Share News

Sai Life Sciences: సాయి లైఫ్‌ సైన్సె్‌సకు టీపీజీ గుడ్‌బై

ABN , Publish Date - Aug 27 , 2025 | 05:17 AM

హైదరాబాద్‌ కేంద్రంగా ఉన్న ఫార్మా కంపెనీ సాయి లైఫ్‌ సైన్సె్‌సకి అమెరికా కేంద్రంగా పనిచేసే ప్రముఖ ప్రైవేట్‌ ఈక్విటీ (పీఈ) సంస్థ టీపీజీ గుడ్‌బై చెప్పింది. సాయి లైఫ్‌ ఈక్విటీలో తనకు ఉన్న...

Sai Life Sciences: సాయి లైఫ్‌ సైన్సె్‌సకు టీపీజీ గుడ్‌బై

14.72 శాతం వాటా రూ.2,675 కోట్లకు విక్రయం

న్యూఢిల్లీ: హైదరాబాద్‌ కేంద్రంగా ఉన్న ఫార్మా కంపెనీ సాయి లైఫ్‌ సైన్సె్‌సకి అమెరికా కేంద్రంగా పనిచేసే ప్రముఖ ప్రైవేట్‌ ఈక్విటీ (పీఈ) సంస్థ టీపీజీ గుడ్‌బై చెప్పింది. సాయి లైఫ్‌ ఈక్విటీలో తనకు ఉన్న 3.07 కోట్ల షేర్లను (14.72 శాతం) మంగళవారం ఓపెన్‌ మార్కెట్‌ లావాదేవీల ద్వారా రూ.2,675.64 కోట్లకు విక్రయించింది. మూడు విడతలుగా ఒక్కో షేరును రూ.871.01-871.86 మధ్య విక్రయించింది. ఇందులో 14.06 లక్షల షేర్లును ప్యారిస్‌ కేంద్రంగా పనిచేసే సొసైటీ జనరల్‌, గోల్డ్‌మన్‌ శాచ్‌ సింగపూర్‌ 11.04 లక్షల షేర్లను కొనుగో లు చేశాయి. మిగతా వాటాలను ఎవరు కొన్నారనే విషయం ఇంకా వెల్లడి కాలేదు. ఈ ఏడాది జూన్‌లోనూ టీపీజీ.. సాయి లైఫ్‌ సైన్సెస్‌ ఈక్విటీలో 10 శాతం వాటాను రూ.1,505 కోట్లకు విక్రయించింది.

ఇవీ చదవండి:

హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్‌ మెగా డీల్‌

ఫ్లిప్‌కార్ట్‌లో 2.2 లక్షల సీజనల్‌ ఉద్యోగాలు

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 27 , 2025 | 05:17 AM