Share News

Top100 Domestic Brands in India: టాప్‌ 100 దేశీయ బ్రాండ్ల విలువ రూ 46.32 లక్షల కోట్లు

ABN , Publish Date - Nov 20 , 2025 | 06:19 AM

భారత్‌లోని టాప్‌-100 బ్రాండ్ల మొత్తం విలువ ఈ ఏడాదిలో 52,350 కోట్ల డాలర్లకు (రూ.46.32 లక్షల కోట్లు) చేరుకుందని లండన్‌కు చెందిన మార్కెట్‌ రీసెర్చ్‌ కంపెనీ కాంటార్‌ వెల్లడించింది. ఇది భారత జీడీపీలో...

Top100 Domestic Brands in India: టాప్‌ 100 దేశీయ బ్రాండ్ల విలువ రూ 46.32 లక్షల కోట్లు

  • జీడీపీలో 13 శాతానికి సమానం

  • హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంక్‌ టాప్‌ బ్రాండ్‌

న్యూఢిల్లీ: భారత్‌లోని టాప్‌-100 బ్రాండ్ల మొత్తం విలువ ఈ ఏడాదిలో 52,350 కోట్ల డాలర్లకు (రూ.46.32 లక్షల కోట్లు) చేరుకుందని లండన్‌కు చెందిన మార్కెట్‌ రీసెర్చ్‌ కంపెనీ కాంటార్‌ వెల్లడించింది. ఇది భారత జీడీపీలో దాదాపు 13 శాతానికి సమానమని ‘కాంటార్‌ బ్రాండ్స్‌ రిపోర్ట్‌ 2025’ పేరుతో బుధవారం విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. ఈసారి జాబితాలోని బ్రాండ్ల మొత్తం విలువ వార్షిక ప్రాతిపదికన 6 శాతం పెరిగింది. భారత ఆర్థిక వ్యవస్థలో బ్రాండ్‌ విలువ ప్రాముఖ్యత పెరుగుతున్నదని, అంతర్జాతీయ విస్తరణ ద్వారా మరింత వృద్ధి చెందేందుకు అవకాశాలున్నాయని నివేదిక అభిప్రాయపడింది.

మరిన్ని విశేషాలు...

  • ప్రైవేట్‌ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంక్‌ మరోసారి దేశంలో అత్యంత విలువైన బ్రాండ్‌గా నిలిచింది. బ్యాంక్‌ బ్రాండ్‌ విలువ 18 శాతం వృద్ధితో దాదాపు 4,500 కోట్ల డాలర్లకు (రూ.3.98 లక్షల కోట్లు) చేరుకుంది. 2014లో బ్రాండ్స్‌ ఇండియా రిపోర్టు విడుదల చేయడం ప్రారంభ మైన నాటి నుంచి ఈ బ్యాంక్‌ బ్రాండ్‌ విలువ నాలుగింతలకు పైగా పెరిగింది.

  • దేశంలో అతి పెద్ద ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) 4,420 కోట్ల డాలర్ల (రూ.3.91 లక్షల కోట్లు) బ్రాండ్‌ విలువతో రెండో స్థానంలో ఉంది.

  • 4,110 కోట్ల డాలర్ల (రూ.3.64 లక్షల కోట్లు) బ్రాండ్‌ విలువతో ఎయిర్‌టెల్‌ మూడో స్థానాన్ని దక్కించుకుంది. ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ (2,550 కోట్ల డాలర్లు), ఐసీఐసీఐ బ్యాంక్‌ (2,060 కోట్ల డాలర్లు) వరుసగా 5, 6 స్థానాల్లో నిలిచాయి.

  • 100 బ్రాండ్ల మొత్తం విలువలో టాప్‌-10 బ్రాండ్ల వాటా 47 శాతంగా ఉంది.

  • బ్రాండ్‌ విలువ అత్యంత వేగంగా పెరుగుతున్న కంపెనీల్లో ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ ప్లాట్‌ఫామ్‌ జొమాటో వరుసగా రెండో ఏడాదీ అగ్రస్థానంలో ఉంది. జొమాటో బ్రాండ్‌ వేల్యూ గడిచిన ఏడాది కాలంలో 69 శాతం పెరిగింది.

  • అలా్ట్రటెక్‌ సిమెంట్‌, హ్యుండయ్‌ సహా 18 కంపెనీలకు ఈ జాబితాలో తొలిసారి చోటు లభించింది. 111 విభాగాలకు చెందిన 1,620 బ్రాండ్లపై 1.45 లక్షల మంది వెల్లడించిన అభిప్రాయాల ఆధారంగా ర్యాంకింగ్‌లు కేటాయించడం జరిగిందని కాంటార్‌ వెల్లడించింది.

ఇవీ చదవండి:

హిడ్మా ఎన్‌కౌంటర్.. ప్రొ.హరగోపాల్ కీలక వ్యాఖ్యలు

అందుకే మారేడుమిల్లికి వచ్చిన మావోయిస్టులు.. జిల్లా ఎస్పీ

Updated Date - Nov 20 , 2025 | 06:19 AM