంతో బుధవారం దేశీయ స్టాక్ మార్కెట్ పెద్దగా లాభాలు నమోదు చేయలేదు. సెన్సెక్స్ 143.91 పాయింట్ల లాభంతో 81,481.86 వద్ద, నిప్టీ 50 ఇండెక్స్ 33.95 పాయింట్ల లాభంతో 24,855.05 వద్ద ముగిశాయి. అమెరికా సుంకాల భయం, ఎఫ్‌పీఐల కొనుగోళ్ల జోరు తగ్గడం బుధవారం సూచీల జోరుకు పగ్గాలు వేశాయి. అయితే ఎల్ అండ్ టీ షేర్లలో భారీ కొనుగోళ్లు సూచీలను లాభాలవైపు నడిపించాయి. సన్ ఫార్మా, ఎన్‌టీపీసీ, మారుతీ, ఎయిర్‌టెల్, ట్రెంట్, యాక్సిస్ బ్యాంకు షేర్ల కొనుగోళ్లూ ఇందుకు దోహ దం చేశాయి.
ఇవి కూడా చదవండి
రష్యాలో భారీ భూకంపం.. జపాన్, అమెరికాలో సునామీ అలర్ట్
ఆగస్టులో 15 రోజులు బ్యాంకులకు సెలవులు.. ముందే ప్లాన్ చేసుకోండి
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి