Share News

Trade Tensions Hit: 6 సెషన్లలో రూ 18000 కోట్లు

ABN , Publish Date - Aug 11 , 2025 | 05:23 AM

అమెరికా-ఇండియా వాణిజ్య ఉద్రిక్తతలు ఈక్విటీ మార్కెట్‌పై తీవ్ర ప్రభా వం చూపుతున్నాయి. వర్తమాన ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో కార్పొరేట్‌ కంపెనీల ఫలితాలు కూడా నిరాశావహంగా ఉండ డం, ఫారెక్స్‌ మార్కెట్లో...

Trade Tensions Hit: 6 సెషన్లలో రూ 18000 కోట్లు

ఆగస్టులో ఎఫ్‌పీఐ నిధుల ఉపసంహరణ వెల్లువ

న్యూఢిల్లీ: అమెరికా-ఇండియా వాణిజ్య ఉద్రిక్తతలు ఈక్విటీ మార్కెట్‌పై తీవ్ర ప్రభా వం చూపుతున్నాయి. వర్తమాన ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో కార్పొరేట్‌ కంపెనీల ఫలితాలు కూడా నిరాశావహంగా ఉండ డం, ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి బలహీనత వంటి పరిణామాలు విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లను (ఎఫ్‌పీఐ) నిధుల ఉపసంహరణకు పురి గొల్పుతున్నాయి. ఫలితంగా ఎఫ్‌పీఐలు ఆగస్టు నెలలో ఇంతవరకు అంటే కేవ లం ఆరు ట్రేడింగ్‌ సెషన్లలో రూ.18,000 కోట్ల మేరకు ఈక్విటీలను విక్రయించారు. దీంతో 2025 సంవత్సరంలో ఇప్పటివరకు వారు తరలించుకుపోయిన నిధుల పరిమాణం రూ.1.13 లక్షల కోట్లకు చేరింది. డిపాజిటరీల వద్ద ఉన్న సమాచారం ప్రకారం జూలై నెలలో వారు నికరంగా రూ.17,741 కోట్లు తరలించుకుపోగా ఈ నెల 8వ తేదీ నాటికే నికరంగా రూ.17,924 కోట్లు ఉపసంహరించారు. మార్చి నుంచి జూన్‌ నెలల మధ్య కాలంలో వారు రూ.38,673 కోట్లు ఇన్వెస్ట్‌ చేశారు. అయితే ప్రస్తుతం ఎఫ్‌ఫీఐల సెంటిమెంట్‌ చాలా బలహీనంగా ఉన్నదని, వారు ఏ మాత్రం రిస్క్‌ భరించే స్థితిలో లేరని ఏంజెల్‌వన్‌ సీనియర్‌ ఫండమెంటల్‌ అనలిస్ట్‌ వకర్‌ జావేద్‌ ఖాన్‌ అన్నారు. ప్రధానంగా భారతీయ ఉత్పత్తులపై అమెరికా రెండు దశల్లో 50ు సుంకాలు విధించడం సెంటిమెంట్‌పై అధిక ప్రభావం చూపిందని అంటున్నారు. అమెరికన్‌ ట్రెజరీ రాబడులు మెరుగ్గా ఉండడం విదేశీ ఇన్వెస్టర్లను ఆకర్షిస్తున్న అంశమని ఖాన్‌ చెప్పారు.


భారత్‌పే లిస్టింగ్‌ యోచన వాయిదా

పబ్లిక్‌ ఇష్యూకి రావాలన్న ఆలోచనను భారత్‌ పే ప్రస్తుతానికి వాయిదా వేసుకుంది. మార్కెట్‌ పరిస్థితులు చక్కబడిన తర్వాత మాత్రమే లిస్టింగ్‌ చేయాలనుకుంటున్నట్టు తెలిపింది. ఈ లోగా అవసరం మేరకు ఇతర మార్గాల ద్వారా నిధులు సమీకరించాలని భావిస్తున్నట్టు కంపెనీ సీఈఓ నళిన్‌ నేగి చెప్పారు. తాము నిర్దేశించుకున్న లక్ష్యాలను నిర్దేశిత సమయం కన్నా ముందుగానే సాధించామని ఆయన అన్నారు.

19న రెండు ఐపీఓలు

షిప్పింగ్‌, లాజిస్టిక్‌ సొల్యూషన్లు అందించే శ్రీజి షిప్పింగ్‌ గ్లోబల్‌, సూపర్‌ మార్కెట్‌ చెయిన్‌ పటేల్‌ రిటైల్‌ ఈ నెల 19న (వచ్చే మంగళవారం) పబ్లిక్‌ ఇష్యూలు జారీ చేయనున్నాయి. 21న రెండు ఇష్యూలు ముగుస్తాయి. ఇష్యూలో షేర్ల ధర శ్రేణిని రెండు కంపెనీలు సోమవారం ప్రకటించనున్నాయి. ఈ ఏడాది ఇప్పటివరకు 44 పబ్లిక్‌ ఇష్యూలు జారీ అయ్యాయి. బ్లూస్టోన్‌ జువెలరీ, లైఫ్‌స్టైల్‌ ఇష్యూలు సోమవారం, ఆగ్రో ఆధారిత సంస్థ రీగల్‌ రీసోర్సెస్‌ ఇష్యూ మంగళవారం ప్రారంభం కానున్నాయి.

ఈ వార్తలు కూడా చదవండి..

జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డిపై చర్యలకు రంగం సిద్ధం..!

ప్రాజెక్ట్‌లను నిర్వీర్యం చేసిన బీఆర్ఎస్

For More Telangana News And Telugu News

Updated Date - Aug 11 , 2025 | 05:23 AM